అక్షరటుడే, వెబ్‌డెస్క్: Ustaad Bhagat Singh in OTT | పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా, శ్రీలీల, రాశీ ఖన్నా హీరోయిన్లుగా నటించిన ఉస్తాద్ భగత్ సింగ్ తాజాగా ఓటీటీలోకి అడుగుపెట్టింది. దర్శకుడు హరీశ్ శంకర్ (Director Harish Shankar) తెరకెక్కించిన ఈ మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ గత నెల ఉగాది సందర్భంగా విడుదలై మిశ్రమ స్పందన అందుకుంది.
భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మాత్రం అనుకున్న స్థాయిలో రాణించలేకపోయింది. పవన్ కల్యాణ్ యాక్షన్, మాస్ ఎలిమెంట్స్ అభిమానులను ఆకట్టుకున్నప్పటికీ, కథ పరంగా సినిమా బలహీనంగా ఉందన్న విమర్శలు వినిపించాయి. దీంతో ఈ చిత్రం యావరేజ్ ఫలితంతో సరిపెట్టుకుంది.
Ustaad Bhagat Singh in OTT | నేటి నుంచి ఓటీటీలోకి..
ఇక థియేట్రికల్ రన్ పూర్తవకముందే ఈ సినిమా డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లోకి రావడం గమనార్హం. ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ (Netflix) ఈ సినిమా స్ట్రీమింగ్ హక్కులను సొంతం చేసుకుని, ఏప్రిల్ 16 నుంచి ప్రసారం ప్రారంభించింది. తెలుగుతో పాటు తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో కూడా ఈ సినిమా అందుబాటులోకి వచ్చింది. సంగీత పరంగా ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ (Devi Sri Prasad) పాటలు అందించగా, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌ను ఎస్.ఎస్. థమన్ అందించారు. కోలీవుడ్ నటుడు ఆర్. పార్థిబన్ విలన్ పాత్రలో నటించి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ (Mythri Movie Makers) ఈ చిత్రాన్ని నిర్మించింది.
Ustaad Bhagat Singh in OTT | ఇప్పుడు ఓటీటీలో ఆస్వాదించే అవకాశం
థియేటర్లలో మిస్ అయిన ప్రేక్షకులతో పాటు, పవన్ కల్యాణ్ (Power Star Pawan Kalyan) అభిమానులు ఇప్పుడు ఓటీటీలో ఈ సినిమాను మరోసారి ఆస్వాదించే అవకాశం దక్కింది. ఇక డిజిటల్ వేదికపై ‘ఉస్తాద్ భగత్ సింగ్’కు ఎలాంటి స్పందన లభిస్తుందో చూడాల్సి ఉంది.ఈ సినిమాలో పవన్ సరసన యంగ్ బ్యూటీ శ్రీలీల, రాశీ ఖన్నా హీరోయిన్లుగా నటించారు. తమిళ నటుడు పార్తిబన్ విలన్ రోల్‌లో నటించగా… కేఎస్ రవికుమార్, అషుతోష్ రాణా, నవాబ్ షా, రావు రమేష్, రంగస్థలం మహేశ్, ప్రభాస్ శ్రీను తదితరులు కీలక పాత్రలు పోషించారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, వై రవిశంకర్ నిర్మించారు.
ఇది కూడా చదవండి..: Jananayagan HD Leak | విడుదలకు ముందే ‘జననాయగన్’ హెచ్‌డీ లీక్.. లీకు వీరులని అరెస్ట్ చేసిన పోలీసులు
