Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Road Accident Prevention | రోడ్డు ప్రమాదాల నియంత్రణకు సమష్టిగా కృషి చేద్దాం : కలెక్టర్​ ఇలా త్రిపాఠి
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

నిజామాబాద్ - Road Accident Prevention | రోడ్డు ప్రమాదాల నియంత్రణకు సమష్టిగా కృషి చేద్దాం : కలెక్టర్​ ఇలా త్రిపాఠి

నిజామాబాద్

Road Accident Prevention | రోడ్డు ప్రమాదాల నియంత్రణకు సమష్టిగా కృషి చేద్దాం : కలెక్టర్​ ఇలా త్రిపాఠి

రోడ్డు ప్రమాదాల నియంత్రణకు అందరం కలిసికట్టుగా కృషి చేద్దామని కలెక్టర్ ఇలా త్రిపాఠి పిలుపునిచ్చారు. ఆర్మూర్ మండలం పిప్రి గ్రామంలో జరిగిన గ్రామ సభలో మాట్లాడారు.

Srinivas kolluri
Last updated: ఏప్రిల్ 13, 2026 4:51 సా.
Srinivas Kolluri
1 వారం ago
Share
Road Accident Prevention

అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: Road Accident Prevention | రోడ్డు ప్రమాదాల నియంత్రణకు అందరం కలిసికట్టుగా కృషి చేద్దామని కలెక్టర్ ఇలా త్రిపాఠి (Collector Ila Tripathi) పిలుపునిచ్చారు. ప్రజా పాలన–ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా సోమవారం ఆర్మూర్ మండలం పిప్రి గ్రామంలో జరిగిన గ్రామ సభలో కలెక్టర్​ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఈ సందర్భంగా అంగన్​వాడీ కార్యకర్త, ఆశా వర్కర్లు, ఇతర గ్రామ పెద్దలతో కూడిన తొమ్మిది మందితో రోడ్ సేఫ్టీ కమిటీని ఎన్నుకున్నారు.

Contents
  • Road Accident Prevention | రోడ్డు ప్రమాదాల్లోనే ఎక్కువ మరణాలు..
    • Road Accident Prevention | హెల్మెట్​ భారంగా భావించవద్దు..

Road Accident Prevention | రోడ్డు ప్రమాదాల్లోనే ఎక్కువ మరణాలు..

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. మన దేశంలో, రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాల (Road Accidents) కారణంగానే ప్రాణాలు కోల్పోతున్నారన్నారు. ప్రమాదాలకు నియంత్రించాలనే సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీ స్థాయి అత్యున్నత అధికారులు ప్రజల్లో అవగాహనను పెంపొందిస్తూ.. వారిని భాగస్వాములు చేసేందుకు అరైవ్ – అలైవ్ పేరిట కార్యక్రమాలను అమలు చేస్తున్నారని తెలిపారు. కార్యక్రమాల ఔన్యత్యాన్ని గుర్తిస్తూ ప్రతిఒక్కరూ ఇందులో భాగస్వాములై, రోడ్డు ప్రమాదాల నియంత్రణకు తమవంతు కృషి చేయాలని పిలుపునిచ్చారు.

Road Accident Prevention | హెల్మెట్​ భారంగా భావించవద్దు..

హెల్మెట్​ (Helmet)ను భారంగా భావించకూడదని, ప్రమాద సమయాల్లో ప్రాణాలను రక్షించే శిరస్త్రానాన్ని ద్విచక్ర వాహనదారులు తప్పక ధరించాలని కలెక్టర్​ సూచించారు. కార్లలో ప్రయాణించే వారు విధిగా సీట్ బెల్టు ధరించాలన్నారు. ట్రాఫిక్ నిబంధనలను తూచా తప్పకుండా పాటిస్తూ, రాంగ్ సైడ్ డ్రైవింగ్, మద్యం సేవించి వాహనం నడపడం వంటివి చేయకూడదని సూచించారు. రోడ్డు ప్రమాదాలు జరిగిన సమయాల్లో క్షతగాత్రులకు తక్షణ సహాయం అందించేందుకు చొరవ చూపాలన్నారు. ఈ తరహా చొరవ చూపిన వారికి ప్రభుత్వం రహ్-వీర్ కింద రూ.25వేల ఆర్ధిక ప్రోత్సాహకాన్ని అందజేస్తుందని తెలిపారు.

ఈ సందర్భంగా గ్రామ సభలో పలు తీర్మానాలు చేశారు. వచ్చేనెల మే 1వ తేదీ నుంచి గ్రామంలో ప్లాస్టిక్ వాడకాన్ని విడనాడాలని, గంజాయి, మత్తు పదార్థాలను విక్రయించే వారి సమాచారాన్ని అందించిన వారికి తగిన పారితోషికం అందిస్తూ వారి పేర్లను గోప్యంగా ఉంచాలన్నారు. గ్రామ సభకు సర్పంచ్ కిరణ్ అధ్యక్షత వహించగా, డిప్యూటీ ట్రాన్స్​పోర్ట్​ కమిషనర్ దుర్గాప్రమీల, జిల్లా రవాణా శాఖ అధికారి ఉమామహేశ్వర రావు, ఎంపీడీవో శివాజీ, తహశీల్దార్ సత్యనారాయణ, ఎంపీవో శ్రీనివాస్, ఆర్మూర్ ఎస్​హెచ్​వో సత్యనారాయణ, ఎంవీఐ రాహుల్ కుమార్, పంచాయతీ కార్యదర్శి మురళి, గ్రామస్థులు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి..: CCS Police | పేకాట స్థావరంపై సీసీఎస్​ పోలీసుల మెరుపుదాడి.. ప్రముఖులు ఉన్నట్లుగా అనుమానాలు..

Pocharam Srinivas Reddy | ఆలయాల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉంది: ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి
Jeevan Reddy Sabha | జీవన్ రెడ్డి బహిరంగ సభపై ఉత్కంఠ.. కేసీఆర్ హాజరు అవుతారా?
Kamareddy Municipal Chairperson | సమాజ సేవలో ముందుండాలి.. కామారెడ్డి మున్సిపల్ ఛైర్​పర్సన్​
Extramarital Affair Murder | ఇద్దరితో అక్రమ బంధం.. ఒకడి సహకారంతో మరొకడిని కడతేర్చిన మహిళ!
Godavari Pushkaralu 2027 | గోదావరి పుష్కరాలకు ముందస్తు ఏర్పాట్లు చేయాలి.. మంత్రి కోమటిరెడ్డికి ఎంపీ అర్వింద్​ లేఖ
TAGGED:accident preventionCollector Ila Tripathidrunk driving awarenesshelmet safetypublic safetyRoad Accident PreventionRoad AccidentsTelangana newstraffic rules awareness
Share This Article
Facebook Whatsapp Whatsapp
Srinivas kolluri
BySrinivas Kolluri
Follow:
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Previous Article Stock Market Crash Stock Market Crash | భారీ నష్టాలతో ముగిసిన సూచీలు
Next Article Traffic Rules Awareness Traffic Rules Awareness | ట్రాఫిక్ నియమాలు పాటిద్దాం.. రోడ్డు ప్రమాదాలు నివారిద్దాం: పోలీస్ కమిషనర్
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?