అక్షరటుడే, హైదరాబాద్: Croma Akshaya Tritiya Deals | అక్షయ తృతీయ (Akshaya Tritiya) పండుగ వేళ వినియోగదారులకు టాటా గ్రూప్‌నకు చెందిన క్రోమా (Croma) భారీ కానుకను ప్రకటించింది. ‘గోల్డెన్ డీల్స్’ పేరుతో ఎయిర్ కండిషనర్లు, పెద్ద స్క్రీన్ టీవీలు హోమ్ ఎంటర్‌టైన్‌మెంట్ ఉత్పత్తులపై ఏకంగా 50 శాతం వరకు తగ్గింపును ఇస్తోంది. ఏప్రిల్ 19వ తేదీ వరకు మాత్రమే అందుబాటులో ఉండే ఈ సేల్‌లో ఉచిత ఈఎంఐలు, క్యాష్‌బ్యాక్ భారీ ఎక్స్ఛేంజ్ బోనస్‌లు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి.
Croma Akshaya Tritiya Deals | వేసవి తాపానికి చెక్ – ఏసీలపై అదిరిపోయే ఆఫర్లు
పెరుగుతున్న ఎండల దృష్ట్యా ఇన్వర్టర్ ఏసీలపై క్రోమా బ్లాక్‌బస్టర్ డీల్స్ అందిస్తోంది. ఎంపిక చేసిన మోడళ్లపై రెండు ఈఎంఐలు ఉచితంగా లభించడమే కాకుండా, పాత ఏసీల ఎక్స్ఛేంజ్‌పై రూ. 8,500 వరకు అదనపు ప్రయోజనం పొందవచ్చు.
- శాంసంగ్ 1.5 టన్నుల ఇన్వర్టర్ ఏసీ: 51% తగ్గింపుతో రూ. 38,990 కే లభ్యం.
- బ్లూస్టార్ 1.5 టన్నుల ఇన్వర్టర్ ఏసీ: 43% తగ్గింపుతో రూ. 34,490 ధరకే సొంతం చేసుకోవచ్చు.
- గోద్రెజ్ 1.5 టన్నుల ఇన్వర్టర్ ఏసీ: కేవలం రూ. 28,383 ధరకే అందుబాటులో ఉంది.
- క్రోమా 1 టన్ను ఇన్వర్టర్ ఏసీ: రూ. 26,590 ధరకే దొరుకుతోంది.
Croma Akshaya Tritiya Deals | హోమ్ థియేటర్ అనుభూతి – పెద్ద టీవీలపై భారీ సేవింగ్స్
55 అంగుళాలు అంతకంటే పెద్ద స్క్రీన్ టీవీలపై కనీసం 25 శాతం తగ్గింపును క్రోమా ప్రకటించింది.
- శాంసంగ్ 55 అంగుళాల క్యూలెడ్ (QLED) 4కే టీవీ: 41% తగ్గింపుతో రూ. 50,990 కే లభిస్తోంది.
- సోనీ టీవీ ఆఫర్: 55 అంగుళాల సోనీ టీవీని నెలకు కేవలం రూ. 5,500 ఈఎంఐతో (30 నెలలు) కొనుగోలు చేయవచ్చు.
- 75 అంగుళాల టీవీలు: వీటి కొనుగోలుపై ఒక ఈఎంఐ పూర్తిగా ఉచితం.
- ఏఐ క్యూలెడ్/క్యూఎన్ఈడీ టీవీలు: నెలకు రూ. 2,999 ప్రారంభ ఈఎంఐతో నెక్స్ట్ జనరేషన్ టెక్నాలజీని ఇంటికి తెచ్చుకోవచ్చు.
Croma Akshaya Tritiya Deals | అదనపు ప్రయోజనాలు:
ఇన్‌స్టంట్ డిస్కౌంట్: రూ. 25 వేల కంటే ఎక్కువ విలువైన ఏసీలు, టీవీలు, ఫ్రిజ్‌లు, వాషింగ్ మెషీన్లపై నేరుగా 10 శాతం (రూ. 3,200 వరకు) అదనపు తగ్గింపు.
టాటా నియో స్పెషల్: టాటా నియో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ వాడే వారు యాపిల్, గూగుల్ ఉత్పత్తులపై 10% నియో కాయిన్స్ పొందవచ్చు.
విద్యార్థులకు మేలు: మ్యాక్‌బుక్ మోడళ్లపై విద్యార్థులు ఉపాధ్యాయుల కోసం ప్రత్యేకంగా 10 శాతం తగ్గింపు లభిస్తుంది.
ఎక్స్ఛేంజ్ బోనస్: పాత ఎలక్ట్రానిక్స్ మార్పిడిపై రూ. 15,000 వరకు గరిష్ట ఎక్స్ఛేంజ్ బోనస్ అందుబాటులో ఉంది.
“అక్షయ తృతీయ శుభసందర్భంగా వినియోగదారులు తమ ఇళ్లలో దీర్ఘకాలిక విలువ కలిగిన వస్తువులను కొనుగోలు చేస్తారు. వారి కోసం అత్యుత్తమ టెక్నాలజీని తక్కువ ధరకే అందించడమే మా లక్ష్యం” అని ఇన్ఫినిటీ రిటైల్ (క్రోమా) ప్రతినిధి తెలిపారు.
ఇది కూడా చదవండి..: Candescent Hyderabad | కోర్ ఇంజినీరింగ్, ఇన్నోవేషన్ హబ్‌గా భారత్: హైదరాబాద్‌లో కాండిసెంట్ కొత్త టెక్ సెంటర్ ప్రారంభం
