అక్షరటుడే, నిజామాబాద్ అర్బన్: Ambedkar Jayanti Celebrations | ఉమ్మడి జిల్లాలో అంబేడ్కర్ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటాలు, విగ్రహాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
Ambedkar Jayanti Celebrations | జిల్లాకేంద్రంలోని పులాంగ్ వద్ద..
నిజామాబాద్ జిల్లా (Nizamabad District) కేంద్రంలోని పులాంగ్ వద్ద అంబేడ్కర్ విగ్రహానికి ఎమ్మెల్యే ధన్పాల్ (MLA Dhanpal) సూర్యనారాయణ గుప్తా, కలెక్టర్, ఇలా త్రిపాఠి (Collector Ila Tripathi), సీపీ సాయిచైతన్య (CP Sai Chaitanya) తదితరులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. దేశానికి ఆయన చేసిన సేవలను కొనియాడారు. నగర మేయర్ ఉమారాణి, మన్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ దిలీప్‌కుమార్, డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ దుర్గాప్రమీల, డీఎంహెచ్‌వో రాజశ్రీ తదితరులు నివాళులర్పించారు. టీఎన్జీవోస్, ఎంప్లాయీస్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు నాశెట్టి సుమన్ కుమార్, టీఎన్జీవోస్ ప్రతినిధులు పెద్దోళ్ల నాగరాజు తదితరులు అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేశారు. అలాగే జీజీహెచ్ ఇన్‌ఛార్జి సూపరింటెండెంట్ నాగమోహన్, మెడికల్ కళాశాల సూపరింటెండెంట్ పెద్దోళ్ల నాగరాజు తదితరులు రాజ్యాంగ నిర్మాతకు నివాళులర్పించారు. 
Ambedkar Jayanti Celebrations | కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో..
నగరంలోని పులాంగ్ వద్ద కాంగ్రెస్ పార్టీ (Congress Party) ఆధ్వర్యంలో అంబేడ్కర్ విగ్రహానికి ఘనంగా నివాళులర్పించారు. కార్యక్రమంలో జిల్లా డీసీసీ అధ్యక్షుడు నగేష్‌రెడ్డి, కార్పొరేషన్ డీసీసీ అధ్యక్షుడు బొబ్బిలి రామకృష్ణ, నుడా ఛైర్మన్ కేశవేణు, కాంగ్రెస్ సీనియర్ నాయకులు రాంభూపాల్, ఆదె ప్రవీణ్‌కుమార్, శరత్ తదితరులు పాల్గొన్నారు.
Ambedkar Jayanti Celebrations | బీజేపీ ఆధ్వర్యంలో.
జిల్లా బీజేపీ పార్టీ (BJP Party) ఆధ్వర్యంలో రాజ్యాంగ నిర్మాతకు ఘనంగా నివాళులర్పించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా, కార్పొరేటర్లు మఠం పవన్, సీనియర్ బీజేపీ నాయకులు తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు.


ఇది కూడా చదవండి..: Auto Accident in Kamareddy | కామారెడ్డిలో గ్యాస్ సిలిండర్ల ఆటో బీభత్సం..
