అక్షరటుడే, ఇందూరు: Kalyana Lakshmi Scheme | పేదింటి ఆడబిడ్డల పెళ్లిళ్లకు ఎల్లప్పుడూ కాంగ్రెస్ భరోసాగా ఉంటుందని ప్రభుత్వ సలహాదారు షబ్బీర్‌అలీ అన్నారు. నగరంలోని రాజీవ్ గాంధీ ఆడిటోరియంలో 591 మంది లబ్ధిదారురులకు రూ. 5.92 కోట్ల విలువైన కల్యాణలక్ష్మి (Kalyana Lakshmi scheme), షాదీ ముబారక్ (Shaadi Mubarak) చెక్కులను ఆయన అందజేశారు.
Kalyana Lakshmi Scheme | ఆర్థిక ఇబ్బందులున్నా సంక్షేమమే ముఖ్యం..
చెక్కుల పంపిణీ సందర్భంగా షబ్బీర్ అలీ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక ఇబ్బందుల్లోనూ సంక్షేమమే ప్రథమ ప్రాధాన్యతగా ముందుకు వెళ్తోందన్నారు. రాష్ట్రం అప్పుల కష్టాల్లో ఉన్నప్పటికీ, పేద ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామని తెలిపారు. 404 మంది మైనారిటీలకు షాదీ ముబారక్ కింద, 187మంది లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మి కింద చెక్కులు అందజేశారు.
Kalyana Lakshmi Scheme | ప్రజా పాలనలో అప్రతిహతంగా అభివృద్ధి పథకాలు
అనంతరం పీసీసీ చీఫ్ బొమ్మ మహేష్‌కుమార్ గౌడ్ (PCC Chief Bomma) మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తక్కువ కాలంలోనే కీలకమైన హామీలను నెరవేర్చిందని గుర్తు చేశారు. కేవలం మాటలు చెప్పడం కాదు, చేతల్లో చూపిస్తున్న ప్రభుత్వం తమదని అన్నారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, రూ.500లకే గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల ఉచిత విద్యుత్ వంటి పథకాలు ఇప్పటికే విజయవంతంగా కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. వీటికి తోడు ఇందిరమ్మ ఇళ్లు (Indiramma Houses), రైతు రుణమాఫీ, రైతు భరోసా, యువతకు ఉద్యోగాల కల్పన, సన్నబియ్యం పథకాలతో ప్రతి పేదవాడి ముఖంలో చిరునవ్వు చూడడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామన్నారు. కార్యక్రమంలో నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ, గడుగు గంగాధర్, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు నగేష్ రెడ్డి, కాంగ్రెస్ పట్టణాధ్యక్షులు, బొబ్బిలి రామకృష్ణ, మేయర్ ఉమారాణి, నుడా ఛైర్మన్ కేశ వేణు, స్థానిక కార్పొరేటర్లు, ముఖ్య నాయకులు, ప్రభుత్వ అధికారులు పాల్గొన్నారు.
సీఎంఆర్‌ఎఫ్ చెక్కుల పంపిణీ
నగరంలోని గెస్ట్‌హౌస్‌లో ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, పీసీసీ చీఫ్ బొమ్మ మహేష్‌కుమార్‌గౌడ్ ఆధ్వర్యంలో సీఎంఆర్‌ఎఫ్ (CMRF) చెక్కులను పంపిణీ చేశారు. అనారోగ్యం, ప్రమాదాలు తదితర కారణాలతో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న పేద కుటుంబాలకు సీఎంఆర్‌ఎఫ్ ఎంతో ఉపయోగకరంగా మారిందన్నారు. నగరంలోని 54మంది లబ్ధిదారులకు రూ.32 లక్షల విలువైన చెక్కులను అందజేసినట్లు తెలిపారు. పీసీసీ చీఫ్ మాట్లాడుతూ.. అనారోగ్యం పాలై ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న ప్రతి పేదవాడిని ఆదుకోవడమే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయమన్నారు.
ఇది కూడా చదవండి: SSC Exam Centers | పరీక్ష కేంద్రాల్లో విద్యార్థులకు అన్ని సౌకర్యాలు కల్పించాలి..: కలెక్టర్ ఇలా త్రిపాఠి
