అక్షరటుడే, వెబ్‌డెస్క్: Copper Sun Vastu | హిందూ సంప్రదాయంలతోపాటు వాస్తు శాస్త్రంలోనూ సూర్యభగవానుడికి విశేష స్థానం ఉంది. సూర్యుడిని అగ్ని స్వరూపంగా, గ్రహాలకు రాజుగా పరిగణిస్తారు. ఇంటి వాస్తు, మెరుగుపరచడంలో రాగితో చేసిన సూర్యుడి ప్రతిమ (Copper Sun) కీలక పాత్ర పోషిస్తుంది.
ఇది కేవలం అలంకరణ వస్తువు మాత్రమే కాదు, ఇంటికి పాజిటివ్ ఎనర్జీని తెచ్చే ఒక శక్తివంతమైన సాధనం. ఈ రాగి సూర్యుడిని సరైన దిశలో ఏర్పాటు చేయడం వల్ల కలిగే ప్రయోజనాలు, పాటించాల్సిన నియమాలు తెలుసుకుందాం…
Copper Sun Vastu | ప్రతికూల శక్తులకు అడ్డుకట్ట:
రాగి సూర్యుడిని ఇంట్లో లేదా పని చేసే చోట ఉంచుకోవడం వల్ల నెగిటివ్ ఎనర్జీ దూరమవుతుంది. ఇది దుష్ట శక్తులు ఇంట్లోకి ప్రవేశించకుండా రక్షణ కవచంలా పనిచేస్తుందని వాస్తు పండితులు చెబుతున్నారు. సానుకూల ధోరణిని పెంపొందించడంలో ఇది అద్భుతంగా తోడ్పడుతుంది.
Copper Sun Vastu | కీర్తి ప్రతిష్ఠలు – సామాజిక సంబంధాలు:
వాస్తు ప్రకారం, రాగి సూర్యుడికి ఒక ప్రత్యేకమైన ఆకర్షణ శక్తి ఉంటుంది. దీనిని అమర్చుకోవడం వల్ల సమాజంలో గౌరవం, కీర్తి ప్రతిష్ఠలు పెరుగుతాయి. అంతేకాకుండా, సమాజంలోని ఉన్నత స్థాయి వ్యక్తులతో సంబంధాలు మెరుగుపడటానికి, వృత్తిపరంగా ఎదగడానికి ఇది దోహదపడుతుంది.
ఉంచాల్సిన సరైన దిశ ఇదే:
తూర్పు దిశ ప్రత్యేకం: సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు కాబట్టి, రాగి సూర్యుడి ప్రతిమ, ఎల్లప్పుడూ తూర్పు దిశలో ఉన్న గోడకు మాత్రమే వేలాడదీయాలి.
ప్రధాన ద్వారం: ఒకవేళ ఇంటి ప్రధాన ద్వారం తూర్పు దిక్కున ఉంటే, తలుపునకు బయటి వైపు దీనిని అమర్చుకోవడం ద్వారా అదృష్టం కలిసి వస్తుంది.
వెలుతురు లేని చోట: ఇంటి లోపల సూర్య కిరణాలు నేరుగా సోకని ప్రదేశాల్లో లేదా కిటికీల దగ్గర ఈ ప్రతిమ, ఉంచడం వల్ల, సూర్య రశ్మి ద్వారా వచ్చే శక్తిని ఆ ప్రదేశం పొందుతుంది.
విజయానికి మార్గం:
ప్రతిరోజు సూర్యారాధనతో పాటు, వాస్తు ప్రకారం ఈ రాగి సూర్యుడిని తూర్పు దిశలో ఉంచడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది. చేపట్టిన పనుల్లో ఆటంకాలు తొలగి విజయం లభిస్తుంది. ఆరోగ్య పరంగా, ఆర్థిక పరంగా కుటుంబానికి శుభం, శ్రేయస్సు కలుగుతాయి.
ఇది కూడా చదవండి: Bilva Patra | బిల్వపత్రం వెనుక ఉన్న అసలు రహస్యం ఇదే.. త్రిమూర్తి తత్వానికి ఇది ఎలా ప్రతీకంటే!
