Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Amravati Incident | మహారాష్ట్ర అమరావతిలో సంచలనం.. బాలికలపై దారుణాలు, వందలాది వీడియోలు..
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

జాతీయం - Amravati Incident | మహారాష్ట్ర అమరావతిలో సంచలనం.. బాలికలపై దారుణాలు, వందలాది వీడియోలు..

జాతీయంక్రైం

Amravati Incident | మహారాష్ట్ర అమరావతిలో సంచలనం.. బాలికలపై దారుణాలు, వందలాది వీడియోలు..

మహారాష్ట్రలోని అమరావతిలో బాలికలపై లైంగిక దాడి చేసిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు.

Sandeep kumar Balla_Author
Last updated: ఏప్రిల్ 15, 2026 10:44 ఉద.
Sandeep Kumar Balla
Sandeep kumar Balla_Author
BySandeep Kumar Balla
Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే...
Follow:
1 రోజు ago
Share
Amravati Incident

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Amravati Incident | మహారాష్ట్ర (Maharashtra)లోని అమరావతిలో అత్యంత దారుణమైన ఘటన వెలుగులోకి వచ్చింది. బాలికలను లక్ష్యంగా చేసుకుని లైంగిక దాడులు, అశ్లీల వీడియోలు చిత్రీకరణ, బ్లాక్‌మెయిల్ వంటి తీవ్రమైన ఆరోపణలతో ఒక వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు.

Contents
  • Amravati Incident | వందలాది వీడియోలు ..
    • Amravati Incident | ప్రత్యేక దర్యాప్తు బృందం ఏర్పాటు

ఈ కేసు రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. పోలీసుల వివరాల ప్రకారం, పరాత్‌వాడ (Paratwada)కు చెందిన మహమ్మద్ అయాజ్ అలియాస్ తన్వీర్ అనే వ్యక్తి ఈ దారుణాలకు పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి. సోషల్ మీడియా (Social Media) వేదికలు అయిన వాట్సాప్, స్నాప్‌చాట్ ద్వారా మైనర్ బాలికలను లక్ష్యంగా చేసుకుని, ప్రేమ పేరుతో వారిని తన వలలోకి దింపేవాడని విచారణలో తేలింది.

Amravati Incident | వందలాది వీడియోలు ..

ఆ తరువాత వారిని నమ్మించి ముంబై, పుణే  వంటి నగరాలకు తీసుకెళ్లి అభ్యంతరకర వీడియోలు చిత్రీకరించినట్లు తెలుస్తోంది. ఆ వీడియోలను అడ్డుపెట్టుకుని బాధితులను బ్లాక్‌మెయిల్ చేస్తూ, మరింతగా వేధింపులకు గురి చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు. ఈ కేసులో సుమారు 180 మందికి పైగా బాలికలు బాధితులుగా ఉన్నట్లు ప్రాథమిక సమాచారం. అలాగే 350కి పైగా అభ్యంతరకర వీడియోలు చిత్రీకరించినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ వీడియోలను ఆన్‌లైన్‌లో షేర్ చేసారేమో అనే అనుమానంతో సైబర్ విభాగం (Cyber ​​Division) దర్యాప్తు ప్రారంభించింది. నిందితుడి మొబైల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకున్న పోలీసులు, అందులో అనేక వీడియోలు, డేటాను గుర్తించారు. ఈ వీడియోలను ఇతరులకు పంపించాడా? లేక ఏదైనా ముఠాతో సంబంధం ఉందా? అనే కోణాల్లో విచారణ కొనసాగుతోంది.

Amravati Incident | ప్రత్యేక దర్యాప్తు బృందం ఏర్పాటు

ఈ ఘటనపై బీజేపీ రాజ్యసభ సభ్యుడు అనిల్ బోండే స్పందిస్తూ, పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎస్పీ విశాల్ ఆనంద్‌ (SP Vishal Anand)కు మెమోరాండం సమర్పించి, కేసును తీవ్రంగా విచారించాలని డిమాండ్ చేశారు. ప్రత్యేక దర్యాప్తు బృందం ఏర్పాటు చేయాలని కూడా ఆయన కోరారు. ఈ ఘటనపై స్థానికంగా తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. ముస్లిం సమాజానికి చెందిన కొందరు కూడా పోలీస్ స్టేషన్‌కు వెళ్లి, నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇలాంటి ఘటనలు సమాజానికి చెడ్డపేరు తీసుకువస్తాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు. నిందితుడు గతంలో ఆల్ ఇండియా మజ్లిస్-ఎ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్​కు అనుబంధంగా పనిచేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. సోషల్ మీడియాలో  పార్టీ నాయకులతో ఉన్న ఫొటోలు, వీడియోలు కూడా బయటకు రావడం చర్చనీయాంశంగా మారింది. అయితే, ఈ కేసు బయటకు వచ్చిన తరువాత అతని సోషల్ మీడియా ఖాతాల్లోని పలు వీడియోలు తొలగించనట్లు తెలుస్తోంది.

నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు కోర్టులో హాజరుపరచగా, న్యాయస్థానం అతనికి ఏడు రోజుల పోలీస్ కస్టడీ విధించింది. కేసు తీవ్రతను దృష్టిలో ఉంచుకుని పోలీసులు అన్ని కోణాల్లో విచారణ చేపట్టారు.

ఇది కూడా చదవండి..: India Forex Reserves | పెరిగిన ఫారెక్స్ నిల్వలు

SIM Binding Implementation | నేటి నుంచి సిమ్​ బైండింగ్​.. మొబైల్​ వినియోగంలో కఠిన నిబంధన!
Assam BJP Manifesto | ప్రతి కుటుంబానికి ఇల్లు.. మహిళలకు నెలకు రూ.3వేలు.. బీజేపీ మేనిఫెస్టో విడుదల
India Post GDS Results | పోస్టల్​ జాబ్స్​ ఫలితాలు విడుదల
Commercial LPG Price Hike | చమురు ధరల దెబ్బ: కమర్షియల్ LPG సిలిండర్‌పై భారీ పెంపు.. రూ. 2,000 దాటిన ధరలు
Trisha Marriage Rumors | రిటైర్మెంట్, పెళ్లి రూమర్స్‌కు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన త్రిష‌.. ఇది చాలా, ఇంకా కావాలా?
TAGGED:Amravati caseAmravati Incidentchild exploitation Indiacrime newscyber crime indiaCyber ​​DivisionMaharashtraMaharashtra crime newsminor abuse caseParatwadaPolice investigationSocial Mediasocial media crimeSP Vishal Anand
Share This Article
Facebook Whatsapp Whatsapp
Sandeep kumar Balla_Author
BySandeep Kumar Balla
Follow:
Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే తెలంగాణ దినపత్రికలో 2011లో చేరి రెండు సంవత్సరాల పాటు పనిచేశాను. ఆ తర్వాత ‘సాక్షి’ దినపత్రికలో 2013 నుంచి 2024 జూలై వరకు సీనియర్​ సబ్​ ఎడిటర్​గా వర్క్​ చేశాను. 2024 ఆగస్టు నుంచి ‘అక్షరటుడే’లో అసోసియేట్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, లోకల్​, నేషనల్​, ఇంటర్నేషనల్​, క్రైం, లైఫ్​స్టైల్​, సినిమా ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Previous Article India Forex Reserves India Forex Reserves | పెరిగిన ఫారెక్స్ నిల్వలు
Next Article Rohingya Boat Tragedy Rohingya Boat Tragedy | అండమాన్‌ వద్ద పడవ బోల్తా.. 250 మంది గల్లంతు
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?