Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: BJP Manifesto Tamil Nadu | మహిళలకు నెలకు రూ.2 వేలు.. ఉచితంగా మూడు సిలిండర్లు : బీజేపీ హామీ
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

జాతీయం - BJP Manifesto Tamil Nadu | మహిళలకు నెలకు రూ.2 వేలు.. ఉచితంగా మూడు సిలిండర్లు : బీజేపీ హామీ

జాతీయం

BJP Manifesto Tamil Nadu | మహిళలకు నెలకు రూ.2 వేలు.. ఉచితంగా మూడు సిలిండర్లు : బీజేపీ హామీ

తమిళనాడులో బీజేపీ తన ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేసింది. తాము అధికారంలోకి మహిళలకు ప్రతి నెలా రూ.2 వేలు అందిస్తామని హామీ ఇచ్చింది.

Srinivas kolluri
Last updated: ఏప్రిల్ 14, 2026 1:28 సా.
Srinivas Kolluri
2 రోజులు ago
Share
BJP Manifesto Tamil Nadu

అక్షరటుడే, వెబ్​డెస్క్: BJP Manifesto Tamil Nadu | తమిళనాడు శాసనసభ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ తన ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేసింది. పొంగల్, తమిళ నూతన సంవత్సరం, దీపావళి పండుగల సమయంలో మూడు ఉచిత ఎల్.పి.జి (LPG) సిలిండర్లను అందిస్తామని, అలాగే తిరుప్పరంకుండ్రం (Thirupparankundram) కొండ శిఖరంపై సంప్రదాయ దీపాన్ని వెలిగిస్తామని ప్రకటించింది.

Contents
  • BJP Manifesto Tamil Nadu | ఒక్కో కుటుంబానికి రూ.10 వేలు
    • BJP Manifesto Tamil Nadu | 27 హామీలు

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు (Tamil Nadu Assembly elections) కేవలం ఎనిమిది రోజుల సమయం మాత్రమే మిగిలి ఉన్న తరుణంలో, రాష్ట్రానికి సంబంధించిన బీజేపీ ఎన్నికల మేనిఫెస్టో అధికారికంగా విడుదలైంది. బీజేపీ మాజీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా (J.P. Nadda) ఈ మేనిఫెస్టోను ఆవిష్కరించారు. తమిళసై సౌందరరాజన్ (Tamilisai Soundararajan) నేతృత్వంలోని ఒక కమిటీ ఈ పత్రాన్ని రూపొందించే బాధ్యతను చేపట్టింది.

BJP Manifesto Tamil Nadu | ఒక్కో కుటుంబానికి రూ.10 వేలు

ఒక్కో కుటుంబానికి రూ.10 వేల నగదు సహాయం, ద్విచక్ర వాహనాలు కొనుగోలు చేసే మహిళలకు రూ.25 వేల రాయితీ ఇస్తామని బీజేపీ హామీ ఇచ్చింది. తైపూసం పండుగను రాష్ట్ర పండుగగా ప్రకటిస్తామని, తిరుప్పరంకుండ్రం వద్ద సంప్రదాయ దీపాన్ని వెలిగించే ప్రాచీన ఆచారాన్ని పునరుద్ధరిస్తామని ప్రకటించింది. తమిళనాడులోని పది నగరాలను దేశంలోని అగ్రశ్రేణి 100 “చెత్త రహిత నగరాల” జాబితాలో చేర్చుతామని పేర్కొంది.

BJP Manifesto Tamil Nadu | 27 హామీలు

వృద్ధులకు ఇంటింటికీ వెళ్లి వైద్య పరీక్షలు నిర్వహిస్తామని తెలిపింది. బీజేపీ మేనిఫెస్టో (BJP Manifesto)లో మొత్తం 27 హామీలను ఇచ్చింది. కాగా తమిళనాడులో బీజేపీ ఏఐడీఎంకేతో కలిసి పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. ఎలాగైనా అధికారంలోకి రావాలని ఈ కూటమి తీవ్రంగా శ్రమిస్తోంది. ఇప్పటికే ఏఐడీఎంకే మేనిఫెస్టో విడుదల చేయగా.. తాజాగా బీజేపీ సైతం ప్రకటించింది.

ఇది కూడా చదవండి..: Dr BR Ambedkar Jayanti | రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్​.. పేదల జీవితాల్లో వెలుగులు నింపిన ఏడు గొప్ప మార్పులు ఇవే!

IndiGo CEO Resignation | ఇండిగో సీఈవో రాజీనామా
Ayodhya Ram Mandir | అయోధ్యలో అద్భుతం.. బాలరాముడికి సూర్యతిలకం
ISIS Threat Hindus | దక్షిణాసియాలో హిందువులపై దాడులకు ఐసిస్ పిలుపు.. సీఈపీ నివేదికలో సంచలన వివరాలు
Iran India Gas Support | మధ్యప్రాచ్య ఉద్రిక్తతల మధ్య భారత్‌కు ఇరాన్ భరోసా.. హర్మూజ్ జలసంధి దాటిన గ్యాస్ ట్యాంకర్
Modi YouTube Subscribers | సోషల్ మీడియాలో మోదీ హవా.. 3 కోట్లు దాటిన యూట్యూబ్‌ సబ్‌స్క్రైబర్లు
TAGGED:BJP manifestoBJP Manifesto Tamil NaduJ.P. NaddaTamil Nadu Assembly ElectionsTamilisai SoundararajanThirupparankundram
Share This Article
Facebook Whatsapp Whatsapp
Srinivas kolluri
BySrinivas Kolluri
Follow:
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Previous Article Rythu Bharosa Delay  Rythu Bharosa Delay | రైతు భరోసా వచ్చేనా.. రెండో విడతపై స్పష్టత కరువు
Next Article Telangana Public School Telangana Public School | తెలంగాణ పబ్లిక్ స్కూల్​ ఏర్పాటుకు స్థలపరిశీలన
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?