Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Lok Sabha  | మూడు కీలక బిల్లులపై రేపు లోక్​సభలో ఓటింగ్​
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

జాతీయం - Lok Sabha  | మూడు కీలక బిల్లులపై రేపు లోక్​సభలో ఓటింగ్​

జాతీయం

Lok Sabha  | మూడు కీలక బిల్లులపై రేపు లోక్​సభలో ఓటింగ్​

మహిళా రిజర్వేషన్లు, డీలిమిటేషన్​ బిల్లులపై శుక్రవారం సాయంత్రం 4 గంటలకు ఓటింగ్‌ జరుగుతుందని స్పీకర్‌ ఓం బిర్లా ప్రకటించారు.

Srinivas kolluri
Last updated: ఏప్రిల్ 16, 2026 1:17 సా.
Srinivas Kolluri
7 గంటలు ago
Share
Lok Sabha

అక్షరటుడే, వెబ్​డెస్క్: Lok Sabha  | చట్టసభల్లో మహిళా రిజర్వేషన్ల బిల్లు (Women’s Reservation Bill), డీలిమిటేషన్‌ ద్వారా నియోజకవర్గాలను పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం 3 బిల్లులను లోక్‌సభ (Lok Sabha)లో ప్రవేశ పెట్టింది. కీలకమైన ఈ మూడు బిల్లులపై శుక్రవారం సాయంత్రం 4 గంటలకు ఓటింగ్‌ జరుగుతుందని స్పీకర్‌ ఓం బిర్లా ప్రకటించారు.

Contents
  • Lok Sabha  | సుదీర్ఘంగా చర్చ
    • Lok Sabha  | మహిళలకు 272 సీట్లు

కేంద్ర మంత్రులు అమిత్​ షా, అర్జున్ రామ్ మేఘవాల్ (Arjun Ram Meghwal) మూడు బిల్లులను సభలో ప్రవేశ పెట్టారు. రాజ్యాంగ సవరణ 131 బిల్లు ప్రవేశ పెట్టడంపై విపక్షాలు ఓటింగ్​ కోరారు. దీంతో స్పీకర్​ ఓటింగ్​ నిర్వహించారు. బిల్లు ప్రవేశ పెట్టడానికి మద్దుతగా.. 207 ఓట్లు, వ్యతిరేకంగా 126 ఓట్లు వచ్చాయి. దీంతో సభలో బిల్లును ప్రవేశ పెట్టారు.

Lok Sabha  | సుదీర్ఘంగా చర్చ

ఓటింగ్‌కు ముందు బిల్లులపై సుదీర్ఘ చర్చ జరుగుతుందని స్పీకర్​ తెలిపారు. 15 నుంచి 18 గంటల పాటు జరుగుతుందన్నారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా (Amit Shah) మాట్లాడుతూ.. మహిళా రిజర్వేషన్ల ప్రక్రియకు తార్కిక ముగింపునకు చేర్చడానికే ఈ రెండు బిల్లులను కలిపి తీసుకువచ్చామని వెల్లడించారు.

Lok Sabha  | మహిళలకు 272 సీట్లు

కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘవాల్ మాట్లాడుతూ..మహిళా రిజర్వేషన్ బిల్లు 2023లో ఆమోదం పొందిందన్నారు. 2026 తర్వాత జరిగే జనాభా గణన, నియోజకవర్గాల పునర్విభజన ఆధారంగా దీనిలోని నిబంధనలను అమలు చేయాలని కొత్త బిల్లు తెచ్చినట్లు తెలిపారు. డీలిమిటేషన్​తో లోక్‌సభ సభ్యుల సంఖ్యలో 50 శాతం పెరుగుదల ఉంటుందని వివరించారు. దీంతో మొత్తం సీట్ల సంఖ్య 815కు చేరుకుంటుందని, ఇందులో 272 సీట్లు మహిళలకు కేటాయిస్తామన్నారు. దీంతో ఏ రాష్ట్రానికి నష్టం ఉండదని స్పష్టం చేశారు.

ఇది కూడా చదవండి..: India Solar Power Growth | సౌర‘శక్తి’ సామ్రాజ్యంలో నంబర్ 2గా భారత్

Small Notes ATM | ఇక ఏటీఎంల నుంచే చిన్న నోట్లు.. రూ.10, రూ.20, రూ.50 డ్రా చేసే కొత్త వ్యవస్థకు కేంద్రం సిద్ధం
Hormuz Indian Death | హార్ముజ్​ జలసంధి సమీపంలో భారతీయుడి మృతి
Rajya Sabha Nomination | రాజ్యసభ అభ్యర్థులుగా అభిషేక్‌ సింఘ్వీ, వేం నరేందర్‌రెడ్డి నామినేషన్‌
TCS Nashik Case | టీసీఎస్​ నాసిక్​ బీపీవో సంస్థ మూసివేత.. కేసులో వెలుగులోకి సంచలన విషయాలు
Kuwait Indian Embassy | కువైట్‌లో ఉద్రిక్తత పరిస్థితులు.. భారతీయులకు రాయబార కార్యాలయం కీలక సూచనలు
TAGGED:breaking news Indiadelimitation billindia politicsindian governmentlegislative votingLok SabhaParliamentwomen reservation bill
Share This Article
Facebook Whatsapp Whatsapp
Srinivas kolluri
BySrinivas Kolluri
Follow:
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Previous Article Medipally Police Medipally Police | జ్యూస్ అని చెప్పి.. బాలుడికి యాసిడ్ తాగించిన పిన్ని
Next Article India Austria Meeting India Austria Meeting | ఆస్ట్రియా ఛాన్స్​లర్​తో ప్రధాని సమావేశం.. కీలక ఒప్పందాలు
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?