Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Iran US Tensions | గల్ఫ్​ దేశాల్లోని పోర్టులను మూసేస్తాం.. అమెరికాకు ఇరాన్ వార్నింగ్
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

అంతర్జాతీయం - Iran US Tensions | గల్ఫ్​ దేశాల్లోని పోర్టులను మూసేస్తాం.. అమెరికాకు ఇరాన్ వార్నింగ్

అంతర్జాతీయం

Iran US Tensions | గల్ఫ్​ దేశాల్లోని పోర్టులను మూసేస్తాం.. అమెరికాకు ఇరాన్ వార్నింగ్

అమెరికాకు ఇరాన్​ వార్నింగ్​ ఇచ్చింది. తమ భద్రతకు ముప్పు వాటిల్లితే చూస్తూ ఊరుకోమని హెచ్చరించింది.

Srinivas kolluri
Last updated: ఏప్రిల్ 13, 2026 4:14 సా.
Srinivas Kolluri
13 గంటలు ago
Share
Iran US Tensions

అక్షరటుడే, వెబ్​డెస్క్: Iran US Tensions | పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు చల్లారడం లేదు. ఓ వైపు సీజ్​ఫైర్​ అమలులోకి వచ్చినా.. అమెరికా, ఇరాన్​ మధ్య చర్చలు విఫలం కావడంతో ఆందోళన నెలకొంది. మరోవైపు ఇరు దేశాలు చేస్తున్న ప్రకటనలతో ప్రపంచంలో చమురు సంక్షోభం వస్తుందనే ఆందోళనలు నెలకొన్నాయి.

Contents
  • Iran US Tensions | చూస్తూ ఊరుకోం
    • Iran US Tensions | పటిష్ట యంత్రాంగం

హర్ముజ్ జలసంధి (Strait of Hormuz)లోని ఇరాన్ ఓడరేవుల నుంచి రాకపోకలు సాగించే అన్ని నౌకలపై అమెరికా దిగ్బంధనం విధించిన విషయం తెలిసిందే. దీంతో గల్ఫ్, ఒమన్ సముద్రంలోని ఏ ఓడరేవు కూడా సురక్షితంగా ఉండదని ఇరాన్ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC) సోమవారం హెచ్చరించింది. గల్ఫ్, ఒమన్ సముద్రంలోని ఓడరేవుల భద్రత అందరి కోసమైనా ఉండాలి, లేక ఎవరి కోసమూ ఉండకూడదు అని పేర్కొంది.

Iran US Tensions | చూస్తూ ఊరుకోం

తమ భద్రతకు ముప్పు వాటిల్లితే చూస్తూ ఊరుకోమని ఇరాన్​ తెలిపింది. పర్షియన్ గల్ఫ్ (Persian Gulf) సముద్రం భద్రత ప్రమాదంలో పడుతుందని హెచ్చరించింది. ఇరాన్ ప్రాదేశిక జలాలపై సార్వభౌమాధికారాన్ని చెలాయించడం ఇరాన్ జాతి సహజ హక్కు అని పేర్కొంది. శత్రు దేశాలకు సంబంధం ఉన్న నౌకలకు హర్ముజ్ జలసంధి మీదుగా ప్రవేశం లేదని చెప్పింది. అయితే టెహ్రాన్ నిర్దేశించిన నిబంధనలకు లోబడి ఇతర నౌకలు ప్రయాణించవచ్చని తెలిపింది.

Iran US Tensions | పటిష్ట యంత్రాంగం

శత్రువుల నుంచి కొనసాగుతున్న ముప్పు నేపథ్యంలో యుద్ధం తర్వాత కూడా హర్ముజ్ జలసంధిని నియంత్రించడానికి ఇరాన్ ఒక శాశ్వత యంత్రాంగాన్ని పటిష్టంగా అమలు చేస్తుంది అని ఐఆర్‌జిసి పేర్కొంది. అంతర్జాతీయ జలాల్లో సముద్రయానంపై నేరపూరితమైన అమెరికా విధించిన ఆంక్షలు చట్టవిరుద్ధమైనవి తెలిపింది. కాగా సోమవారం మధ్యాహ్నం 2 గంటల నుంచి ఇరాన్ ఓడరేవులపై దిగ్బంధనాన్ని అమలు చేస్తామని అమెరికా తెలిపింది. అటు ఇరాన్​, ఇటు అమెరికా నౌకలను దిగ్బంధిస్తే ప్రపంచ వ్యాప్తంగా చమురు ధరలు భారీగా పెరగనున్నాయి. దీంతో అన్ని దేశాలు ఆందోళన చెందుతున్నాయి.

ఇది కూడా చదవండి..: Hormuz Strait blockade | హర్ముజ్​ జలసంధిని దిగ్బంధిస్తాం.. ట్రంప్​ సంచలన వ్యాఖ్యలు

Shivalik Gas Tanker | తీరనున్న గ్యాస్​ కష్టాలు.. నేడు గుజరాత్ తీరానికి శివాలిక్​ నౌక
Iran Gulf War Warning | భారీ దాడులు చేస్తాం.. గల్ఫ్​ దేశాలకు ఇరాన్​ వార్నింగ్
Russia Plane Crash | ఘోర విమాన ప్రమాదం.. ఏఎన్-26 సైనిక విమానం కుప్పకూలి 29 మంది మృతి
Qatar Iran Missile | ఖతార్​పై ఇరాన్​ క్షిపణి దాడి.. భయంతో ప్రజల పరుగులు
Hormuz Strait Tension | హర్మూజ్‌కు అమెరికా బలగాలు..
TAGGED:Global Oil SupplyGulf ports crisisHormuz Strait TensionIran US conflictIran US TensionsIran Warning USIRGC statementMiddle East tensionsoil price surge riskPersian GulfStrait of Hormuz
Share This Article
Facebook Whatsapp Whatsapp
Srinivas kolluri
BySrinivas Kolluri
Follow:
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Previous Article Kalyana Lakshmi Scheme | Kalyana Lakshmi Scheme | పేదింటి ఆడబిడ్డల పెళ్లిళ్లకు కాంగ్రెస్​ భరోసా: ప్రభుత్వ సలహాదారు షబ్బీర్​అలీ
Next Article DOST Notification 2026 DOST Notification 2026 | డిగ్రీలో ప్రవేశాలకు.. దోస్త్ నోటిఫికేషన్​ విడుదల
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?