అక్షరటుడే, నిజామాబాద్ అర్బన్: Welfare schemes Nizamabad | అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాల ద్వారా లబ్ది చేకూర్చాలనే సంకల్పంతో ప్రభుత్వం ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని అమలు చేస్తోందని కలెక్టర్ ఇలా త్రిపాఠి(Collector Ila Tripathi) తెలిపారు. సిరికొండలోని(Sirikonda) ఏజీ దాస్ ఫంక్షన్ హాల్లో నిర్వహించిన మండల సభలో కలెక్టర్ పాల్గొన్నారు.
Welfare schemes Nizamabad | ప్రభుత్వ పథకాలపై అవగాహన..
ముందుగా వివిధ సంక్షేమ పథకాల ద్వారా ప్రయోజనం పొందుతున్న లబ్ధిదారుల వివరాలను ఒక్కో పథకం వారీగా అధికారులు వెల్లడించారు. రైతు భరోసా, రైతు బీమా, ఇందిరమ్మ ఇళ్ల పథకం(Indiramma Housing Scheme), గృహ జ్యోతి, చేయూత పథకం, కల్యాణలక్ష్మి (Kalyana Lakshmi), షాదీ ముబారక్ పథకాలు, కొత్త రేషన్ కార్డులు, సన్న బియ్యం పంపిణీ తదితర వాటి ద్వారా లబ్ది పొందిన వారి వివరాలు చదివి వినిపించారు. పలువురు లబ్ధిదారులు ప్రభుత్వ సంక్షేమ పథకాలతో చేకూరిన ప్రయోజనాల గురించి సభలో తమ అభిప్రాయాలు తెలియజేస్తూ రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.
Welfare schemes Nizamabad | అర్హులకే పథకాలు అందాలి..
కలెక్టర్ ఇలా త్రిపాఠి మాట్లాడుతూ.. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు తెలియజేస్తూ, రాష్ట్ర ప్రగతి, సంక్షేమంలో వారిని భాగస్వామ్యం చేయాలన్న సంకల్పంతో ప్రభుత్వం “ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక” కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తోందని తెలిపారు.
Welfare schemes Nizamabad | పసుపు రైతులకు మేలు చేకూర్చడమే ధ్యేయం
పసుపు రైతుల ప్రయోజనాలను పరిరక్షిస్తూ, వారికి మేలు చేకూర్చడమే ధ్యేయంగా జిల్లా యంత్రాంగం చిత్తశుద్ధితో కృషి చేస్తోందని కలెక్టర్ ఇలా త్రిపాఠి రైతులకు భరోసా కల్పించారు. రైతులకు గిట్టుబాటు ధర లభించాలనే ఉద్దేశంతో స్థానిక మార్కెట్ యార్డులో పసుపు అమ్మకాలలో బహిరంగ వేలం విధానాన్ని అమలు చేయడం జరిగిందని అన్నారు. పసుపు పంట క్వింటాలుకు సగటున రూ.16,000 ధర లభిస్తోందని తెలిపారు. రైతులు ఎలాంటి అపోహలకు గురి కావొద్దని, వారి ప్రయోజనాలకు విఘాతం కలుగకుండా చూస్తామని కలెక్టర్ భరోసా ఇచ్చారు. రాష్ట్ర ఉర్దూ అకాడమి ఛైర్మన్ తాహెర్ బిన్ హందాన్ మండలంలో నెలకొని ఉన్న పలు సమస్యలను ప్రస్తావించగా, వాటి పరిష్కారం విషయమై కలెక్టర్ సానుకూలంగా స్పందించారు. ఈ సభలో మండల ప్రత్యేక అధికారి నాగూరావు, ఎంపీడీవో మనోహర్, తహశీల్దార్ రవీందర్ రావు, వివిధ శాఖల అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు, ప్రజలు పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి : Delimitation Seats Increase | తెలంగాణలో 26, ఏపీలో 38 ఎంపీ స్థానాలు : అమిత్ షా
