Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Revanth Reddy Meeting | కార్యకర్తల ఆత్మగౌరవాన్ని కేసీఆర్ కాళ్ల దగ్గర తాకట్టు పెట్టారు.. జీవన్ రెడ్డిపై రేవంత్​ ఫైర్​!
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

తెలంగాణ - Revanth Reddy Meeting | కార్యకర్తల ఆత్మగౌరవాన్ని కేసీఆర్ కాళ్ల దగ్గర తాకట్టు పెట్టారు.. జీవన్ రెడ్డిపై రేవంత్​ ఫైర్​!

తెలంగాణతాజా వార్తలు

Revanth Reddy Meeting | కార్యకర్తల ఆత్మగౌరవాన్ని కేసీఆర్ కాళ్ల దగ్గర తాకట్టు పెట్టారు.. జీవన్ రెడ్డిపై రేవంత్​ ఫైర్​!

వ్యక్తుల కంటే పార్టీ ముఖ్యమని నిరూపించిన కార్యకర్తలను సీఎం రేవంత్​ అభినందించారు. జగిత్యాల అభివృద్ధి కోసం అందరూ కలిసి పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు.

Naresh chandan
Last updated: ఏప్రిల్ 14, 2026 11:17 సా.
Naresh chandan
2 రోజులు ago
Share
Revanth Reddy Meeting
Revanth Reddy Meeting

అక్షరటుడే, వెబ్​డెస్క్​: Revanth Reddy Meeting | జగిత్యాల కాంగ్రెస్ కార్యకర్తల ఆత్మగౌరవాన్ని కేసీఆర్ కాళ్ల దగ్గర జీవన్ రెడ్డి తాకట్టు పెట్టారని ముఖ్యమంత్రి రేవంత్​ రెడ్డి విమర్శించారు. జగిత్యాల జిల్లాకు చెందిన ముఖ్య కాంగ్రెస్ నాయకులతో ముఖ్యమంత్రి Revanth Reddy సమావేశమయ్యారు. రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిణామాలు, పార్టీ పరిస్థితులపై చర్చించేందుకు ఈ భేటీ నిర్వహించినట్లు తెలిపారు.

Revanth Reddy Meeting | ఏనాడూ తక్కువ చేయలేదు..

ఈ సందర్భంగా Jeevan Reddy పార్టీని వీడిన అంశంపై సీఎం స్పందించారు. తాము ఎనాడూ జీవన్ రెడ్డిని తక్కువ చేసి చూడలేదని పేర్కొన్నారు. ఆయన గౌరవానికి భంగం కలిగేలా ఎనాడూ ప్రవర్తించలేదని స్పష్టం చేశారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన గెలుపు కోసం పార్టీ శ్రేణులు చాలా కష్టపడ్డాయని గుర్తుచేశారు.

పార్లమెంట్ ఎన్నికల సమయంలో జీవన్​రెడ్డిని కరీంనగర్ నుంచి పోటీ చేయాలని సూచించామని.. కానీ, ఆయన అభ్యర్థన మేరకు నిజామాబాద్ నుంచి టికెట్ ఇచ్చినప్పటికీ ఓటమి చెందారని పేర్కొన్నారు. మున్సిపల్ ఎన్నికల్లోనూ జీవన్ రెడ్డి సూచించిన వారికే టికెట్లు ఇచ్చామని గుర్తుచేశారు.

Revanth Reddy Meeting | త్వరలోనే జగిత్యాల పర్యటన..

భవిష్యత్తులో ఆయనతోపాటు తన కుటుంబ సభ్యులకు రాజకీయంగా పూర్తి మద్దతు ఉంటుందని హామీ ఇచ్చినా, జీవన్​రెడ్డి పార్టీని వీడారని సీఎం చెప్పారు. నాలుగు దశాబ్దాల పాటు తనతో పనిచేసిన కార్యకర్తలను నిరాశపరిచారని ఈ సందర్భంగా విమర్శించారు. K. Chandrashekar Raoతో జీవన్​రెడ్డి కలవడం బాధాకరమని సీఎం వ్యాఖ్యానించారు.

ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని కాపాడటం తమ బాధ్యత అని సీఎం రేవంత్ స్పష్టం చేశారు. కార్యకర్తలు ధైర్యంగా ఉండాలని, త్వరలోనే జగిత్యాల పర్యటనకు వస్తానని హామీ ఇచ్చారు. అందరూ కలిసికట్టుగా పనిచేసి కాంగ్రెస్ పార్టీని మళ్లీ అధికారంలోకి తీసుకురావాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.

వ్యక్తుల కంటే పార్టీ ముఖ్యమని నిరూపించిన కార్యకర్తలను ఈ సందర్భంగా ఆయన అభినందించారు. జగిత్యాల అభివృద్ధి కోసం అందరూ కలిసి పనిచేయాలని సీఎం రేవంత్​ పిలుపునిచ్చారు.

Rotten Meat Racket | హైదరాబాద్‌లో కల్తీ మాంసం కలకలం.. 14 వేల కిలోల కుళ్లిన మాంసం స్వాధీనం
Harish Rao Letter | రాజ్యాంగ పరిరక్షణ అంటే ఇదేనా.. రాహుల్​ గాంధీకి హరీశ్​రావు లేఖ
BJP Leader Suicide | బీజేపీ నాయకుడి ఆత్మహత్య
AP Police Special Leaves | ఏపీ పోలీసులకు ప్రత్యేక సెలవులపై సర్కారు కీలక నిర్ణయం
BC Reservation Protest | బీసీలను మోసం చేసిన కాంగ్రెస్​.. బీఆర్​ఎస్​ సభ్యుల నిరసన
TAGGED:Congress leaders meetingcongress party updateIndian Political Newsjagtial congress leadersjeevan reddy issuekcr politics telanganaRevanth Reddy MeetingTelangana political news
Share This Article
Facebook Whatsapp Whatsapp
Naresh chandan
ByNaresh chandan
Follow:
గత 18 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నాను. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టాను. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశాను. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా నా ప్రయాణం మొదలెట్టాను. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నాను. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Previous Article Ambedkar jayanthi | Ambedkar jayanthi | సామాజిక న్యాయ కోసం అంబేడ్కర్​ విశేష కృషి.. బొబ్బిలి రామకృష్ణ
Next Article April 15 Horoscope April 15 Horoscope | ఆర్థిక ఇబ్బందులకు ఇక చెల్లు.. ఈ రాశుల వారి లక్ మారిపోయినట్లే!
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?