అక్షరటుడే, వెబ్‌డెస్క్: Rythu Bharosa Delay | యాసంగి సీజన్ ముగింపునకు వచ్చింది. వరి కోతలు జోరందుకున్నాయి. పలు గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను కూడా అధికారులు ప్రారంభిస్తున్నారు. అయినా కూడా రైతు భరోసా (Rythu Bharosa) పూర్తిస్థాయిలో అన్నదాతల ఖాతాలో జమ కాలేదు. సీజన్ ప్రారంభంలో రావాల్సిన డబ్బు.. సీజన్ ముగుస్తున్న రాకపోవడంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
రాష్ట్రంలో రైతులకు ఎకరాకు రూ.6 వేల చొప్పున పెట్టుబడి సాయం అందిస్తున్న విషయం తెలిసిందే. ఈ యాసంగి సీజన్‌కు సంబంధించి తొలి విడుత డబ్బులను మార్చి 22న సీఎం రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) విడుదల చేశారు. ఎకరంలోపు ఉన్న రైతులకు మొత్తం నిధులు జమ చేశారు. ఎకరం కంటే ఎక్కువ భూమి ఉన్న వారికి కూడా ఎకరం భూమికి మాత్రమే నిధులు విడుదల చేశారు. ఎన్ని ఎకరాలున్నా రూ.6 వేలే వేశారు. మిగతా డబ్బులను రెండో విడతలో జమ చేస్తామని చెప్పారు.
Rythu Bharosa Delay | అసలు వేస్తారా..
రాష్ట్ర ప్రభుత్వం (State Government) మార్చి 22న తొలి విడత రైతు భరోసా విడుదల చేసింది. రెండో విడత 20 రోజుల్లో వేస్తామని చెప్పింది. ఈ లెక్కన ఏప్రిల్ 12లోపు డబ్బులు వేయాలి. కానీ ఆ గడువు ముగిసిన రైతు భరోసా గురించి ప్రభుత్వం ఎలాంటి ప్రకటన చేయడం లేదు. తొలి విడతలో రూ.3,590 కోట్లు జమ చేశారు. రెండో విడతలో రూ.2,650 కోట్లు, మూడో విడతలో ఏప్రిల్ చివరి వరకు రూ.2760 కోట్లు వేస్తామని సీఎం తెలిపారు. అయితే రెండో విడత డబ్బులు ఇంకా జమ చేయకపోవడం.. మరోవైపు ధాన్యం కొనుగోళ్లు ప్రారంభం అవుతుండటంతో అసలు డబ్బులు వేస్తారా లేదా అని రైతులు ఆందోళన చెందుతున్నారు.
ఇది కూడా చదవండి..: Kavitha Comments | ప్రభుత్వానికి బుద్ధి రావాలి.. కవిత సంచలన వ్యాఖ్యలు
