అక్షరటుడే, వెబ్డెస్క్ : Microfinance Fraud Arrest | తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన మైక్రో ఫైనాన్స్ ఫ్రాడ్ కేసులో రమావత్ మధును పోలీసులు అరెస్ట్ చేశారు. మధుపై సైబరాబాద్ పోలీస్ (Cyberabad Police) స్టేషన్ల కేసు నమోదు అయింది.
రమావత్ మధు రియల్ ఎస్టేట్, పెట్టుబడుల పేరిట ప్రజల నుంచి భారీగా డబ్బులు వసూలు చేశాడు. ఈ స్కామ్లో సింగర్ మంగ్లీ (Singer Mangli) పేరును సైతం అతడు ఉపయోగించాడు. ఈ క్రమంలో బాధితుల తరఫున న్యాయవాది సుబ్బారావు ఫిర్యాదు చేశాడు. ఈ క్రమంలో నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. తనకు ఈ కేసుతో సంబంధం లేదని మంగ్లీ తెలిపారు. తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆమె సుబ్బారావుపై కేసు పెట్టారు. అనవసరంగా తనను బద్నాం చేస్తున్నారని కన్నీళ్లు పెట్టుకున్నారు. ఈ క్రమంలో ప్రధాన నిందితుడు మధును పోలీసులు అరెస్ట్ చేయడం గమనార్హం.
Microfinance Fraud Arrest | సూత్రధారులు ఎవరు
ఈ కేసులో రమావత్ మధు కొంతకాలంగా పరారీలో ఉన్నారు. ఈ క్రమంలో సాంకేతిక ఆధారాలతో పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. కాగా బుధవారం మధు ఓ వీడియో విడుదల చేశాడు. ఈ కేసులో సింగర్ మంగ్లీకి ఎలాంటి సంబంధం లేదన్నారు. హిమకాంత్ రెడ్డి అనే వ్యక్తి దీని వెనుక ఉన్నారని ఆరోపించారు. ఆయన ఏకంగా రూ.20 కోట్లు తీసుకున్నాడని చెప్పారు. న్యాయవాది సుబ్బారావు, హిమకాంత్రెడ్డి స్నేహితులని చెప్పాడు. అయితే పోలీసుల విచారణలో అసలు నిందితులు ఎవరో తేలనుంది.
ఇది కూడా చదవండి : Medipally Police | జ్యూస్ అని చెప్పి.. బాలుడికి యాసిడ్ తాగించిన పిన్ని
