అక్షరటుడే, ఎల్లారెడ్డి: Telangana Public School | నియోజకవర్గ కేంద్రంలో ప్రారంభించనున్న తెలంగాణ పబ్లిక్ స్కూల్ కోసం స్థలాన్ని జిల్లా విద్యాధికారి రాజు మంగళవారం పరిశీలించారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి ప్రారంభమయ్యే తెలంగాణ పబ్లిక్ స్కూల్ తరగతుల నిమిత్తం పాఠశాలను సందర్శించినట్లు ఆయన పేర్కొన్నారు.
Telangana Public School | టీచింగ్ ఫ్రెండ్లీ క్లాస్ రూమ్స్..
తెలంగాణ పబ్లిక్ స్కూల్లో టీచింగ్-ఫ్రెండ్లీ క్లాస్‌రూమ్స్, స్పోర్ట్స్ గ్రౌండ్స్ (Sports Grounds) తరగతి గదులను డీఈవో పరిశీలించారు. విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యాలు లేకుండా అన్ని వసతులు కల్పించి కార్పొరేట్ విద్యను అందించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. స్థానిక విద్యార్థులకు తెలంగాణ (Telangana) పబ్లిక్ స్కూల్స్ సదవకాశంగా భావించాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో మండల విద్యాధికారి రాజులు, ఏఈ, సర్వేయర్, ఆర్ఐ, హెచ్ఎం తదితరులు పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి..: Ambedkar Jayanti Celebrations | రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్‌కు ఘననివాళులు..
