Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Vasuki Nagabhushana | శివయ్య మెడలో పాము ఎందుకుంటుంది.. ఆ సర్పానికి, విష్ణుమూర్తికి ఉన్న సంబంధం ఏమిటి?
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

భక్తి - Vasuki Nagabhushana | శివయ్య మెడలో పాము ఎందుకుంటుంది.. ఆ సర్పానికి, విష్ణుమూర్తికి ఉన్న సంబంధం ఏమిటి?

భక్తితాజా వార్తలు

Vasuki Nagabhushana | శివయ్య మెడలో పాము ఎందుకుంటుంది.. ఆ సర్పానికి, విష్ణుమూర్తికి ఉన్న సంబంధం ఏమిటి?

మృత్యుంజయుడైన శివుడి చెంత చేరడం వల్ల వాసుకికి మరణం లేని స్థితి లభించింది. పాముల, సైతం ప్రేమతో ఆదరించి, తన శరీరంలో భాగం చేసుకున్న ఆ దయామయుడిని మనం నాగభూషణుడు అని పిలుచుకుంటాం.

Naresh chandan
Last updated: ఏప్రిల్ 14, 2026 6:47 సా.
Naresh chandan
17 గంటలు ago
Share
Vasuki Nagabhushana
Vasuki Nagabhushana

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Vasuki Nagabhushana | హిందూ పురాణాలలో పరమేశ్వరుని రూపం అత్యంత విలక్షణమైనది. విభూతి రేఖలు, త్రిశూలం, నెత్తిన గంగతో పాటు ఆయన మెడలో నిరంతరం దర్శనమిచ్చే నాగాభరణం విశేషమైనది. ఆ నాగరాజు పేరు వాసుకి. అసలు ఒక సర్పం సాక్షాత్తు ఆ కైలాసనాథుడి మెడలో స్థానం సంపాదించుకోవడం వెనుక ఒక గొప్ప త్యాగం, అంతకు మించిన భక్తి దాగి ఉన్నాయి.

Contents
  • Vasuki Nagabhushana | ఆ కథా విశేషాలు ఇవే:
    • Vasuki Nagabhushana | తల్లి శాపం – ధర్మ పోరాటం:
      • శేషతల్పం, నాగాభరణం:

Vasuki Nagabhushana | ఆ కథా విశేషాలు ఇవే:

పందెం – ప్రాణ సంకటం: కశ్యప ప్రజాపతి భార్యలైన వినత, కద్రువల మధ్య జరిగిన ఒక చిన్న వివాదం సర్పజాతికి పెద్ద శాపంగా మారింది. పాలసముద్రం నుంచి పుట్టిన తెల్లని గుర్రం ‘ఉచ్చైశ్రవం’ తోక రంగుపై వీరిద్దరూ పందెం కట్టుకున్నారు. గుర్రం తోక నల్లగా ఉంటుందని కద్రువ, తెల్లగానే ఉంటుందని వినత వాదించుకున్నారు.

ఓడిన వారు గెలిచిన వారికి వెయ్యి ఏళ్ల పాటు సేవ చేయాలన్నది పందెం. నిజానికి ఆ గుర్రం పూర్తిగా తెల్లనిదే అయినప్పటికీ, ఎలాగైనా గెలవాలన్న పట్టుదలతో కద్రువ తన కుమారులైన సర్పాలను పిలిచి, గుర్రం తోకకు చుట్టుకుని అది నల్లగా కనిపించేలా మాయ చేయమని కోరుతుంది.

Vasuki Nagabhushana | తల్లి శాపం – ధర్మ పోరాటం:

అధర్మమైన ఈ పని చేయడానికి కద్రువ కుమారులు నిరాకరించారు. తల్లి మాట జవదాటినందుకు ఆగ్రహించిన కద్రువ.. భవిష్యత్తులో జనమేజయుడు చేసే ‘సర్పయాగం’లో పడి మీరంతా భస్మమైపోతారని తన బిడ్డలనే శపించింది. ఈ శాపంతో భయపడిన కొందరు సర్పాలు వెళ్లి తల్లి చెప్పినట్లు గుర్రం తోకకు చుట్టుకుని వినతను మోసగిస్తాయి. కానీ, కద్రువ పెద్ద కుమారులైన ఆదిశేషుడు, వాసుకి మాత్రం ధర్మం వైపే నిలబడ్డారు. తల్లి పెట్టిన శాపంతోపాటు మృత్యు భయం నుంచి ఎలా బయటపడాలో తెలియక వారు తపస్సు మార్గాన్ని ఎంచుకున్నారు.

శేషతల్పం, నాగాభరణం:

పెద్దవాడైన ఆదిశేషుడు శ్రీమహావిష్ణువును ప్రసన్నం చేసుకుని, ఆయనకు శేషతల్పంగా (పాన్పుగా) మారిపోయాడు. తద్వారా వైకుంఠంలో స్వామి సేవలో తరిస్తూ అమరత్వాన్ని పొందాడు. ఇక రెండో వాడైన వాసుకి పరమశివుని శరణు వేడాడు. కఠోరమైన తపస్సుతో లయకారుడిని మెప్పించాడు. వాసుకి నిశ్చల భక్తికి, ధర్మనిరతికి ముగ్ధుడైన బోళాశంకరుడు.. “ఇకపై నీకు మృత్యు భయం లేదు, నా మెడలో ఆభరణంగా ఉండిపో” అని వరమిచ్చాడట.

అప్పటి నుంచి వాసుకి శివుని మెడలో నాగాభరణమై భక్తులకు దర్శనమిస్తున్నాడు. మృత్యుంజయుడైన శివుడి చెంత చేరడం వల్ల వాసుకికి మరణం లేని స్థితి లభించింది. పాములను సైతం ప్రేమతో ఆదరించి, తన శరీరంలో భాగం చేసుకున్న ఆ దయామయుడిని మనం నాగభూషణుడు అని పిలుచుకుంటాం. ఈ గాథ మనకు ఒక ముఖ్యమైన విషయాన్ని బోధిస్తుంది. ఎటువంటి క్లిష్ట పరిస్థితుల్లోనైనా ధర్మాన్ని వీడకుండా భగవంతుని నమ్ముకుంటే, సాక్షాత్తు ఆ దేవుడే మనల్ని అక్కున చేర్చుకుంటాడు.

ఇది కూడా చదవండి: Bilva Patra | బిల్వపత్రం వెనుక ఉన్న అసలు రహస్యం ఇదే.. త్రిమూర్తి తత్వానికి ఇది ఎలా ప్రతీకంటే!

Sadabainama Registration Changes | ప్రభుత్వం గుడ్​న్యూస్​.. సాదాబైనామా రిజిస్ట్రేష‌న్ల‌లో మార్పులు
Everest Insurance Scam | 30 వేల అడుగుల ఎత్తులో పర్వతారోహకుల ప్రాణాలతో చెలగాటం.. నేపాల్​లో ట్రెక్కింగ్​ ఇన్సూరెన్స్​ కుంభకోణం!
Telangana Public Schools | రవాణాలో 50 శాతం రాయితీ.. బోర్డుల విలీనం.. విద్యావిధానంపై సీఎం కీలక నిర్ణయాలు!
Nizamabad Murder Case | గొడ్డలితో మెడపై నరికి.. నిజామాబాద్​లో యువకుడి దారుణ హత్య!
April 05 Horoscope | స్టాక్ మార్కెట్లో జాక్‌పాట్.. ఆ రాశుల వారి ఆర్థిక కష్టాలకు ఎండ్ కార్డ్!
TAGGED:hindu mythology storiesindian puranas storynagabhushana meaningshiva snake reasonspiritual stories indiavasuki and shivaVasuki Nagabhushanavasuki nagabhushana storyvishnu shiva connection
Share This Article
Facebook Whatsapp Whatsapp
Naresh chandan
ByNaresh chandan
Follow:
గత 18 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నాను. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టాను. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశాను. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా నా ప్రయాణం మొదలెట్టాను. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నాను. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Previous Article Telangana IPS Transfers Telangana IPS Transfers | రాష్ట్రంలో పలువురు ఐపీఎస్​ల బదిలీ
Next Article fortis సాలిడ్ హ్యాబిట్స్.. స్ట్రాంగ్ లివర్.. గ్లెనెగల్స్ హాస్పిటల్ బైక్ ర్యాలీకి విశేష స్పందన
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?