అక్షరటుడే, వెబ్డెస్క్ : Padayatra Political Strategy | ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు 2027లో పాదయాత్ర చేయనున్నట్లు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) ఇటీవల అన్నారు. రాష్ట్రంలో గతంలో ఎంతోమంది రాజకీయ నాయకులు పాదయాత్రలు చేశారు. పాదయాత్రతో అధికారం దక్కుతుందని సెంటిమెంట్ ఉంది. ఈ క్రమంలో కేటీఆర్ యాత్రకు సిద్ధం కావడం గమనార్హం.
ఉమ్మడి రాష్ట్రంలో వైఎస్ రాజశేఖరరెడ్డి పాదయాత్ర చేపట్టి అధికారంలోకి వచ్చారు. ఏపీలో వైఎస్ జగన్మోహన్రెడ్డి సైతం 2019 ఎన్నికలకు ముందు యాత్ర చేపట్టారు. అనంతరం అధికారం కైవసం చేసుకున్నారు. తెలంగాణలో రేవంత్రెడ్డి (CM Revanth Reddy) కూడా అసెంబ్లీ ఎన్నికలకు ముందు పాదయాత్ర చేశారు. గతంలో బీజేపీ అధ్యక్షుడిగా బండి సంజయ్ ఉన్న సమయంలో ప్రజా సంగ్రామ యాత్ర చేపట్టారు. ఇలా తెలుగు రాష్ట్రాల్లో పాదయాత్రలు కొత్త కాకపోయినా.. కేటీఆర్ పాదయాత్రపై ఆసక్తి నెలకొంది.
Padayatra Political Strategy | అనుకూలంగా మార్చుకునేందుకు..
ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Government)పై ప్రజల్లో కొంత అసంతృప్తి ఉంది. ముఖ్యంగా ఇచ్చిన హామీలు అమలు చేయడం లేదని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. యూరియా కష్టాలతో రైతులు సైతం సీఎంపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో కాంగ్రెస్ ప్రభుత్వంపై ఉన్న అసంతృప్తిని అనుకూలంగా మార్చుకునేందుకు వచ్చే ఏడాది పాదయాత్ర చేయాలని కేటీఆర్ భావిస్తున్నట్లు తెలుస్తోంది.
Padayatra Political Strategy | ప్రజలు నమ్ముతారా
బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో అనేక సంక్షేమ పథకాలు అమలు చేశారు. ప్రజలతో మాత్రం ఆ పార్టీ నేతలు దూరంగా ఉన్నారు. ముఖ్యంగా కేసీఆర్ (KCR), కేటీఆర్ వంటి నేతలు ప్రజా సమస్యలను పట్టించుకోలేదనే విమర్శలు ఉన్నాయి. వారు ఎన్నికల్లో ఓడిపోవడానికి ఇది కూడా ఓ కారణం. ఇటీవల కేటీఆర్ సైతం దీనిని అంగీకరించారు. ప్రజలతో గ్యాప్ రావడంతోనే ఓడిపోయామన్నారు. అధికారంలో ఉన్నన్ని రోజులు ప్రజలను పట్టించుకోకుండా.. ఇప్పుడు పాదయాత్రలు చేస్తే నమ్ముతారా లేదా అనేది చూడాలి.
Padayatra Political Strategy | ఏపీలో జగన్
ఏపీ నుంచి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (Y.S. Jagan Mohan Reddy) సైతం పాదయాత్ర చేయనున్నట్లు తెలిసింది. దీంతో 2027లో కేటీఆర్, జగన్మోహన్రెడ్డి పాదయాత్రలకు సిద్ధమవుతున్నారు. ఇద్దరి లక్ష్యం ఒక్కటే కావడం గమనార్హం. ఎలాగైనా అధికార పీఠం దక్కించుకోవాలని వారు ఇప్పటి నుంచే ప్రణాళికలు రచిస్తున్నారు. జగన్ గతంలో పాదయాత్రతోనే విజయం సాధించగా… మరోసారి అదే అస్త్రాన్ని ఎంచుకోగా, బీఆర్ఎస్ ఓటమి తర్వాత కేటీఆర్ తొలిసారి ఈ రాజకీయ ప్రయోగానికి రెడీ అవుతున్నారు.
ఇది కూడా చదవండి..: Laughing Boy Viral | ఒక్క నవ్వుతో ఓవర్ నైట్ వైరల్ లాఫింగ్ బాయ్.. నెట్టింట తెలంగాణ బాలుడి సంచలనం!
