అక్షరటుడే, వెబ్డెస్క్ : Land Survey Rovers | రాష్ట్రంలో నిజాం కాలం నుంచి 378 గ్రామాలకు నక్షాలు లేవని మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి (Ponguleti) అన్నారు. ఇందులో ఇప్పటికే ఐదు గ్రామాల్లో రీ సర్వే పూర్తి చేసి భూదార్ నెంబర్ కేటాయించామన్నారు.
సచివాలయంలో భూ భారతి (Bhu Bharati) చట్టంపై మంత్రి సోమవారం సమీక్ష నిర్వహించారు. ఈ చట్టం తీసుకొచ్చి రేపటితో ఏడాది పూర్తి కానుంది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భూ పరిపాలనకు కొత్త దిక్సూచి భూభారతి చట్టం అన్నారు. రాష్ట్రంలో పాతసర్వే పద్ధతులకు స్వస్తి పలుకుతూ ప్రతి జిల్లాలో 70 రెవెన్యూ గ్రామాలను గుర్తించి రోవర్లతో భూ సర్వే చేయనున్నట్లు వెల్లడించారు. ఇప్పటికే 411 రోవర్లను కొనుగోలు చేశామని, త్వరలో మరో 400 కొనుగోలు చేస్తామన్నారు.
Land Survey Rovers | అవినీతి రహిత సేవలు
భూహక్కుల పరిరక్షణ, పారదర్శకత, అవినీతి రహిత సేవలు అందించడానికి భూ భారతి చట్టాన్ని తెచ్చామని పొంగులేటి అన్నారు. పోర్టల్ ప్రారంభించిన ఏడాది వ్యవధిలో 3.80 లక్షల పాస్ బుక్లు జారీ చేశామని వెల్లడించారు. భూ వివాదాలకు చరమగీతం పాడుతూ ఈ 12 నెలల కాలంలో పాత చిక్కుముడులను విప్పడంలో ఈ పోర్టల్ కీలక పాత్ర పోషించిందన్నారు.
Land Survey Rovers | ఇంటిగ్రేటేడ్ పోర్టల్
రెవెన్యూ (Revenue), సర్వే, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ విభాగాలను ఒకే గొడుగు కిందకు తెస్తూ రూపొందించిన ఇంటిగ్రేటెడ్ భూభారతి పోర్టల్ సేవలు ఏప్రిల్ 2న 5 మండలాల్లో ప్రారంభించామన్నారు. రాష్ట్రంలో 1948 నాటికి సుమారు 40 లక్షల సర్వేనెంబర్లు వినియోగంలో ఉండగా ఇప్పుడు ఆ సంఖ్య 2కోట్ల 29 లక్షలకు చేరిందని మంత్రి తెలిపారు.
దీనిని కూడా చదవండి : DOST Notification 2026 | డిగ్రీలో ప్రవేశాలకు.. దోస్త్ నోటిఫికేషన్ విడుదల
