అక్షరటుడే, వెబ్‌డెస్క్: Samrat Choudhary CM | బీహార్ ముఖ్యమంత్రిగా బీజేపీ నేత సమ్రాట్ చౌదరి బుధవారం ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్రంలో అత్యున్నత పదవిని చేపట్టిన భారతీయ జనతా పార్టీ (Bharatiya Janata Party)కి చెందిన తొలి నాయకుడిగా ఆయన నిలిచారు.
బీహార్ సీఎంగా సుదీర్ఘ కాలం పని చేసిన నితీశ్‌కుమార్ (Nitish Kumar) ఇటీవల రాజ్యసభకు ఎన్నికైన విషయం తెలిసిందే. దీంతో మంగళవారం ఆయన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. దీంతో ఆ పదవి బీజేపీ నేత సమ్రాట్ చౌదరికి దక్కింది. చౌదరి మంగళవారం బీజేపీ శాసనసభ పక్ష నాయకుడిగా ఎన్నికయ్యారు, దీంతో ఆయన నియామకానికి మార్గం సుగమమైంది. బుధవారం ఉదయం ఆయన చేత గవర్నర్ సయ్యద్ అతా హస్నైన్ ప్రమాణ స్వీకారం చేయించారు. ఆయనతో పాటు బిజేంద్ర ప్రసాద్ యాదవ్, విజయ్ కుమార్ చౌదరి ఉప ముఖ్యమంత్రులుగా ప్రమాణం చేశారు.
Samrat Choudhary CM | కీలక నేత..
సమ్రాట్ చౌదరి ఎన్డీఏ ప్రభుత్వం (NDA Government)లో కీలకంగా వ్యవహరించారు. గతంలో హోం శాఖను కూడా నిర్వహించారు. ఆయన తరచుగా ప్రధాన రాజకీయ, అధికారిక కార్యక్రమాలలో నితీష్ కుమార్‌తో పాటు బీజేపీకి ప్రాతినిధ్యం వహించారు. రాజకీయ కుటుంబంలో జన్మించిన ఆయన, సీనియర్ నాయకుడు శకునీ చౌదరి కుమారుడు. మొదట ఆర్జేడీలో పని చేసిన ఆయన 2017లో బీజేపీ (BJP)లో చేరారు. అనంతరం అంచెలంచలుగా ఎదుగుతూ.. తాజాగా సీఎం అయ్యారు. 2023లో బీహార్ బీజేపీ అధ్యక్షుడిగా నియమితులయ్యారు. 2025 అసెంబ్లీ ఎన్నికల్లో (Assembly elections) విజయం తర్వాత ఉపముఖ్యమంత్రిగా పని చేశారు.
ఇది కూడా చదవండి..: Amravati Incident | మహారాష్ట్ర అమరావతిలో సంచలనం.. బాలికలపై దారుణాలు, వందలాది వీడియోలు..
