అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy Dispute | ఇద్దరి మధ్య ఉన్న రాజకీయ వివాదాన్ని సంఘాలకు ఆపాదించడం సరికాదని పాల్వంచ మండలం ఫరీద్ పేట దళితులు పేర్కొన్నారు. కామారెడ్డి (Kamareddy) పట్టణంలోని ఆర్అండ్బీ గెస్ట్ హౌస్‌లో శుక్రవారం మీడియాతో మాట్లాడారు.
Kamareddy Dispute | పాల్వంచ మండలం ఫరీద్ పేట..
పాల్వంచ మండలం (Palvancha Mandal) ఫరీద్ పేట గ్రామానికి చెందిన పాల్వంచ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు పల్లె రమేష్ గౌడ్‌పై అంబేడ్కర్ సంఘాల నాయకులపై అనుచిత వ్యాఖ్యలు చేశారని కేసులు పెట్టడం సరికాదన్నారు. పల్లె రమేష్ గౌడ్ ఒకరి పట్ల అనుచితంగా మాట్లాడే వ్యక్తి కాదన్నారు. కులం మతం తేడా చూపించకుండా అందరితో కలిసిమెలిసి ఉంటాడని తెలిపారు. అలాంటి వ్యక్తిపై కొందరు వ్యక్తులు పని గట్టుకుని ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని పోలీసులకు ఫిర్యాదు చేయడం సబబు కాదన్నారు. సర్పంచ్ ఇదంతా చేస్తున్నారని ఆరోపించారు.
గ్రామంలో సమస్యలుంటే అక్కడే కలిసి అందరి సమక్షంలో కూర్చుని మాట్లాడుకోవాలి తప్పా ఇలా కేసులతో సమస్య పరిష్కారం కాదన్నారు. రమేష్ గౌడ్ ఇంటిని ముట్టడిస్తామని హెచ్చరికలు జారీ చేయడాన్ని తీవ్రంగా తప్పుబట్టారు. ఇంటిని ముట్టడిస్తే గ్రామం మొత్తం ఆయన ఇంటివద్దే ఉంటామని, అక్కడే అన్ని విషయాలు మాట్లాడుకుందామన్నారు. వెంటనే రమేష్ గౌడ్‌పై పెట్టిన కేసును ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. అనంతరం ఏఎస్పీ చైతన్య రెడ్డిని (ASP Chaitanya Reddy) కలిసి వినతిపత్రం అందజేశారు. సమావేశంలో గ్రామానికి చెందిన దళితులు, గ్రామస్థులు పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి..: Grain Procurement Control Room | కొనుగోళ్ల పర్యవేక్షణకు కంట్రోల్ రూం ఏర్పాటు: కలెక్టర్ ఇలా త్రిపాఠి
