అక్షరటుడే, ఇందూరు: Telangana University | తెలంగాణ విశ్వవిద్యాలయం ద్వితీయ శ్రేణి సభ్యులతో కూడిన పాలకమండలిని ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు గురువారం రాష్ట్ర ప్రభుత్వ కార్యదర్శి యోగితా రాణా ఉత్తర్వులు జారీ చేశారు. వర్సిటీ యాక్ట్ 1991 ప్రకారం నూతన పాలక మండలి సభ్యులను నియమించారు.
Telangana University | సభ్యులు వీరే..
తెలంగాణ యూనివర్సిటీ నుంచి నామినేటెడ్ కోటాలో బిజినెస్ మేనేజ్‌మెంట్ విభాగం ప్రొఫెసర్ ఆంజనేయులు నియామకం అయ్యారు. విశ్వవిద్యాలయ కళాశాల ప్రిన్సిపాల్ కోటాలో జియోఇన్ఫర్మేటిక్స్ విభాగం అసోసియేట్ ప్రొఫెసర్ సుధాకర్ గౌడ్, అనుబంధ కళాశాల ప్రిన్సిపాల్ గా గౌతమి పీజీ కళాశాల డాక్టర్ కె.సంజీవ రావు, ప్రిన్సిపాల్, వర్సిటీ కళాశాలల ఉపాధ్యాయుల నుంచి గిరిరాజ్ కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ దండు స్వామి, అనుబంధ కళాశాలల ఉపాధ్యాయుల నుంచి ఇందూర్ పీజీ కాలేజ్ ఆఫ్ బిజినెస్ మేనేజ్‌మెంట్ ప్రొఫెసర్ మదన్ మోహన్ దేవబక్తుని నియమితులయ్యారు. పరిశ్రమ, వ్యవసాయం, వాణిజ్యం, విద్య, పబ్లిక్ లైఫ్, లాయర్ వృత్తి, సామాజిక సేవలు వంటి రంగాల నుంచి కాకతీయ విద్యా సంస్థల డైరెక్టర్ చెరుకూరి రాజనీకాంత్, అల్లె లావణ్య, మహమ్మద్ గాజి, డాక్టర్ ఎస్.జయంత్ నియామకం అయ్యారు.
ఇది కూడా చదవండి..: Welfare schemes Nizamabad | అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు: కలెక్టర్ ఇలా త్రిపాఠి
