అక్షరటుడే,నిజామాబాద్సిటీ: Ambedkar jayanthi | సామాజిక న్యాయ కోసం(social justice) అంబేడ్కర్(ambedkar) విశేష కృషి చేశారని బొబ్బిలి రామకృష్ణ(Bobbili Ramakrishna) అన్నారు. నగర కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో భారత రాజ్యాంగ శిల్పి, భారతరత్న అంబేద్కర్ జయంతిని జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు.
Ambedkar jayanthi | అంబేడ్కర్ సేవలను స్మరించుకుంటూ..
ఈ సందర్భంగా బొబ్బిలి రామకృష్ణ మాట్లాడుతూ అంబేడ్కర్ సేవలను స్మరించుకున్నారు. దేశంలో అణగారిన వర్గాలకు సమాన హక్కులు కల్పించేందుకు, సామాజిక న్యాయం స్థాపనకు ఆయన చేసిన కృషి అపూర్వమని వారు పేర్కొన్నారు. రాజ్యాంగ రూపకర్తగా ఆయన చూపిన దూరదృష్టి భారతదేశ ప్రజాస్వామ్యానికి బలమైన పునాది వేసిందని కొనియాడారు. ప్రస్తుత సమాజంలో అంబేడ్కర్ ఆశయాల ప్రాముఖ్యత మరింత పెరిగిందని, ముఖ్యంగా యువత ఆయన సిద్ధాంతాలను ఆచరణలో పెట్టాలని పిలుపునిచ్చారు.
Ambedkar jayanthi | విద్య.. క్రమశిక్షణ.. కృషి..
విద్య, క్రమశిక్షణ, కృషి అనే మూడు మూల సూత్రాలను అనుసరించి యువత దేశాభివృద్ధికి తమ వంతు పాత్ర పోషించాలని సూచించారు. సమానత్వం, సౌహార్దం, మానవత్వం వంటి విలువలు సమాజ నిర్మాణానికి అవసరమని వివరించారు. యువత ఆయన చూపిన మార్గంలో నడవాలని సూచించారు. అనంతరం పులాంగ్ వద్ద అబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం పోచమ్మగల్లి మాల సంఘంలో, వెల్మల్ గ్రామానికి సంబంధించిన అన్నివర్గాలకు చెందిన పలువురితో సహపంక్తి భోజనాల కార్యక్రమంలో పాల్గొని భోజనం స్వీకరించారు. ఈ సందర్భంగా పిల్లలకు ఆటపాటలు నిర్వహించారు. గెలుపొందిన వాళ్లకు బహుమతులు అందించారు. ఈ కార్యక్రమంలో తాహెర్ బిన్ హందాన్, మేయర్ ఉమారాణి, నుడా ఛైర్మన్ కేశవేణు, రాంభూపాల్, అంతరెడ్డి రాజారెడ్డి, డాక్టర్ వితారెడ్డి, రత్నాకర్, లింగం, రాజాగౌడ్, గన్ రాజ్, జావేద్ అక్రమ్,యాదగిరి తదితరులు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి: Hyderabad Police Transfers | హైదరాబాద్ సిటీ పోలీస్ శాఖలో భారీగా ఇన్‌స్పెక్టర్ల బదిలీలు
