Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Ambedkar Jayanti | రాజ్యాంగాన్ని మార్చడానికి బీజేపీ కుట్ర: డిప్యూటీ సీఎం భట్టి
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

తెలంగాణ - Ambedkar Jayanti | రాజ్యాంగాన్ని మార్చడానికి బీజేపీ కుట్ర: డిప్యూటీ సీఎం భట్టి

తెలంగాణతాజా వార్తలు

Ambedkar Jayanti | రాజ్యాంగాన్ని మార్చడానికి బీజేపీ కుట్ర: డిప్యూటీ సీఎం భట్టి

అంబేడ్కర్​ జయంతి సందర్భంగా భట్టి విక్రమార్క, పీసీసీ చీఫ్​ మహేశ్​కుమార్ గౌడ్​ హెచ్​ఎండీఏ గ్రౌండ్​లోని అంబేడ్కర్ విగ్రహం వద్ద నివాళులర్పించారు.

Sandeep kumar Balla_Author
Last updated: ఏప్రిల్ 14, 2026 11:24 ఉద.
Sandeep Kumar Balla
Sandeep kumar Balla_Author
BySandeep Kumar Balla
Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే...
Follow:
2 రోజులు ago
Share
Ambedkar Jayanti

అక్షరటుడే, వెబ్​డెస్క్: Ambedkar Jayanti | భారతీయ జనతా పార్టీ (Bharatiya Janata Party) రాజ్యాంగాన్ని మార్చడానికి, ప్రజాస్వామ్యాన్ని బలహీనపరిచేందుకు ప్రయత్నిస్తోందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆరోపించారు. దీంతో ప్రజలు తమ హక్కులను కోల్పోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. జై భీమ్ నినాదంతో రాజ్యాంగాన్ని పరిరక్షించడానికి ప్రజలు ఏకం కావాలన్నారు.

Contents
  • Ambedkar Jayanti | హక్కులు లభించేలా..
    • Ambedkar Jayanti | అంబేడ్కర్​ మార్గంలో..

బీఆర్​ అంబేడ్కర్​ జయంతి (BR Ambedkar Jayanti ) సందర్భంగా భట్టి విక్రమార్క, పీసీసీ చీఫ్​ మహేశ్​కుమార్ గౌడ్​ హెచ్​ఎండీఏ గ్రౌండ్​లోని అంబేడ్కర్ విగ్రహం వద్ద ఘన నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు పొన్నం ప్రభాకర్​, జూపల్లి కృష్ణారావు, వాకిటి శ్రీహరి పాల్గొన్నారు. భట్టి విక్రమార్క (Bhatti Vikramarka) మాట్లాడుతూ.. అంబేడ్కర్ మన దేశంలో జన్మించడం మన అదృష్టమన్నారు.

Ambedkar Jayanti | హక్కులు లభించేలా..

అంబేడ్కర్ రాజ్యాంగం ద్వారా ప్రజాస్వామ్యానికి పునాదులు వేసి, భారతదేశాన్ని ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా నిలబెట్టారని భట్టి కొనియాడారు. రాజ్యాంగం ద్వారా ప్రతి పౌరుడికి సమాన హక్కులు లభించేలా కృషి చేశారన్నారు. లింగ వివక్షను పరిష్కరించడానికి ప్రయత్నించారన్నారు. కుల, మతాలకు అతీతంగా, మహిళలందరి సంక్షేమం కోసం ఆయన కృషి చేశారన్నారు. కార్మికుల పని గంటలను 12 నుండి 8 గంటలకు తగ్గించడంలో అంబేడ్కర్​ కీలక పాత్ర పోషించారని చెప్పారు.

Ambedkar Jayanti | అంబేడ్కర్​ మార్గంలో..

రాజ్యాంగం మనకు ప్రశ్నించే హక్కును, స్వేచ్ఛను, మానవ హక్కులను ఇచ్చిందన్నారు. తెలంగాణ ప్రభుత్వం (Telangana Government) అంబేడ్కర్ చూపిన మార్గంలో నడుస్తుందని చెప్పారు. సామాజిక న్యాయంపై చిత్తశుద్ధితో ప్రభుత్వం కులగణనకు కట్టుబడి ఉందన్నారు. రాజ్యాంగబద్ధంగా కులగణన నిర్వహించడంలో తెలంగాణ ముందంజలో ఉందని తెలిపారు.

ఇది కూడా చదవండి..: Padayatra Political Strategy | పాదయాత్రతో అధికారం దక్కేనా..

Banana Empty Stomach | అరటిపండు అమృతమే.. కానీ ఖాళీ కడుపుతో తింటే విషమే!
Hyderabad Pilot Assault | పైలెట్ ట్రైనింగ్ సెంటర్​లో దారుణం.. యువతిపై అత్యాచారం
Gas Cylinder Shortage | కొనసాగుతున్న గ్యాస్ క‌ష్టాలు
Rahul Gandhi on Modi | ట్రంప్​కు భయపడుతున్న మోదీ : రాహుల్​ గాంధీ
Iran Ceasefire Deal | ఇరాన్‌పై దాడులు తాత్కాలికంగా నిలిపివేత.. రెండు వారాల కాలపరిమితి ప్రకటించిన ట్రంప్
TAGGED:Ambedkar JayantiBharatiya Janata PartyBhatti Vikramarkabjp newsconstitution indiademocracy debateIndian Politicspolitical controversyTelangana GovernmentTelangana Politics
Share This Article
Facebook Whatsapp Whatsapp
Sandeep kumar Balla_Author
BySandeep Kumar Balla
Follow:
Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే తెలంగాణ దినపత్రికలో 2011లో చేరి రెండు సంవత్సరాల పాటు పనిచేశాను. ఆ తర్వాత ‘సాక్షి’ దినపత్రికలో 2013 నుంచి 2024 జూలై వరకు సీనియర్​ సబ్​ ఎడిటర్​గా వర్క్​ చేశాను. 2024 ఆగస్టు నుంచి ‘అక్షరటుడే’లో అసోసియేట్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, లోకల్​, నేషనల్​, ఇంటర్నేషనల్​, క్రైం, లైఫ్​స్టైల్​, సినిమా ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Previous Article Ola S1 X Plus Ola S1 X Plus | భళారే ఓలా.. సింగిల్ చార్జ్‌తో 320 కిలోమీటర్లు?
Next Article CMF Phone 3 Pro 5G CMF Phone 3 Pro 5G | మిడ్ రేంజ్‌లో నథింగ్ ఫోన్
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?