అక్షరటుడే, ధర్పల్లి: Dharpally Police | నిజామాబాద్ (Nizamabad) జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. కూతురితో సహా తల్లి ఆత్మహత్య చేసుకున్న ఘటన కలకలం రేపింది. ధర్పల్లి మండలం (Dharpally) గోవింద్ పల్లికి చెందిన కీర్తన తన ఏడాది కూతురితో కలిసి నిప్పంటించుకుని ఆత్మహత్యకు పాల్పడింది.
Dharpally Police | ఆస్పత్రికి తరలించినా..
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బడాభీమ్‌గల్‌కు (Bada Bheemgal) చెందిన లావణ్య తన పెద్ద కూతురు కీర్తనను గోవింద్‌పల్లికి చెందిన ప్రదీప్‌కు ఇచ్చి పెళ్లి చేసింది. ఈ దంపతులకు ఇద్దరు కూతుర్లు ఉన్నారు. అయితే కీర్తనకు పుట్టిన రెండోకూతురు సాన్వి(1)కి గ్రహణం మొర్రి ఉంది. అప్పటి నుండి కీర్తన తనలోతాను మదనపడుతూ ఉండేది. పాప అలా పుట్టడానికి తానే కారణమని.. తాను ఆత్మహత్య చేసుకుంటానని అంటుండేది. ఈ క్రమంలో బుధవారం సాయంత్రం ఇంట్లో లోపలి నుంచి గడియ వేసుకుని పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకుంది. దీంతో మంటలు పాపకు కుడా అంటుకున్నాయి. గమనించిన కుటుంబీకులు వెంటనే డోర్లు పగులగొట్టి ఇద్దరిని ఆస్పత్రికి తరలించారు. అప్పటికే వారు మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. మృతురాలు కీర్తన తల్లి లావణ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
ఇది కూడా చదవండి : Women Reservation Bill | దేశ చరిత్రలో ఇది ఒక కీలక ఘట్టం : ప్రధాని మోదీ
