Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Stock Market Crash | భారీ నష్టాలతో ముగిసిన సూచీలు
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

బిజినెస్​ - Stock Market Crash | భారీ నష్టాలతో ముగిసిన సూచీలు

బిజినెస్​

Stock Market Crash | భారీ నష్టాలతో ముగిసిన సూచీలు

పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మళ్లీ పెరగడంతో స్టాక్ మార్కెట్లు నష్టాల బాటలో పయనించాయి. సెన్సెక్స్ 702 పాయింట్లు, నిఫ్టీ 207 పాయింట్లు నష్టపోయాయి.

Srinivas kolluri
Last updated: ఏప్రిల్ 13, 2026 4:25 సా.
Srinivas Kolluri
12 గంటలు ago
Share
Stock Market Crash

అక్షరటుడే, వెబ్​డెస్క్: Stock Market Crash | అమెరికా, ఇరాన్‌ల మధ్య పాకిస్థాన్‌లో 21 గంటల పాటు జరిగిన చర్చలు విఫలమయ్యాయి. ఇరు దేశాలు శాంతి ఒప్పందానికి రాలేకపోవడంతో రెండు వారాల కాల్పుల విరమణ కొనసాగింపుపై నీలినీడలు కమ్ముకున్నాయి.

Contents
  • Stock Market Crash | భారీ గ్యాప్ డౌన్‌లో ప్రారంభమై..
    • Stock Market Crash | అడ్వాన్సెస్ అండ్ డిక్లయిన్స్..
      • మిక్స్‌డ్‌గా సూచీలు..

హార్మూజ్ జలసంధి (Strait of Hormuz) దిగ్బంధనానికి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఆదేశాలు ఇవ్వడంతో పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మళ్లీ పెరిగాయి. దీంతో ఇన్వెస్టర్ల సెంటిమెంట్ దెబ్బతింది. ముడి చమురు ధర బ్యారెల్‌కు 100 డాలర్లు దాటడం, రూపాయిలో తిరిగి బలహీనత కనిపించడంతో దేశీయ స్టాక్ మార్కెట్లు ఒత్తిడికి గురయ్యాయి.

Stock Market Crash | భారీ గ్యాప్ డౌన్‌లో ప్రారంభమై..

దేశీయ స్టాక్ మార్కెట్ (Domestic Stock Market) సోమవారం భారీ నష్టాలతో ప్రారంభమైంది. ఉదయం సెన్సెక్స్ 1,613 పాయింట్ల భారీ గ్యాప్ డౌన్ లో ప్రారంభమై మరో 69 పాయింట్లు కోల్పోయింది. కనిష్టాల వద్ద కొనుగోళ్ల మద్దతు లభించడంతో 1,195 పాయింట్లు ఎగబాకింది. నిఫ్టీ 462 పాయింట్ల నష్టంతో ప్రారంభమై మరో 34 పాయింట్లు తగ్గింది. అక్కడినుంచి కోలుకుని 352 పాయింట్లు పెరిగింది. చివరికి సెన్సెక్స్ 702 పాయింట్ల నష్టంతో 76,847 వద్ద, నిఫ్టీ 207 పాయింట్ల నష్టంతో 23,842 వద్ద స్థిరపడ్డాయి.

Stock Market Crash | అడ్వాన్సెస్ అండ్ డిక్లయిన్స్..

బీఎస్ఈలో నమోదైన కంపెనీలలో 1,790 కంపెనీలు లాభపడగా 2,573 స్టాక్స్ నష్టపోయాయి. 201 కంపెనీలు ఫ్లాట్‌గా ముగిశాయి. 126 కంపెనీలు 52 వారాల గరిష్టాల వద్ద ఉండగా.. 47 కంపెనీలు 52 వారాల కనిష్టాల వద్ద కదలాడాయి.

మిక్స్‌డ్‌గా సూచీలు..

ఆటో, ఆయిల్ అండ్ గ్యాస్, ఎనర్జీ సెక్టార్లు అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కోగా.. యుటిలిటీ, పవర్ సెక్టార్లలో కొనుగోళ్ల మద్దతు లభించింది. నిఫ్టీలో ఆటో ఇండెక్స్ 2.09 శాతం, ఆయిల్ అండ్ గ్యాస్ 1.41 శాతం, ఎనర్జీ 1.34 శాతం, ఎఫఎంసీజీ 1.29 శాతం, ఐటీ 1.16 శాతం నష్టపోగా.. యుటిలిటీ 1.37 శాతం, పవర్ 0.89 శాతం, టెలికాం ఇండెక్స్ 0.38 శాతం పెరిగాయి.

Gainers : బీఎస్ఈ సెన్సెక్స్‌లో 3 స్టాక్స్ లాభపడగా.. 27 స్టాక్స్ నష్టాలతో ముగిశాయి. ఐసీఐసీఐ బ్యాంక్ 2.16 శాతం, ఎన్టీపీసీ 1.54 శాతం, యాక్సిస్ బ్యాంక్ 0.15 శాతం లాభపడ్డాయి.

Top Losers : మారుతి 4.61 శాతం, బజాజ్ ఫైనాన్స్ 2.80 శాతం, ఇండిగో 2.78 శాతం, రిలయన్స్ 2.64 శాతం, టీసీఎస్ 2.05 శాతం నష్టపోయాయి.

ఇది కూడా చదవండి..: April 13 Pre Market Analysis | చర్చలు విఫలం.. నెగెటివ్‌లో స్టాక్ మార్కెట్లు

March 13 Gold Prices | బంగారం, వెండి ధరల్లో భారీ తగ్గుదల.. ప్రధాన నగరాల్లో తాజా పరిస్థితి ఇదే!
March 29 Gold Rates | స్థిరంగా బంగారం, వెండి ధరలు .. దేశంలోని ప్ర‌ధాన న‌గ‌రాల‌లో ఎలా ఉన్నాయంటే..!
March 07 Gold Silver Rates | ప‌సిడి ప్రియుల‌కి శుభ‌వార్త‌.. వరుసగా తగ్గుతున్న బంగారం, వెండి ధరలు!
Realme Narzo Power 5G | ఇది రియల్‌మీ ‘పవర్’!.. భారీ బ్యాటరీతో లాంచింగ్‌కు సిద్ధం
March 16 Gold Rates | స్వల్పంగా తగ్గిన బంగారం, వెండి ధరలు.. పెళ్లిళ్ల సీజన్‌లో కొనుగోలుదారులకు కాస్త‌ ఊరట
TAGGED:Crude Oil ImpactDomestic Stock MarketIndian economymarket newsnifty fallsensex fallshare market crashStock Market CrashStrait of HormuzWest Asia crisis
Share This Article
Facebook Whatsapp Whatsapp
Srinivas kolluri
BySrinivas Kolluri
Follow:
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Previous Article DOST Notification 2026 DOST Notification 2026 | డిగ్రీలో ప్రవేశాలకు.. దోస్త్ నోటిఫికేషన్​ విడుదల
Next Article Road Accident Prevention Road Accident Prevention | రోడ్డు ప్రమాదాల నియంత్రణకు సమష్టిగా కృషి చేద్దాం : కలెక్టర్​ ఇలా త్రిపాఠి
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?