అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: State First Ranker | ఇంటర్ ఫలితాల్లో నిజామాబాద్ (Nizamabad) నగరానికి చెందిన విద్యార్థిని స్టేట్ ఫస్ట్ ర్యాంకు సాధించిన విషయం తెలిసిందే. విద్యార్థిని శ్రీరామకృష్ణ విద్యానికేతన్ (Sri Ramakrishna Vidyaniketan) యాజమాన్యం, అధ్యాపకులు సన్మానించారు.
State First Ranker | శ్రీరామకృష్ణ విద్యానికేతన్‌లో..
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థిని మృదుల నగరంలోని శివాజీ నగర్లో గల శ్రీరామకృష్ణ విద్యానికేతన్‌లో ఎల్కేజీ నుంచి టెన్త్ క్లాస్ వరకు విద్యనభ్యసించిందని తెలిపారు. ఇంటర్మీడియట్ (Intermediate)లో 996 మార్కులు సాధించి స్టేట్ ఫస్ట్ ర్యాంకర్‌గా నిలిచినందుకు హార్థిక శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో శ్రీ రామకృష్ణ విద్యానికేతన్ యాజమాన్యం శ్రీనివాసచార్యులు, శశిరేఖ, మధుసూదన్, మాధురి తదితరులు తెలిపారు.
ఇది కూడా చదవండి..: SSC Exam Centers | పరీక్ష కేంద్రాల్లో విద్యార్థులకు అన్ని సౌకర్యాలు కల్పించాలి..: కలెక్టర్ ఇలా త్రిపాఠి
