అక్షరటుడే, వెబ్‌డెస్క్: Alprazolam Seizure Case | కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి పోలీస్ స్టేషన్ పరిధిలో నిషేధిత మత్తు పదార్థాల అక్రమ రవాణాపై పోలీసులు కీలక చర్యలు చేపట్టారు. ఆల్ప్రాజోలమ్ విక్రయానికి యత్నిస్తున్న ఇద్దరు నిందితులను అరెస్టు చేసి, వారి వద్ద నుంచి 101 గ్రాముల మత్తు పదార్థాన్ని స్వాధీనం చేసుకున్నారు. ప్రధాన నిందితుడు ప్రస్తుతం పరారీలో ఉండగా, అతని కోసం గాలింపు కొనసాగుతోంది.
Alprazolam Seizure Case | ఆల్ప్రాజోలమ్ విక్రయించేందుకు..
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, కొత్తపల్లి గ్రామానికి చెందిన పులి రమేష్ వద్ద ఉన్న ఆల్ప్రాజోలమ్‌ను విక్రయించేందుకు పథకం రచించాడు. ఈ క్రమంలో హసన్‌పల్లి అనిల్ కుమార్‌ను మధ్యవర్తిగా ఉపయోగించుకుని తిమ్మాపూర్‌కు చెందిన చెపర్తి ఈశ్వర్ గౌడ్‌కు విక్రయించాలని యత్నించాడు. ముందస్తుగా డబ్బు ఇచ్చి ఒప్పందం కుదుర్చుకున్నట్లు సమాచారం.
Alprazolam Seizure Case | ప్రధాన నిందితుడి కోసం గాలింపు..
ఈ నేపథ్యంలో అనిల్ కుమార్, ఒలేపు రమేష్ ఇంటికి వెళ్లి 101 గ్రాముల ఆల్ప్రాజోలమ్‌ను తీసుకుని నమూనా చూపించేందుకు బయలుదేరిన సమయంలో గండిమాసానిపేట్ గ్రామం వద్ద పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. విచారణలో వెలుగులోకి వచ్చిన వివరాల ఆధారంగా ఒలేపు రమేష్‌ను కూడా పోలీసులు అరెస్టు చేశారు.
నిందితులను కోర్టు court లో హాజరుపరచి రిమాండ్‌కు తరలించారు. ఈ కేసులో ప్రధాన నిందితుడైన పులి రమేష్ పరారీలో ఉండగా, అతని కోసం ప్రత్యేక బృందాలు గాలింపు చేపట్టాయి.
ఈ కేసును జిల్లా ఎస్పీ ఎం. రాజేష్ చంద్ర, ఐపీఎస్ ఆదేశాల మేరకు, ఎల్లారెడ్డి డీఎస్పీ ఎస్. శ్రీనివాసరావు పర్యవేక్షణలో, సీఐ డి. రాజారెడ్డి, సీసీఎస్ సీఐ రామన్, ఎస్‌ఐ బి. మహేష్, ఇతర పోలీసు సిబ్బంది సంయుక్తంగా వేగంగా దర్యాప్తు చేసి 24 గంటల్లోనే ఛేదించారు.
కేసును సమర్థవంతంగా పరిష్కరించిన పోలీసు బృందాన్ని కామారెడ్డి జిల్లా ఎస్పీ అభినందించారు.
