అక్షరటుడే, కామారెడ్డి: Govt Doctors Elections Telangana | తెలంగాణ ప్రభుత్వ వైద్యుల అసోసియేషన్ 2026-2028 ఎన్నికలకు కామారెడ్డి (Kamareddy) యూనిట్ ఎన్నికల నోటిఫికేషన్ (Election Notification) జారీ చేసింది. 2026 మార్చి 26 న జరిగిన కేంద్ర కార్యనిర్వాహక కమిటీ సమావేశం తీర్మానం ప్రకారం ఆఫీస్ బేరర్ పోస్టులకు ఎన్నికలు జరుగుతాయని పేర్కొంది.
Govt Doctors Elections Telangana | పోటీదారులు.. వారి అర్హతలు..
అధ్యక్ష పదవికి సివిల్ సర్జన్, డిప్యూటీ సివిల్ సర్జన్/అసోసియేట్ ప్రొఫెసర్, సివిల్ అసిస్టెంట్ సర్జన్/అసోసియేట్ ప్రొఫెసర్ పోటీ చేయవచ్చు. అలాగే జనరల్ సెక్రెటరీ పదవికి డిప్యూటీ సివిల్ సర్జన్/అసోసియేట్ ప్రొఫెసర్, సివిల్ అసిస్టెంట్ సర్జన్/అసోసియేట్ ప్రొఫెసర్, కోశాధికారి పదవికి సివిల్ అసిస్టెంట్/అసిస్టెంట్ ప్రొఫెసర్ పోటీ చేయవచ్చని కమిటీ పేర్కొంది. ముగ్గురు జనరల్ కౌన్సిల్ సభ్యుల పదవులకు ఒక సివిల్ సర్జన్/ప్రొఫెసర్, ఒక డిప్యూటీ సివిల్ సర్జన్/అసోసియేట్ ప్రొఫెసర్, సివిల్ అసిస్టెంట్ ప్రొఫెసర్/సివిల్ అసిస్టెంట్ ప్రొఫెసర్/ అసిస్టెంట్ ప్రొఫెసర్ పోటీ చేయవదచ్చు. ముగ్గురు ఉపాధ్యక్ష పదవులకు ఒక సివిల్ సర్జన్, ఒక డిప్యూటీ సివిల్ సర్జన్, ఒక మహిళా (సివిల్ అసిస్టెంట్ సర్జన్/ అసిస్టెంట్ ప్రొఫెసర్) అర్హులు.
Govt Doctors Elections Telangana | ముగ్గురు సంయుక్త కార్యదర్శి పదవులకు..
ముగ్గురు జాయింట్ సెక్రెటరీ పదవులకు ఒక సివిల్ సర్జన్/ప్రొఫెసర్, ఒక మహిళ(సివిల్ సర్జన్/అసిస్టెంట్ ప్రొఫెసర్), ఆరుగురు యూనిట్ ఎగ్జిక్యూటివ్ పదవులకు ఇద్దరు సివిల్ సర్జన్స్/ప్రొఫెసర్ (ఇందులో ఒకటి మహిళకు రిజర్వ్), నలుగురు డిప్యూటీ సివిల్ సర్జన్స్/అసోసియేట్ ప్రొఫెసర్స్/సివిల్ అసిస్టెంట్ సర్జన్స్/అసిస్టెంట్ ప్రొఫెసర్స్(ఇందులో ఒకటి మహిళకు రిజర్వ్) పోటీ చేయవచ్చని పేర్కొన్నారు. ఎన్నికల రిటర్నింగ్ అధికారిగా డీసీహెచ్ఎస్ డా.విజయ భాస్కర్ వ్యవహరిస్తారని పేర్కొంది. నేటి నుంచి ఈ నెల 18 వరకు నామినేషన్స్ స్వీకరణ ఉంటుందని పేర్కొంది.
Govt Doctors Elections Telangana | 20న స్ర్కూటినీ నిర్వహించి..
20న స్ర్కూటినీ నిర్వహించి డిస్ప్లే చేయడం జరుగుతుందని, 21న నామినేషన్ ఉపసంహరణ ఉంటుందని కమిటీ సభ్యులు పేర్కొన్నారు. ఈనెల 29న సాయంత్రం 4 గంటలకు పోలింగ్, అదే రోజు సాయంత్రం 5 గంటలకు కౌంటింగ్ ఉంటుందని పేర్కొంది. బ్యాలెట్ ద్వారానే ఎన్నికలు జరుగుతాయని స్పష్టం చేశారు. ఎన్నికల్లో డీఎల్వో, డీఐవో, డీసీటీవో/డీసీటీఎస్, ఏరియా ఆస్పత్రి సూపరింటెండెంట్లు పోటీ చేయవచ్చని, డీఎంహెచ్వో, డీసీహెచ్, ప్రిన్సిపాల్స్ టీచింగ్ హాస్పిటల్స్ సూపరింటెండెంట్స్, కమిషనర్/జాయింట్ కమిషనర్ టీవీవీపీ, అడిషనల్ డైరెక్టర్స్ పోటీ చేయడానికి అనర్హులని స్పష్టం చేశారు.
అధ్యక్ష పదవికి పోటీ చేసేవారు కనీసం పదేళ్లు ప్రభుత్వ సేవలు చేసిన అనుభవం, జనరల్ సెక్రెటరీ పదవికి కనీసం ఐదేళ్ల అనుభవం, కోశాధికారి పదవికి ఐదేళ్లు, జీసీ మెంబర్లకు ఐదేళ్లు, ఉపాధ్యక్ష పదవికి ఐదేళ్లు, జాయింట్ సెక్రెటరీ పదవికి మూడేళ్లు, ఎగ్జిక్యూటివ్ మెంబర్లకు రెండేళ్ల అనుభవం ఉండాలని, అభ్యర్థులను ప్రతిపాదించి, బలపరిచే వారికి కనీసం రెండేళ్ల సర్వీస్ అనుభవం ఉండాలని స్పష్టం చేసింది. అధ్యక్ష పదవికి పోటీ చేసే వారికి నామినేషన్ ఫీజు రూ.5 వేలు, ఉపాధ్యక్ష పదవికి పోటీ చేసే వారికి రూ.2 వేలు నామినేషన్ ఫీజు చెల్లించాలని పేర్కొంది.
ఇది కూడా చదవండి..: Arya Vysya Swearing Ceremony | శ్రీవాసవి గ్రేటర్ ఆర్యవైశ్య సంఘం కార్యవర్గం ప్రమాణ స్వీకారం
