అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Stock Market Fall | అమెరికా -ఇరాన్ మధ్య జరిగిన శాంతి చర్చలు విఫలమవడంతో పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మళ్లీ పెరిగాయి. హార్మూజ్ జలసంధి దిగ్బంధనానికి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ (US President Trump) ఆదేశాలు ఇవ్వడంతో ఇన్వెస్టర్ల సెంటిమెంట్ దెబ్బతింది. మరోవైపు ముడి చమురు ధర బ్యారెల్‌కు 100 డాలర్లు దాటడంతో స్టాక్ మార్కెట్లు (Stock Markets) ఒత్తిడికి గురవుతున్నాయి.
Stock Market Fall | భారీ గ్యాప్ డౌన్‌లో ప్రారంభమై..
దేశీయ స్టాక్ మార్కెట్ (Domestic Stock Market) సోమవారం నష్టాలతో ప్రారంభమైంది. ఉదయం సెన్సెక్స్ 1,613 పాయింట్ల భారీ గ్యాప్ డౌన్ లో ప్రారంభమై మరో 69 పాయింట్లు కోల్పోయింది. కనిష్టాల వద్ద కొనుగోళ్ల మద్దతు లభించడంతో 691 పాయింట్లు కోలుకుంది. నిఫ్టీ 462 పాయింట్ల నష్టంతో ప్రారంభమై మరో 34 పాయింట్లు తగ్గింది. అక్కడినుంచి కోలుకుని 207 పాయింట్లు పెరిగింది. ఉదయం 11.40 గంటల ప్రాంతంలో సెన్సెక్స్ 998 పాయింట్ల నష్టంతో 76,551 వద్ద, నిఫ్టీ 289 పాయింట్ల నష్టంతో 23,760 వద్ద ఉన్నాయి.
Stock Market Fall | ఆటో, ఫైనాన్షియల్ రంగాల్లో అమ్మకాలు..
ఆటో, బ్యాంక్, ఫైనాన్షియల్ రంగాల్లో అమ్మకాల ఒత్తిడి నెలకొంది. నిఫ్టీలో ఆటో ఇండెక్స్ 1.93 శాతం, బ్యాంక్ నిఫ్టీ 1.83 శాతం, ఫైనాన్షియల్ సర్వీసెస్ 1.60 శాతం, ఆయిల్ అండ్ గ్యాస్ 1.45 శాతం, ఎనర్జీ 1.33 శాతం, ఐటీ 1.21 శాతం నష్టాలతో ఉండగా.. యుటిలిటీ 1.46 శాతం, పవర్ 1.16 శాతం, టెలికాం ఇండెక్స్ 0.33 శాతం లాభాలతో ఉన్నాయి.
Gainers : బీఎస్ ఈ సెన్సెక్స్‌లో 2 స్టాక్స్ లాభాలతో ఉండగా.. 28 స్టాక్స్ నష్టాలతో ట్రేడ్ అవుతున్నాయి. ఎన్టీపీసీ 1.49 శాతం, ఎయిర్‌టెల్ 0.06 శాతం లాభాలతో ఉన్నాయి.
Top Losers : మారుతి 4.04 శాతం, ఇండిగో 2.65 శాతం, హెచ్‌డీఎఫ్సీ బ్యాంక్ 2.64 శాతం, బజాజ్ ఫైనాన్స్ 2.54 శాతం, రిలయన్స్ 2.27 శాతం నష్టంతో ఉన్నాయి.
ఇది కూడా చదవండి..: April 13 Gold Rates | అమెరికా–ఇరాన్ ఉద్రిక్తతల ప్రభావం.. బంగారం, వెండి ధరల్లో హెచ్చుతగ్గులు!
