Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Loan Waiver Issue | రుణమాఫీ అడిగితే కోర్టుల చుట్టూ తిప్పుతారా..? కాంగ్రెస్ సర్కారుపై వేముల నిప్పులు
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

నిజామాబాద్ - Loan Waiver Issue | రుణమాఫీ అడిగితే కోర్టుల చుట్టూ తిప్పుతారా..? కాంగ్రెస్ సర్కారుపై వేముల నిప్పులు

నిజామాబాద్

Loan Waiver Issue | రుణమాఫీ అడిగితే కోర్టుల చుట్టూ తిప్పుతారా..? కాంగ్రెస్ సర్కారుపై వేముల నిప్పులు

రైతులకు ఇచ్చిన రుణమాఫీ నెరవేర్చాలని కోరితే, అక్రమ కేసులు బనాయించి కోర్టుల చుట్టూ తిప్పుతారా? మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ధ్వజమెత్తారు.

Srinivas kolluri
Last updated: ఏప్రిల్ 17, 2026 3:52 సా.
Srinivas Kolluri
4 గంటలు ago
Share
Loan Waiver Issue

​అక్షరటుడే, భీమ్​గల్: Loan Waiver Issue | రైతులకు ఇచ్చిన రుణమాఫీ హామీని నెరవేర్చాలని కోరితే, వారిపై అక్రమ కేసులు బనాయించి కోర్టుల చుట్టూ తిప్పడం కాంగ్రెస్ ప్రభుత్వ నిరంకుశ పాలనకు నిదర్శనమని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి (Vemula Prashanth Reddy) ధ్వజమెత్తారు.

కమ్మర్​పల్లి (Kammarpalli)కి చెందిన బీఆర్ఎస్ నాయకులు, రైతులు శుక్రవారం ఆర్మూర్ కోర్టులో విచారణకు హాజరైన సందర్భంగా ఆయన వారికి సంఘీభావం తెలిపారు.

Loan Waiver Issue | 52 వేల మందికి రుణమాఫీ కావాల్సి ఉండగా..

​ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బాల్కొండ నియోజకవర్గం (Balkonda Constituency)లో 52 వేల మంది రైతులకు రుణమాఫీ కావాల్సి ఉండగా, కేవలం 22 వేల మందికే వర్తింపజేసి చేతులు దులుపుకున్నారని విమర్శించారు. మిగిలిన 30వేల మంది రైతుల (Farmers) పరిస్థితి ఏమిటని ప్రశ్నించినందుకు రైతులపై కేసులు పెట్టడం అత్యంత బాధాకరమన్నారు. రెండేళ్లుగా అన్నదాతలను ఇబ్బందులకు గురిచేయడం ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరికి అద్దం పడుతోందని మండిపడ్డారు. తక్షణమే రైతులపై ఉన్న కేసులను ఎత్తివేసి, అర్హులైన వారందరికీ రుణమాఫీ అమలు చేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో రైతులతో కలిసి పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు.

ఇది కూడా చదవండి..: Tejasvi Surya Controversy | ఎంపీ తేజస్వి సూర్యపై చర్య తీసుకోవాలి

Leopard Carcass Found | చిరుత కళేబరం లభ్యం.. వేటగాళ్ల పనేనని అనుమానాలు..!
Kamareddy Children Death | చిన్నారుల మిస్సింగ్​ విషాదాంతం.. బావిలో విగతజీవులుగా..
Petrol Diesel Shortage Rumors | నిజామాబాద్​లో పెట్రోల్, డీజిల్ కొరత లేదు.. వదంతులను నమ్మవద్దు: సీపీ
Kamareddy Municipal Controversy | బల్దియా కమిషనర్, టీపీవోలను సరెండర్ చేయాల్సిందే..: కౌన్సిలర్ల ఏకగ్రీవ తీర్మానం
Tejasvi Surya Controversy | ఎంపీ తేజస్వి సూర్యపై చర్య తీసుకోవాలి
TAGGED:agriculture newsBalkonda ConstituencyBRS CongressFarm Loan WaiverFarmersfarmers issuesKammarpalliLoan Waiver Issuepolitical news indiavemula prashanth reddy
Share This Article
Facebook Whatsapp Whatsapp
Srinivas kolluri
BySrinivas Kolluri
Follow:
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Previous Article CM Revanth Reddy CM Revanth Reddy | 30 లక్షల మెట్రిక్ టన్నుల బాయిల్డ్​ రైస్​ సేకరించాలి.. కేంద్రాన్ని కోరిన సీఎం
Next Article ACB Raids ACB Raids | ఎక్సైజ్​ సీఐ ఇంట్లో ఏసీబీ సోదాలు
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?