Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: PCC Chief Comments | వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్​కు పోటీ లేదు : పీసీసీ చీఫ్​
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

తెలంగాణ - PCC Chief Comments | వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్​కు పోటీ లేదు : పీసీసీ చీఫ్​

తెలంగాణతాజా వార్తలు

PCC Chief Comments | వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్​కు పోటీ లేదు : పీసీసీ చీఫ్​

బీఆర్ఎస్, బీజేపీ కలిసి పోటీ చేసినా వచ్చే ఎన్నికల్లో తామే అధికారంలోకి వస్తామని పీసీసీ అధ్యక్షుడు మహేశ్​గౌడ్​ అన్నారు.

Sandeep kumar Balla_Author
Last updated: ఏప్రిల్ 13, 2026 12:33 సా.
Sandeep Kumar Balla
Sandeep kumar Balla_Author
BySandeep Kumar Balla
Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే...
Follow:
3 రోజులు ago
Share
PCC Chief Comments

అక్షరటుడే, వెబ్​డెస్క్: PCC Chief Comments | వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో (Assembly Elections) తమకు ఎవరు పోటీ లేరని పీసీసీ అధ్యక్షుడు బొమ్మ మహేశ్​కుమార్​ గౌడ్​ అన్నారు. బీఆర్ఎస్, బీజేపీ కలిసి పోటీ చేసినా తామే అధికారంలోకి వస్తామన్నారు. సోమవారం ఆయన నిజామాబాద్​ (Nizamabad)లో మీడియాతో మాట్లాడారు.

Contents
  • PCC Chief Comments | గత ప్రభుత్వంలో దోపిడీ
    • PCC Chief Comments | కవిత పార్టీతో సంబంధం లేదు

బీఆర్​ఎస్ (BRS)​ను టీఆర్​ఎస్​గా మారుస్తామని ఆదివారం కేటీఆర్​ వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. దీనిపై తాజాగా మహేశ్​గౌడ్​ స్పందించారు. BRSను TRSగా మార్చినా.. BJRSగా మారినా ఏమీ కాదన్నారు. ఆ పార్టీలు మళ్లీ మొలకెత్తే అవకాశం లేదని పేర్కొన్నారు. సింగరేణి సైట్​ విజిట్​ సర్టిఫికెట్​పై బీఆర్​ఎస్​ చేస్తున్న ఆరోపణలను ఆయన ఖండించారు. సింగరేణి (Singareni)లో ఒప్పందాలన్నీ బీఆర్ఎస్‌ హయాంలో జరిగినవే అని స్పష్టం చేశారు. కేటీఆర్‌ పాదయాత్ర చేస్తే స్వాగతిస్తామన్నారు.

PCC Chief Comments | గత ప్రభుత్వంలో దోపిడీ

బీఆర్​ఎస్​ పదేళ్ల పాలనపై మహేశ్​గౌడ్​ విమర్శలు చేశారు. కేసీఆర్​ హయాంలో ఆర్థిక దోపిడీ, భూ దోపిడీ జరిగిందన్నారు. రాష్ట్రాన్ని విధ్వంసం చేశారని విమర్శించారు. కేటీఆర్ (KTR)  పాదయాత్రలో గత పదేళ్ల పాలనలో జరిగిన ఆర్థిక విధ్వంసంపై ప్రజలకు వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పాలన సాగుతోందన్నారు.

PCC Chief Comments | కవిత పార్టీతో సంబంధం లేదు

తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత (Kalvakuntla Kavitha)తో తమకు సంబంధం లేదని పీసీసీ చీఫ్​ అన్నారు. బీఆర్​ఎస్​ పాలనలో రాష్ట్రాన్ని దోచుకున్నారని కవిత చెబుతున్నారని తెలిపారు. ఆస్తి తగదాలు, వాటాల్లో తగాదాలతో ఆమె బయటకు వచ్చి పార్టీ పెట్టుకుంటున్నారని పేర్కొన్నారు. ఆమెతో కాంగ్రెస్​కు ఏం సంబంధం అని ప్రశ్నించారు. ప్రజాస్వామ్యంలో ఎన్ని పార్టీలు వచ్చినా స్వాగతిస్తామన్నారు. కవిత పార్టీకి సీఎం రేవంత్​రెడ్డి (CM Revanth Reddy) ఫండింగ్ చేస్తున్నారని ఎంపీ అర్వింద్​ (MP Arvind) ఇటీవల ఆరోపించారు. ఈ క్రమంలో పీసీసీ చీఫ్ వ్యాఖ్యలు చేశారు. అభివృద్ధి చేయకుండా రాముడి పేరు చెప్పుకొని ఓట్లు అడిగే వారికి భవిష్యత్​లో నూకలు చెల్లినట్లే అన్నారు.

ఇది కూడా చదవండి..: Constable Death | నీటి గుంతలో పడి కానిస్టేబుల్​ మృతి

Chhattisgarh IED Blast | ఛత్తీస్‌గఢ్​లో ఐఈడీ పేలుడు.. ఇద్దరు జవాన్లకు గాయాలు
Hyderabad Mosquito Menace | హైదరాబాద్​లో దోమల బెడద.. ఎమ్మెల్యే వినూత్న నిరసన
Banana Peel | అరటి తొక్క.. మంచు కంటే ప్రమాదమట.. ఎందుకంటే!
Ustaad Bhagat Singh Glimpse | ఇక గూస్​ బంప్సే​.. ఊపేస్తున్న ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌ ట్రైలర్‌ టీజ్‌
Ameenpur Hydraa Demolitions | అమీన్​పూర్​లో హైడ్రా కూల్చివేతలు.. హైకోర్టు స్టే
TAGGED:Assembly ElectionsBRSCM Revanth ReddyKalvakuntla KavithaKTRMP ArvindNizamabadPCC Chief CommentsSingareni
Share This Article
Facebook Whatsapp Whatsapp
Sandeep kumar Balla_Author
BySandeep Kumar Balla
Follow:
Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే తెలంగాణ దినపత్రికలో 2011లో చేరి రెండు సంవత్సరాల పాటు పనిచేశాను. ఆ తర్వాత ‘సాక్షి’ దినపత్రికలో 2013 నుంచి 2024 జూలై వరకు సీనియర్​ సబ్​ ఎడిటర్​గా వర్క్​ చేశాను. 2024 ఆగస్టు నుంచి ‘అక్షరటుడే’లో అసోసియేట్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, లోకల్​, నేషనల్​, ఇంటర్నేషనల్​, క్రైం, లైఫ్​స్టైల్​, సినిమా ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Previous Article Stock Market Fall Stock Market Fall | పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు.. మళ్లీ పతనమైన సూచీలు
Next Article Govt Doctors Elections Telangana Govt Doctors Elections Telangana | ప్రభుత్వ వైద్యుల అసోసియేషన్ ఎన్నికలకు నామినేషన్ల స్వీకరణ
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?