అక్షరటుడే, వెబ్‌డెస్క్ : ACB Bribery Arrest | నల్గొండ జిల్లా దేవరకొండ (Devarakonda)లో విద్యుత్ శాఖ ఏడీఈ సిరికొండ సైదులు (ADE Saidulu) లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కాడు. బిల్లులు చెల్లించడానికి రూ. 30 వేలు లంచం డిమాండ్ చేసిన నిందితుడిని అధికారులు వల పన్ని పట్టుకున్నారు.
డివిజన్ పరిధిలోని కంబళపల్లి సబ్‌స్టేషన్‌కు అనుసంధానించబడిన 33/11 kV లైన్ గతేడాది అక్టోబర్‌లో తుపాన్ కారణంగా దెబ్బతింది. ఆ లైన్‌కు ఓ కాంట్రాక్టర్ మరమ్మతులు చేశాడు. ఆ పనికి సంబంధించిన రూ.10 లక్షల బిల్లును ప్రాసెస్ చేసి, ఫార్వార్డ్ చేసినందుకుగాను అసిస్టెంట్ డివిజనల్ ఇంజనీర్ సిరికొండ సైదులు రూ.30 వేల లంచం అడిగాడు. దీంతో బాధితుడు ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు గురువారం ఫిర్యాదుదారుడి నుంచి లంచం తీసుకుంటుండగా ఏడీఈ సైదులను అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.
ACB Bribery Arrest | కఠిన చర్యలు లేకపోవడంతో..
రాష్ట్రంలో అవినీతి అధికారులు మారడం లేదు. నిత్యం ఏసీబీ దాడులు చేపడుతున్నా.. లంచాలకు మరిగిన వారు భయపడటం లేదు. కొందరు అధికారులు అయితే లంచం తీసుకోవడం తమ హక్కుగా భావిస్తున్నారు. ఏసీబీ కేసుల్లో విచారణ ఏళ్ల తరబడి సాగడం, కఠిన శిక్షలు లేకపోవడంతోనే అవినీతి అధికారులు భయపడటం లేదు. లంచం తీసుకుంటూ పట్టుబడగానే సస్పెండ్ చేసే అధికారులు.. అనంతరం మళ్లీ ఉద్యోగంలోకి తీసుకుంటున్నారు. ఒకసారి లంచం తీసుకుంటూ దొరికితే శాశ్వతంగా ఉద్యోగంలో నుంచి తొలగించాలని ప్రజలు కోరుతున్నారు.
ACB Bribery Arrest | లంచం అడిగితే ఫోన్ చేయండి
ప్రభుత్వ అధికారులు లంచం డిమాండ్ చేస్తే ఇవ్వొద్దని ఏసీబీ అధికారులు కోరుతున్నారు. వారిపై చట్ట ప్రకారం చర్య తీసుకోవడం కోసం ఏసీబీ టోల్ ఫ్రీ నంబర్ 1064కు ఫోన్ చేయాలని కోరారు. ఏసీబీ తెలంగాణను వాట్సాప్ (9440446106), వెబ్సైట్ (ACB Website) ద్వారా కూడా ఫిర్యాదు చేయొచ్చని వివరించారు. ఫిర్యాదుదారుడి వివరాలు గోప్యంగా ఉంచుతామన్నారు.
ఇది కూడా చదవండి : Tejasvi Surya | పార్లమెంట్లో తేజస్వి సూర్య వ్యాఖ్యలపై రాష్ట్ర నేతల ఫైర్..
