అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Women Reservation Bill | మహిళా రిజర్వేషన్ బిల్లుపై గురువారం మధ్యాహ్నం ప్రధాని మోదీ (PM Modi) లోక్‌సభలో మాట్లాడారు. చరిత్ర సృష్టించడానికి పార్లమెంట్‌కు ఇది ఒక సువర్ణ అవకాశం అన్నారు.
దేశానికి సరికొత్త దిశను ఇచ్చే ప్రయత్నం చేస్తున్నామని మోదీ చెప్పారు. మహిళలకు అధికారం అంటేనే.. వికసిత్ భారత్ (Vikasit Bharat) అని అర్థం అన్నారు. దీని కోసం 30 ఏళ్ల పాటు ప్రయత్నాలు జరిగినా గతంలో సాకారం కాలేదన్నారు. ఈ బిల్లును వ్యతిరేకించే వారిని మహిళాలోకం క్షమించదని మోదీ పేర్కొన్నారు. మహిళా రిజర్వేషన్ బిల్లును వ్యతిరేకించిన వారిని ఎన్నికల్లో మహిళలు ఓడించారని తెలిపారు. బిల్లుకు మద్దతిచ్చే పార్టీలకే రాజకీయ మనుగడ ఉంటుందన్నారు.
Women Reservation Bill | ఏకగ్రీవంగా మద్దతు ఇవ్వాలి
ఈ బిల్లును తేవడంలో ఎలాంటి రాజకీయ ఉద్దేశం లేదని మోదీ స్పష్టం చేశారు. అన్ని పార్టీలు ఏకగ్రీవంగా మద్దతివ్వాలని కోరారు. మహిళలకు నిర్ణయాధికారం ఉండాలనేదే తమ లక్ష్యమన్నారు. మనం దీనిని ఇప్పటికే ఆలస్యం చేశామని ఆయన పేర్కొన్నారు.
Women Reservation Bill | అన్ని పార్టీలతో సంప్రదింపులు
మహిళా రిజర్వేషన్‌పై అన్ని రాజకీయ పార్టీలతో సంప్రదింపులు జరిగాయని మోదీ తెలిపారు. ఒక్క పార్టీ మినహా తాము కలిసిన వారందరూ ఎటువంటి సూత్రప్రాయమైన వ్యతిరేకతను వ్యక్తం చేయలేదన్నారు. ఇప్పుడు మాత్రం ఒక రాజకీయ కోణం తీసుకు వచ్చారని విమర్శించారు. దేశ జనాభాలో సగం ఉన్న మహిళలు విధాన రూపకల్పనలో భాగస్వాములు కావడమే అసలైన వికసిత్ భారత్ అన్నారు. ఈ బిల్లు ఆమోదం పొందితే అందుకు సభలో ఉన్న వారు అందరు కారణం అన్నారు.
#WATCH | Speaking in Lok Sabha on women’s reservation and delimitation, PM Modi says, “This will be in favour of the country’s democracy, it will be in favor of the country’s collective decision-making, and we will all be entitled to the credit. Neither the Treasury Department… pic.twitter.com/jaNJMArnpk
— ANI (@ANI) April 16, 2026
ఇది కూడా చదవండి : India Austria Meeting | ఆస్ట్రియా ఛాన్స్‌లర్‌తో ప్రధాని సమావేశం.. కీలక ఒప్పందాలు
