అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: Nizamabad bus accident | నగరంలో ఆర్టీసీ బస్సు (RTC bus crash) ఢీకొని యాచకుడు మృతి చెందాడు. ఈ ఘటన పులాంగ్ చౌరస్తా వద్ద గురువారం సాయంత్రం చోటు చేసుకుంది.
Nizamabad bus accident | రోడ్డుపై యాచకుడు..
ట్రాఫిక్(Nizamabad Traffic Police) ఎస్సై వినోద్ తెలిపిన వివరాల ప్రకారం.. భైంసా(Bhainsa) ఆర్టీసీ బస్సు జిల్లా కేంద్రంలోని(Nizamabad) పులాంగ్ చౌరస్తా వద్దకు రాగా ఓ యాచకుడు ప్రమాదవశాత్తు బస్సు కింద పడ్డాడు. తీవ్ర గాయాలపాలైన అతడు అక్కడికక్కడే మృతి చెందాడు. బస్సు ఢీకొన్న ఘటనతో నలువైపులా ట్రాఫిక్ స్తంభించింది. స్పందించిన ఎస్సై వినోద్ సిబ్బందితో ట్రాఫిక్‌ను క్లియర్ చేశారు. అనంతరం మృతదేహాన్ని జీజీహెచ్ మార్చురికీ తరలించారు. ఈ మేరకు నాలుగో టౌన్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ఇది కూడా చదవండి: Microfinance Fraud Arrest | మైక్రో ఫైనాన్స్ కేసులో రమావత్ మధు అరెస్ట్
