అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: SSC Exam Centers | ఎస్సెస్సీ పరీక్ష కేంద్రాల్లో విద్యార్థులకు అన్ని సౌకర్యాలు కల్పించాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి (Collector Ila Tripathi) అన్నారు. ఆర్మూర్ పట్టణంలోని రాంమందిర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలతో పాటు మామిడిపల్లిలో (Mamidipalli) గల సెయింట్ పాల్స్ హైస్కూల్లో పరీక్ష కేంద్రాలను తనిఖీ చేశారు.
SSC Exam Centers | పరీక్షల తీరు.. సౌకర్యాల పరిశీలన..
పరీక్షల నిర్వహణ తీరును, అందుబాటులో ఉన్న సదుపాయాలను కలెక్టర్ పరిశీలించారు. విద్యార్థుల హాజరు గురించి ఆరా తీయగా.. రెండు కేంద్రాలలోనూ పూర్తిస్థాయిలో హాజరయ్యారని నిర్వాహకులు తెలిపారు. నిబంధనలకు అనుగుణంగానే నిర్ణీత సమయంలో ప్రశ్న పత్రాలను తెరిచారా..? స్ట్రాంగ్ రూం నుంచి ఎన్ని గంటలకు ప్రశ్నాపత్రాలు కేంద్రానికి చేరుకున్నాయనే వివరాలను ఆరాతీశారు. తాగునీటి వసతి, ప్రథమ చికిత్స అందుబాటులో ఉందా లేదా అని గమనించారు. కలెక్టర్ వెంట తహశీల్దార్ సత్యనారాయణ (Tahsildar Satyanarayana) తదితరులున్నారు.
ఇది కూడా చదవండి..: Road Safety Awareness | ట్రాఫిక్ నిబంధనలు పాటించడం ప్రతిఒక్కరి బాధ్యత: సీఐ జాన్‌రెడ్డి
