Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: TCS Nashik Case | టీసీఎస్​ నాసిక్​ బీపీవో సంస్థ మూసివేత.. కేసులో వెలుగులోకి సంచలన విషయాలు
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

జాతీయం - TCS Nashik Case | టీసీఎస్​ నాసిక్​ బీపీవో సంస్థ మూసివేత.. కేసులో వెలుగులోకి సంచలన విషయాలు

జాతీయం

TCS Nashik Case | టీసీఎస్​ నాసిక్​ బీపీవో సంస్థ మూసివేత.. కేసులో వెలుగులోకి సంచలన విషయాలు

టీసీఎస్​ నాసిక్​ క్యాంపస్​ వ్యవహారంలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. దీంతో ఆఫీస్​లో సిబ్బందికి సంస్థ వర్క్​ ఫ్రం హోమ్​ ఇచ్చింది.

Srinivas kolluri
Last updated: ఏప్రిల్ 16, 2026 2:08 సా.
Srinivas Kolluri
8 గంటలు ago
Share
TCS Nashik Case

అక్షరటుడే, వెబ్​డెస్క్: TCS Nashik Case | టీసీఎస్​ నాసిక్​ క్యాంపస్​ వ్యవహారంలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. BPO యూనిట్‌లో జరిగిన లైంగిక వేధింపులు, కార్యాలయ దుష్ప్రవర్తన ఆరోపణల కేసు విచారణను అధికారులు వేగవంతం చేశారు.

Contents
  • TCS Nashik Case | ముఠాగా ఏర్పడి..
    • TCS Nashik Case | మారువేషంలో వెళ్లి..
      • TCS Nashik Case | చంపేస్తామని బెదిరించారు
        • TCS Nashik Case | ఉద్యోగులకు వర్క్‌ఫ్రమ్‌ హోం..

టాటా గ్రూప్ కంపెనీ (Tata Group Company) హెచ్‌ఆర్ మేనేజర్ నిదా ఖాన్ కీలక నిందితురాలిగా పోలీసులు గుర్తించారు. ఆమెను అరెస్ట్ చేశారు. మరో ఏడుగురు పురుషులను సైతం అదుపులోకి తీసుకున్నారు. నిందితులకు సహకరించిన మరో మహిళ పరారీలో ఉంది. లైంగిక వేధింపులు, దుష్ప్రవర్తనకు సంబంధించి పదేపదే ఫిర్యాదులు ఆమె దృష్టికి వచ్చినా, ఖాన్ (HR Manager Nida Khan) చర్యలు తీసుకోవడంలో విఫలమయ్యారని పలువురు మహిళా ఉద్యోగులు ఆరోపించారు.

TCS Nashik Case | ముఠాగా ఏర్పడి..

పెళ్లి చేసుకుంటానని నమ్మించి తనను మోసం చేశాడని ఓ ఉద్యోగిని ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు అయింది. ఈ కేసు విచారణ సందర్భంగా సంచలన విషయాలు వెలుగు చూశాయి. తమపై సైతం లైంగిక వేధింపులు జరిగాయని మరికొంతమంది మహిళలు ముందుకు వచ్చారు. ఫిబ్రవరి 2022 నుండి మార్చి 2026 మధ్య కాలంలో జరిగాయని ఆరోపణలు ఉన్నాయి. అనుచితంగా తాకడం, అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేయడం, వెంబడించడం, ఇతర రకాల వేధింపులు వంటి ఆరోపణలు ఉన్నాయి. మహిళా ఉద్యోగులే లక్ష్యంగా ఏడుగురు ఉద్యోగులు ముఠాగా ఏర్పడి వేధింపులకు పాల్పడినట్లు నాసిక్ పోలీసులు వెల్లడించారు. వారిని మతం మారమని ఒత్తిడి చేసినట్లు గుర్తించారు.

TCS Nashik Case | మారువేషంలో వెళ్లి..

ఫిర్యాదుల నేపథ్యంలో నాసిక్ పోలీసులు (Nashik Police) ఒక రహస్య ఆపరేషన్ నిర్వహించారు. ఇందులో భాగంగా మహిళా అధికారులు మారువేషంలో టీసీఎస్ కార్యాలయం (TCS Office)లోకి వెళ్లారు. ఆ సమయంలో ఒక నిందితుడు అసభ్యంగా ప్రవర్తిస్తూ పట్టుబడినట్లు ఆరోపణలు ఉన్నాయి. కాగా తమను లైంగికంగా వేధిస్తున్నారని హెచ్​ఆర్​కు ఫిర్యాదు చేసిన పట్టించుకోలేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. అంతేగాకుండా ఆమె నిందితులకు అనుకూలంగా వ్యవహరించారు. 9 మంది నిందితుల్లో కొందరు టీమ్​ లీడర్​ స్థాయిలో పని చేస్తున్నారు. వారు తమ కింద పని చేసే వారిని లైంగికంగా వేధించేవారు.

TCS Nashik Case | చంపేస్తామని బెదిరించారు

తన భార్యకు పిల్లలు పుట్టరని తెలుసుకున్న తర్వాత, బిడ్డ కావాలంటే తన వద్దకు పంపమని తన టీమ్ లీడర్ సూచించాడని ఓ ఉద్యోగి మీడియాకు తెలిపారు.లీడర్ తౌసిఫ్ అక్తర్, సహోద్యోగి డానిష్ షేక్ నా భార్యను వారి వద్దకు పంపమని వ్యక్తిగత వ్యాఖ్యలు చేశారు. ఒక వాగ్వాదం సందర్భంగా, తౌసిఫ్ కోపంతో నాపైకి ఫ్యాన్ విసిరి, నన్ను చంపేస్తానని బెదిరించాడు. నేను ఈ విషయాన్ని హెచ్‌ఆర్‌కు ఫిర్యాదు చేశాను అని చెప్పారు.

TCS Nashik Case | ఉద్యోగులకు వర్క్‌ఫ్రమ్‌ హోం..

లైంగిక వేధింపులు, మత మార్పిడి ఆరోపణల నేపథ్యంలో టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (Tata Consultancy Services) నాసిక్ కార్యాలయంలోని ఉద్యోగులను ఇంటి నుంచే పనిచేయాలని ఆదేశించినట్లు అధికారులు గురువారం తెలిపారు. ఉద్యోగుల సౌకర్యం, భద్రత దృష్ట్యా నాసిక్ కేంద్రంలోని ఉద్యోగులను ఇంటి నుంచే పనిచేయాలని కోరినట్లు పేర్కొన్నారు. సంస్థ కార్యకలాపాలను తాత్కాలికంగా నిలిపివేసింది.

ఇది కూడా చదవండి..: India Austria Meeting | ఆస్ట్రియా ఛాన్స్​లర్​తో ప్రధాని సమావేశం.. కీలక ఒప్పందాలు

Temple Stampede Bihar | ఆలయంలో తొక్కిసలాట.. 8 మంది మృతి
Noida Workers Protest | జీతాలు పెంచాలని కార్మికుల ఆందోళన.. నోయిడాలో ఉద్రిక్తత
PNG Connections India | పెరిగిన పీఎన్‌జీ కనెక్షన్లు..
Vijay CBI Notice | టీవీకే చీఫ్​ విజయ్​కు సీబీఐ నోటీసులు
Modi Attacks TMC | టీఎంసీలో వణుకు పుడుతోంది..: ప్రధాని మోదీ
TAGGED:HR Manager Nida KhanNashik PoliceTata Consultancy ServicesTata Group CompanyTCS Nashik CaseTCS Office
Share This Article
Facebook Whatsapp Whatsapp
Srinivas kolluri
BySrinivas Kolluri
Follow:
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Previous Article India Austria Meeting India Austria Meeting | ఆస్ట్రియా ఛాన్స్​లర్​తో ప్రధాని సమావేశం.. కీలక ఒప్పందాలు
Next Article Turmeric Board Nizamabad Turmeric Board Nizamabad | అర్వింద్​ తెచ్చిన పసుపు బోర్డుతో ఏం లాభం..?: డీసీసీ అధ్యక్షుడు నగేష్​ రెడ్డి
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?