Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Revanth Reddy | డీలిమిటేషన్ ప్రక్రియపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

తెలంగాణ - Revanth Reddy | డీలిమిటేషన్ ప్రక్రియపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

తెలంగాణతాజా వార్తలు

Revanth Reddy | డీలిమిటేషన్ ప్రక్రియపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

మహిళా రిజర్వేషన్లు, డీలిమిటేషన్‌పై సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర సచివాలయంలో ఆయన సోమవారం మీడియాతో మాట్లాడారు.

Sandeep kumar Balla_Author
Last updated: ఏప్రిల్ 13, 2026 5:55 సా.
Sandeep Kumar Balla
Sandeep kumar Balla_Author
BySandeep Kumar Balla
Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే...
Follow:
2 రోజులు ago
Share
Revanth Reddy Delimitation

అక్షరటుడే, వెబ్​డెస్క్​: Revanth Reddy Delimitation | మహిళా రిజర్వేషన్లు, డీలిమిటేషన్‌పై సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర సచివాలయంలో ఆయన సోమవారం మీడియాతో మాట్లాడారు. మహిళా రిజర్వేషన్లు, డీలిమిటేషన్ రెండూ వేర్వేరు అంశాలని తెలిపారు. అయితే ఈ రెండు అంశాలను కలిపి బీజేపీ (BJP) కావాలనే రాజకీయం చేస్తోందని విమర్శించారు.

Contents
  • Revanth Reddy Delimitation | రెండూ కీలక అంశాలే..
    • Revanth Reddy Delimitation | సమాన హక్కులు కల్పించింది కాంగ్రెస్సే..
      • Revanth Reddy Delimitation | మహిళా రిజర్వేషన్లు బిల్లుకు మద్దతు
        • Revanth Reddy Delimitation | ప్రమాదకర దిశలో డీలిమిటేషన్

Revanth Reddy Delimitation | రెండూ కీలక అంశాలే..

మహిళా రిజర్వేషన్లతో పాటు నియోజకవర్గాల పెంపు రెండూ కీలక అంశాలని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. బీజేపీ మాత్రం తమ సొంత వ్యవహారంగా వ్యవహరిస్తోందంటూ విమర్శలు చేశారు. ప్రతిపక్షాలు తమకు సహకరించడం లేదని తప్పుడు ప్రచారం చేస్తోందన్నారు. మహిళా రిజర్వేషన్ బిల్లుకు కాంగ్రెస్ (Congress) వ్యతిరేకం అంటూ ప్రచారం చేస్తుందని ఆయన విమర్శించారు.

Revanth Reddy Delimitation | సమాన హక్కులు కల్పించింది కాంగ్రెస్సే..

మహిళలకు ఓటు హక్కుతో పాటు సమాన హక్కులను కల్పించింది కాంగ్రెస్సే అని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. కానీ కేంద్రం దేశ వ్యాప్తంగా కుట్రపూరితంగా హడావుడి చేస్తోందని మండిపడ్డారు. 2011 జనాభా ప్రాతిపదికన డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్లు కలుపుతున్నారని ఆరోపించారు. ఇందులో రాజకీయ కుట్ర, వివక్ష కలిసి ఉన్నాయని ఆయన అనుమానం వ్యక్తం చేశారు.

Revanth Reddy Delimitation | మహిళా రిజర్వేషన్లు బిల్లుకు మద్దతు

మహిళా రిజర్వేషన్లు బిల్లుకు సంపూర్ణంగా మద్దతు ఇస్తున్నామని సీఎం రేవంత్​ రెడ్డి తెలిపారు. అయితే ఉన్న సీట్ల ఆధారంగానే ఈ బిల్లును అమలు చేయాలన్నారు. కానీ ఎన్డీయే 2011 జనాభా లెక్కల ప్రకారం అమలు చేయాలని చూస్తోందని ఆరోపించారు. 2026 జనాభా లెక్కల ప్రాతిపదికన డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్లను అమలు చేయాలని డిమాండ్​ చేశారు. వచ్చే ఆరు నెలల్లోనే మహిళా రిజర్వేషన్లు అమలు చేయాలన్నారు.

Revanth Reddy Delimitation | ప్రమాదకర దిశలో డీలిమిటేషన్

డీలిమిటేషన్ ప్రక్రియ ప్రమాదకర దిశలో వెళ్తోందని రేవంత్​ రెడ్డి ఆరోపించారు. చిన్న రాష్ట్రాలు, దక్షిణాదికి అన్యాయం చేసే కుట్రను మోదీ (Modi) చేస్తున్నారని వ్యాఖ్యానించారు. కుటుంబ నియంత్రణను దక్షిణాది రాష్ట్రాలు సమర్థంగా అమలు చేశాయన్నారు. ఉత్తరాదిలో కుటుంబ నియంత్రణ సరిగా జరగకపోవడంతో జనాభా విపరీతంగా పెరిగిందన్నారు. దీంతో దక్షిణాదికి అన్యాయం జరుగుతుందన్నారు.

ఇది కూడా చదవండి..: DOST Notification 2026 | డిగ్రీలో ప్రవేశాలకు.. దోస్త్ నోటిఫికేషన్​ విడుదల

Crude Oil Effect | క్రూడ్ ఆయిల్ ఎఫెక్ట్.. స్టాక్ మార్కెట్‌లో భారీ పతనం
Hyderabad Traffic Restrictions | పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు.. హైదరాబాద్​లో ట్రాఫిక్​ ఆంక్షలు
DSP Transfers State | తెలంగాణ రాష్ట్రంలో పలువురు డీఎస్పీల బదిలీ
Telangana Engineering Fees | ప్రైవేట్​ ఇంజినీరింగ్​ కాలేజీల్లో ఫీజులు ఖరారు.. అత్యధికంగా సీబీఐటీలో..
Telangana BJP Executive | శాశ్వత ఆహ్వానితులుగా బీజేపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు.. రాష్ట్ర కార్యవర్గ సభ్యులను ప్రకటించిన పార్టీ అధ్యక్షుడు
TAGGED:BJP PoliticsCongress IndiaDelimitation IndiaIndian Politics NewsPopulation CensusRevanth ReddyRevanth Reddy DelimitationSouth vs North Debatewomen reservation bill
Share This Article
Facebook Whatsapp Whatsapp
Sandeep kumar Balla_Author
BySandeep Kumar Balla
Follow:
Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే తెలంగాణ దినపత్రికలో 2011లో చేరి రెండు సంవత్సరాల పాటు పనిచేశాను. ఆ తర్వాత ‘సాక్షి’ దినపత్రికలో 2013 నుంచి 2024 జూలై వరకు సీనియర్​ సబ్​ ఎడిటర్​గా వర్క్​ చేశాను. 2024 ఆగస్టు నుంచి ‘అక్షరటుడే’లో అసోసియేట్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, లోకల్​, నేషనల్​, ఇంటర్నేషనల్​, క్రైం, లైఫ్​స్టైల్​, సినిమా ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Previous Article Paresh Rawal IMF Comment Paresh Rawal IMF Comment | హోటల్ బిల్లు కట్టేదెవరు?
Next Article Land Survey Rovers Land Survey Rovers | రోవర్లతో పక్కాగా భూ సర్వే.. మంత్రి పొంగులేటి
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?