అక్షరటుడే, వెబ్డెస్క్: April 18 Gold Rates | దేశవ్యాప్తంగా గత కొంతకాలంగా నిరంతరం పెరుగుతూ వచ్చిన బంగారం ధరలు తాజాగా కాస్త తగ్గుముఖం పట్టాయి. అక్షయ తృతీయ సమీపిస్తున్న వేళ ఈ పరిణామం వినియోగదారులకు ఊరటనిచ్చేలా మారింది. సాధారణంగా ఈ పండుగ సమయంలో బంగారం కొనుగోలు చేయడం శుభప్రదంగా భావించే భారతీయులు, ధరలు తగ్గడంతో కొనుగోళ్లకు ముందుకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.
April 18 Gold Rates | ప్రధాన నగరాల్లో
గుడ్ రిటర్న్స్ వెబ్‌సైట్ ప్రకారం, ఏప్రిల్ 18 ఉదయం 6.30 గంటల సమయానికి హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,54,190గా నమోదైంది. అదే సమయంలో 22 క్యారెట్ల 10 గ్రాముల ఆభరణాల బంగారం ధర Gold Rates రూ.1,41,340గా ఉంది. వెండి ధర కూడా కొంత తగ్గుతూ కిలోకు రూ.2,74,900 వద్ద కొనసాగుతోంది. విజయవాడలో కూడా ఇవే ధరలు కొనసాగుతున్నాయి.
ఇతర ప్రధాన నగరాల్లో ధరలను పరిశీలిస్తే.. చెన్నైలో 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,55,010గా ఉండగా, ఢిల్లీలో రూ.1,54,340, ముంబైలో రూ.1,54,190గా ఉంది. 22 క్యారెట్ల బంగారం ధర చెన్నైలో రూ.1,42,090, ఢిల్లీలో రూ.1,41,490, ముంబైలో రూ.1,41,340గా నమోదైంది.
అంతర్జాతీయ మార్కెట్‌లో కూడా బంగారం ధరలు కొంత స్థిరంగా కొనసాగుతున్నాయి. ప్రస్తుతం ఔన్స్ (31.10 గ్రాములు) బంగారం ధర 4,829 డాలర్ల వద్ద ఉండగా, వెండి Silver ఔన్స్ ధర 80 డాలర్ల వద్ద కొనసాగుతోంది. గ్లోబల్ మార్కెట్ ప్రభావం భారతీయ ధరలపై కూడా స్పష్టంగా కనిపిస్తోంది.
April 18 Gold Rates | మారకం విలువ
గత రోజు భారత్‌లో బంగారం ధరల్లో గణనీయమైన తగ్గుదల కనిపించింది. మేలిమి బంగారం ధర రూ.1,370 వరకు పడిపోగా, ఆభరణాల బంగారం ధరలో రూ.1,250 మేర తగ్గుదల నమోదైంది. వెండి ధరలో కూడా కిలోకు రూ.5,000 వరకు కోత పడింది. మొత్తం మీద, అక్షయ తృతీయ ముందు బంగారం ధరలు Gold Rates తగ్గడం కొనుగోలుదారులకు మంచి అవకాశం గా మారింది.
అయితే అంతర్జాతీయ పరిస్థితులు, డాలర్ మారకం విలువ, వడ్డీ రేట్ల మార్పులు వంటి అంశాలు రాబోయే రోజుల్లో ధరల దిశను నిర్ణయించే అవకాశముంది. కొనుగోలుదారులు ఈ మార్పులను గమనిస్తూ సరైన సమయంలో నిర్ణయం తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
ఇది కూడా చదవండి: April 18 Horoscope | మొండి బకాయిల వసూలు.. ఆకస్మిక ధన లాభం.. ఈ రాశుల వారికి తిరుగులేదు!
