అక్షరటుడే, నిజామాబాద్ అర్బన్: Hindu Sammelan | ప్రస్తుతం హిందువుల అనుభవిస్తున్న అన్ని సమస్యలకు ఏకైక పరిష్కారం సనాతన ధర్మాన్ని స్వయంగా ఆచరించడం మాత్రమేనని.. విద్యా భారతి (Vidya Bharati) అఖిలభారత అధికారి అయాచితుల లక్ష్మణరావు అన్నారు. నగరంలోని మూడో డివిజన్ పరిధిలోని ఆర్టీసీ కాలనీ, శ్రీనివాస్ నగర్ కాలనీ, మహాలక్ష్మి నగర్, సాయిటవర్స్ భాగ్యనగర్ కాలనీ వాసుల సంయుక్తంగా శ్రీనివాస నగర్ హనుమాన్ మందిరంలో హిందూ సమ్మేళనం (Hindu Sammelanam) నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా లక్ష్మణరావు హాజరై ప్రసంగించారు.
Hindu Sammelan | భగవద్గీత పుస్తకాన్ని దాచుకోవద్దు.. చదువుకోవాలి..

ఈ సందర్భంగా లక్ష్మణ్ రావు మాట్లాడుతూ భగవద్గీత పుస్తకాన్ని (bhagavad gita) దాచుకోవడానికి కోసం కాకుండా నిత్యం పఠించాలని హిందువులు కులవర్గాలకు అతీతంగా ఏకం కావాలని పిలుపునిచ్చారు. అందరూ జ్ఞాన సంపన్నులు కావాలని ప్రతి హిందూ సమాజ శ్రేయస్సు కోరి సమాజానికి అవసరమైన విధంగా భారతీయ సనాతన సంస్కృతిని కాపాడాలని కోరారు. కేదార నంద స్వామి (పలుగుట్ట) మాట్లాడుతూ సనాతన హిందూ ధర్మాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రతి భారతీయుడిపై ఉందని తెలిపారు. అహల్య మాట్లాడుతూ భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు ఔన్నతిని ప్రతిఒక్కరూ సంరక్షించాలని కోరారు.
Hindu Sammelan | ప్రతి తల్లి తన కుమారుడిని శివాజీగా..
మల్లారం పిట్ల కృష్ణ మహారాజు (Pitla Krishna Maharaj) (మల్లారం) మాట్లాడుతూ ప్రతి తల్లి తన కుమారుడిని శివాజీలా తీర్చిదిద్దాలని హిందూ ధర్మరక్షణకు ముందుండాలని తెలిపారు. కార్యక్రమంలో మొదట ఇస్కాన్ (ISKCON) రామానంద్రాయ గౌరీదాస్ ఆధ్వర్యంలో శ్రీకృష్ణుడి గీతాలాపన నిర్వహించారు. అనంతరం బాలరాజు భారతి బృందం ఆధ్వర్యంలో రామనామ సంకీర్తన తర్వాత సాయి టవర్స్‌కు చెందిన సాహితీ, హరిణి నృత్య ప్రదర్శనలతో అలరించారు. కార్యక్రమంలో పుల్కం సుదర్శన్ అధ్యక్ష ఉపన్యాసం అనంతరం శశికాంత్ జోషి మాట్లాడుతూ రాష్ట్రీయ స్వయం సేవక్ (RSS) సేవలను కొనియాడారు. మూడో డివిజన్ కార్పొరేటర్ చింతా ప్రసూన, 42వ డివిజన్ కార్పొరేటర్ శశాంక్, అధిక సంఖ్యలో హిందువులు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి: Rythu Bharosa Delay | రైతు భరోసా వచ్చేనా.. రెండో విడతపై స్పష్టత కరువు
