అక్షరటుడే, వెబ్డెస్క్ : Revanth Reddy Letter | ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి (CM Revanth Reddy) సోమవార ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి లేఖ రాశారు. లోక్‌సభ సీట్ల పెంపు విషయమై అఖిలపక్ష సమావేశం నిర్వహించాలని కోరారు.
చట్ట సభల్లో మహిళా రిజర్వేషన్ల (Women’s Reservations)బిల్లు ఆమోదం కోసం పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు ఈ నెల 16 నుంచి 18 వరకు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఇదే సమయంలో నియోజకవర్గాల పెంపునకు సైతం ఆమోదం తెలపనున్నారు. ఈ క్రమంలో రేవంత్రెడ్డి ప్రధాని (PM Narendra Modi)కి లేఖ రాశారు. మహిళా రిజర్వేషన్లు, లోక్‌సభ సీట్ల పునర్విభజన వేర్వేరు అన్నారు.
Revanth Reddy Letter | దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం
రాష్ట్రాల వారీగా అసెంబ్లీ సీట్లకు మహిళా కోటాను వెంటనే అమలు చేస్తే, యావత్ దేశం స్వాగతిస్తుందన్నారు. మహిళా రిజర్వేషన్ పేరిట జనాభా ఆధారిత లోక్‌సభ పునర్విభజన చేపడితే దక్షిణ, చిన్న రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. లోక్‌సభపు పునర్విభజన కోసం కేవలం దామాషా పద్ధతి కాకుండా ఇతర నమూనాలను పరిగణనలోకి తీసుకోవాలని కోరారు. పార్టీ ప్రయోజనాల కంటే దేశ ప్రయోజనాలే మిన్నగా ఉండాలన్నారు. లోక్‌సభ సీట్ల (Lok Sabha Seats) పెంపు విషయంలో భిన్నాభిప్రాయాలు ఉన్నాయని సీఎం రేవంత్రెడ్డి అన్నారు. దీనిపై అఖిల పక్ష సమావేశం నిర్వహించి అన్ని పార్టీల అభిప్రాయాలను తీసుకోవాలని సూచించారు.
ఇది కూడా చదవండి..: Seethakka Legal Notice | కేసీఆర్కు మంత్రి సీతక్క లీగల్ నోటీసులు
