అక్షరటుడే, నిజామాబాద్ క్రైం: Road Safety Rules | ప్రతిఒక్కరూ రోడ్డు భద్రతా (traffic rules) నియమాలు తప్పకుండా పాటించాలని, హెల్మెట్లు లేకుండా బైక్‌లు నడపవద్దని డీజీపీ శివధర్ రెడ్డి (DGP Shivadhar Reddy) అన్నారు. నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని ఇందల్వాయి (Indalwai) పోలీస్ స్టేషన్ పరిధిలో 44వ జాతీయ రహదారి చంద్రాయన్ పల్లి వద్ద వీఐడీఎస్ (VIDS) (వీడియో సంఘటన గుర్తింపు వ్యవస్థ)ను ఆయన ప్రారంభించారు.
Road Safety Rules | జాతీయ రహదారిపై డిఫెన్స్ డ్రైవింగ్..
జాతీయ రహదారిపై డిఫెన్స్ డ్రైవింగ్ తప్పకుండా పాటించాలని ప్రతిఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు సూచనలు పాటిస్తూ ప్రయాణం చేయాలని డీజీపీ అన్నారు. వాహనానికి వాహనానికి డిస్టెన్స్ ఉంచాలని వాహనం వేగంగా వెళ్లకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. వాహనాలు నడిపేటప్పుడు మనపై ఆధారపడ్డ వారికి కన్నీరు మిగిల్చరాదని.. సీట్ బెల్ట్ తప్పనిసరిగా ధరించాలని సూచించారు. రోడ్డు భద్రతపై ఇతరులకు సైతం అవగాహన కల్పించాలని సూచించారు.
Road Safety Rules | వీఐడీఎస్తో ట్రాఫిక్ పర్యవేక్షణ..
అనంతరం గ్రామ ప్రజలతో అరైవ్ అలైవ్ (Arrive Alive) కార్యక్రమానికి సంబంధించిన ప్రతిజ్ఞ చేయించారు. వీఐడీఎస్ (వీడియో సంఘటన గుర్తింపు వ్యవస్థ) మానవ ప్రమేయం లేకుండా ట్రాఫిక్‌ను నిరంతరం పర్యవేక్షిస్తుందన్నారు. అలాగే ఏఐ విశ్లేషణలతో కూడిన హై-డెఫినిషన్ నిఘా కెమెరాలను ఉపయోగిస్తుందన్నారు. కార్యక్రమంలో నిజామాబాద్ (Nizamabad Police) పోలీస్ కమిషనర్ సాయి చైతన్య (Police Commissioner Sai Chaitanya), అదనపు డీసీపీ (అడ్మిన్) బస్వారెడ్డి, నిజామాబాద్ ఇన్‌ఛార్జి ఏసీపీ రాజా వెంకటరెడ్డి, ఆర్మూర్ ఏపీసీ వెంకట్‌రెడ్డి, డిచ్పల్లి సీఐ వినోద్, ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ ప్రసాద్, ట్రాఫిక్ రిజర్వ్ ఇన్స్పెక్టర్ వినోద్, డిచ్పల్లి ఎస్సై ఆరీఫ్, ఇందల్వాయి ఎస్సై సందీప్, ఈ-డార్ మేనేజర్ వర్ష, ప్రాజెక్ట్ మేనేజర్ వంశీధర్, టోల్ ప్లాజా మేనేజర్ వీరబాలు, సర్పంచ్ రఘు, గ్రామస్థులు పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి: Kamareddy black spots | కామారెడ్డిలో బ్లాక్ స్పాట్స్‌ను పరిశీలించిన డీజీపీ
