అక్షరటుడే, వెబ్‌డెస్క్: Annamalai Criticizes Stalin | తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికల (Tamil Nadu Assembly elections) ప్రచారం రసవత్తరంగా సాగుతోంది. ఎన్నికలు సమీపిస్తుండటంతో ఎలాగైన గెలవాలని అధికార డీఎంకే, ప్రతిపక్ష ఏఐడీఎంకేలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. ఈ క్రమంలో బీజేపీ మాజీ అధ్యక్షుడు అన్నామలై బుధవారం కోయంబత్తూరులో ప్రచారం నిర్వహించారు.
తమిళనాడులో ఏఐడీఎంకే (AIADMK), బీజేపీ కలిసి పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. అన్నామలై మాట్లాడుతూ.. కోయంబత్తూరులో, తమిళనాడు అంతటా ఈసారి NDA భారీ మెజారిటీతో అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. తమిళనాడు ప్రజలు మార్పు కోరుకుంటున్నారని చెప్పారు. DMK ప్రభుత్వం నుంచి వైదొలగాలని వారు ఆశిస్తున్నారని పేర్కొన్నారు. తాము ప్రచారం చేస్తున్న అన్ని చోట్ల ప్రజల స్పందన అద్భుతంగా ఉందన్నారు. ఈసారి పళనిస్వామి అత్యంత భారీ మెజారిటీతో తమిళనాడు ముఖ్యమంత్రి అవుతారని ధీమా వ్యక్తం చేశారు.
Annamalai Criticizes Stalin | కళ్ల ముందు ఓటమి
మహిళా రిజర్వేషన్ బిల్లు విషయంలో సీఎం స్టాలిన్ (CM Stalin) వ్యాఖ్యలపై అన్నామలై స్పందించారు. ముఖ్యమంత్రి ఎప్పటిలాగే, ప్రతి చిన్న విషయంపైనా, ప్రతి అంశంపైనా రాజకీయాలు చేయాలని చూస్తున్నారని విమర్శించారు. తమిళనాడులోని మహిళలు 33 శాతం రిజర్వేషన్ (Women’s Reservation Bill)ను వీలైనంత త్వరగా అమలు చేయాలని కోరుకుంటున్నారని చెప్పారు. స్టాలిన్‌కు ఓటమి కళ్ల ముందు కనిపిస్తోందని, అందుకే ఈ అంశాన్ని రాజకీయాలకు వాడుకుంటున్నారని ఆరోపించారు.
కాగా కేంద్ర ప్రభుత్వం (Central Government) మహిళా రిజర్వేషన్ బిల్లు, నియోజకవర్గాల పునర్విభజన బిల్లులను రేపు పార్లమెంట్లో ప్రవేశపెట్టనుంది. అయితే డీలిమిటేషన్‌తో తమకు అన్యాయం జరుగుతుందని దక్షిణాది రాష్ట్రాలు భావిస్తున్నాయి. ఈ క్రమంలో తమిళనాడు సీఎం సైతం డీలిమిటేషన్‌ను వ్యతిరేకించారు. బుధవారం ఆయన ఈ అంశంపై పార్టీ ముఖ్య నేతలతో జూమ్ మీటింగ్‌లో చర్చించారు. పార్లమెంట్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు.
ఇది కూడా చదవండి..: Samrat Choudhary CM | బీహార్ సీఎంగా సమ్రాట్ చౌదరి ప్రమాణం
