Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Stock Market Rally | పరుగులు తీస్తున్న స్టాక్ మార్కెట్లు.. రూ. 5 లక్షల కోట్లు పెరిగిన ఇన్వెస్టర్ల సంపద
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

బిజినెస్​ - Stock Market Rally | పరుగులు తీస్తున్న స్టాక్ మార్కెట్లు.. రూ. 5 లక్షల కోట్లు పెరిగిన ఇన్వెస్టర్ల సంపద

బిజినెస్​

Stock Market Rally | పరుగులు తీస్తున్న స్టాక్ మార్కెట్లు.. రూ. 5 లక్షల కోట్లు పెరిగిన ఇన్వెస్టర్ల సంపద

దేశీయ స్టాక్ మార్కెట్ పరుగులు తీసింది. సెన్సెక్స్ 122 పాయింట్లు, నిఫ్టీ 34 పాయింట్లు లాభపడ్డాయి. ఇన్వెస్టర్ల సంపద రూ. 5 లక్షల కోట్ల మేర పెరిగింది.

Srinivas kolluri
Last updated: ఏప్రిల్ 17, 2026 4:20 సా.
Srinivas Kolluri
9 గంటలు ago
Share
Stock Market Rally

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Stock Market Rally | పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు తగ్గే అవకాశాలు కనిపిస్తుండడం, క్రూడ్ ఆయిల్ (Crude Oil) ధరలు తగ్గుతుండడం, రూపాయి విలువ బలోపేతం అవుతుండడం, ఎఫ్ ఐఐలు నికర కొనుగోలుదారులుగా నిలుస్తుండడంతో దేశీయ స్టాక్ మార్కెట్‌ (Domestic Stock Market)పై ఇన్వెస్టర్లలో నమ్మకం బలపడుతోంది. దీంతో ఆసియా మార్కెట్లు నష్టాల బాటలో ఉన్నా.. మన మార్కెట్లు మాత్రం లాభాల బాటలో పయనించాయి. అన్ని రంగాల షేర్లు రాణించడంతో బుల్స్ ది పైచేయిగా నిలిచింది.

Contents
  • Stock Market Rally | నష్టాలతో ప్రారంభమై..
    • Stock Market Rally | అడ్వాన్సెస్ అండ్ డిక్లయిన్స్..
      • Stock Market Rally | రాణించిన ఎఫ్ఎంసీజీ..

Stock Market Rally | నష్టాలతో ప్రారంభమై..

శుక్రవారం ఉదయం సెన్సెక్స్ 12 పాయింట్ల నష్టంతో ప్రారంభమై మరో 250 పాయింట్లు కోల్పోయింది. కనిష్టాల వద్ద లభించిన కొనుగోళ్ల మద్దతుతో కోలుకుని 827 పాయింట్లు పెరిగింది. నిఫ్టీ 31 పాయింట్ల నష్టంతో ప్రారంభమై మరో 69 పాయింట్లు తగ్గింది. అక్కడినుంచి 275 పాయింట్లు లాభపడింది. చివరికి సెన్సెక్స్ 504 పాయింట్ల లాభంతో 78,493 వద్ద, నిఫ్టీ 156 పాయింట్ల లాభంతో 24,353 వద్ద స్థిరపడ్డాయి.

Stock Market Rally | అడ్వాన్సెస్ అండ్ డిక్లయిన్స్..

బీఎస్ఈలో నమోదైన కంపెనీలలో 3.043 కంపెనీలు లాభపడగా 1,284 స్టాక్స్ నష్టపోయాయి. 166 కంపెనీలు ఫ్లాట్‌గా ముగిశాయి. 175 కంపెనీలు 52 వారాల గరిష్టాల వద్ద ఉండగా.. 20 కంపెనీలు 52 వారాల కనిష్టాల వద్ద కదలాడాయి. బీఎసఈలో నమోదైన కంపెనీల సంపద విలువ రూ. 5 లక్షల కోట్లు పెరిగింది.

Stock Market Rally | రాణించిన ఎఫ్ఎంసీజీ..

దేశీయ స్టాక్ మార్కెట్ లో ఐటీ మినహా మిగిలిన సూచీలు రాణించాయి. నిఫ్టీలో ఎఫ్ఎంసీజీ ఇండెక్స్ 2.65 శాతం, క్యాపిటల్ గూడ్స్ 2.19 శాతం, పవర్ 1.95 శాతం, యుటిలిటీ 1.51 శాతం, ఎనర్జీ 1.43 శాతం, ఆయిల్ అండ్ గ్యాస్ 1.38 శాతం, మీడియా 1.34 శాతం, మెటల్, కన్జూమర్ డ్యూరెబుల్ ఇండెక్స్‌లు ఒక శాతానికిపైగా లాభపడ్డాయి. ఐటీ ఇండెక్స్ 0.02 శాతం నష్టపోయింది.

Top Gainers : బీఎస్ఈ సెన్సెక్స్‌లో 24 స్టాక్స్ లాభపడగా.. 6 స్టాక్స్ నష్టాలతో ముగిశాయి. హెచ్‌యూఎల్ 4.75 శాతం, పవర్‌గ్రిడ్ 1.86 శాతం, రిలయన్స్ 1.61 శాతం. బీఈఎల్ 1.56 శాతం, టెక్ మహీంద్రా 1.41 శాతం లాభపడ్డాయి.

Top Losers : సన్‌ఫార్మా 1.06 శాతం, ఎంఅండ్ ఎం 0.68 శాతం, హెచ్‌సీఎల్ టెక్ 0.57 శాతం, ఎల్‌టీ 0.54 శాతం, ఎటర్నల్ 0.06 శాతం నష్టపోయాయి.

ఇది కూడా చదవండి..: Croma Akshaya Tritiya Deals | క్రోమా ‘గోల్డెన్ డీల్స్’.. అక్షయ తృతీయ ఆఫర్ల సువర్ణావకాశం.. ఏసీలు, టీవీలపై 50% వరకు తగ్గింపు!

జూమ్ భారీ విస్తరణ.. ఆరు టెలికాం సర్కిళ్లలో ‘నేటివ్ ఇండియా’ ఫోన్ నంబర్లు
Crude Oil Effect | క్రూడ్ ఆయిల్ ఎఫెక్ట్.. స్టాక్ మార్కెట్‌లో భారీ పతనం
వరి పంటను కాపాడేందుకు అధునాతన రక్షణ పద్ధతులే ఏకైక మార్గం.. గోద్రెజ్ ఆగ్రోవెట్ సీఈఓ రాజవేలు
Indian Stock Market Gains | లాభాల్లో దేశీయ స్టాక్ మార్కెట్లు
Gold Silver Rates Today | మరింత తగ్గిన బంగారం ధరలు.. దేశవ్యాప్తంగా ఈ రోజు గోల్డ్, సిల్వర్ రేట్లు ఎలా ఉన్నాయంటే..!
TAGGED:BSE NSECrude OilDomestic Stock Marketequity marketFinancial Newsindian share marketInvestor Wealthmarket news indiaSensex Niftystock market rally
Share This Article
Facebook Whatsapp Whatsapp
Srinivas kolluri
BySrinivas Kolluri
Follow:
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Previous Article Grain Procurement Control Room | Grain Procurement Control Room | కొనుగోళ్ల పర్యవేక్షణకు కంట్రోల్ రూం ఏర్పాటు: కలెక్టర్ ఇలా త్రిపాఠి
Next Article Gautam Adani Gautam Adani | అంబానీని దాటేసిన అదానీ.. ఆసియాలోనే రిచ్చెస్ట్ పర్సన్‌గా రికార్డు
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?