అక్షరటుడే, వెబ్డెస్క్: India Forex Reserves | ఇటీవలి కాలంలో తగ్గముఖం పట్టిన విదేశీ మారక(ఫారెక్స్) నిల్వలు మళ్లీ పెరుగుతున్నాయి. ఏప్రిల్ 3తో ముగిసిన వారంలో 9.063 బిలియన్ డాలర్లు పెరిగి 697.121 బిలియన్ డాలర్లకు చేరాయి. మార్చి 27న ఇవి 10.288 బిలియన్ డాలర్లు క్షీణించి 688.058 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి.
ఫిబ్రవరి 27తో ముగిసిన వారంలో మన ఫారెక్స్ నిల్వలు 728.494 డాలర్ల వద్ద జీవనకాల గరిష్టస్థాయికి చేరుకున్నాయి. అయితే పశ్చిమాసియాలో యుద్ధం మొదలైన తర్వాత క్రూడ్ ఆయిల్ (Crude Oil) ధరలు భారీగా పెరగడం, ఎఫ్ఐఐల పెట్టుబడుల ఉపసంహరణ వేగం పెరగడంతో రూపాయి మారకపు విలువపై తీవ్ర ఒత్తిడి ఏర్పడడంతో రిజర్వ్స్ తగ్గుతూ వచ్చాయి.
India Forex Reserves | పసిడి నిల్వలదీ అదే దారి..
ఏప్రిల్ 3తో ముగిసిన వారంలో విదేశీ మారకపు నిల్వలు 9.063 బిలియన్ డాలర్లు పెరగ్గా.. ఇందులో విదేశీ కరెన్సీ ఆస్తులు 1.784 బిలియన్ డాలర్లు పెరిగి 552.856 బిలియన్ డాలర్లకు చేరాయి. పసిడి నిల్వలూ గణనీయంగా పెరగడం గమనార్హం. బంగారం నిల్వల విలువ 7.221 బిలియన్ డాలర్లు పెరిగి 120.742 బిలియన్ డాలర్లకు చేరుకుంది. ఈ నిల్వలు 11 నెలలపాటు దిగుమతులకు సరిపోతాయని భావిస్తున్నారు.
India Forex Reserves | ఐదో స్థానంలో భారత్..
విదేశీ మారక నిల్వలలో విదేశీ కరెన్సీలు, పసిడి, ప్రభుత్వ సెక్యూరిటీలు ఉంటాయి. వీటిని ఆర్‌బీఐ (RBI) నిర్వహిస్తుంది. అత్యధిక ఫారెక్స్ నిల్వలున్న దేశాలలో భారత్ ఐదో స్థానంలో ఉంది. సుమారు 3.5 ట్రిలియన్ డాలర్ల విలువైన ఫారెక్స్ నిల్వలతో చైనా అగ్రస్థానంలో ఉంది. సుమారు 1.25 ట్రిలియన్ డాలర్ల నిల్వలతో రెండో స్థానంలో జపాన్, ఒక ట్రిలియన్ డాలర్లతో మూడో స్థానంలో స్విట్జర్లాండ్, 700ల బిలియన్ డాలర్లకుపైగా నిల్వలతో నాలుగో స్థానంలో రష్యా ఉన్నాయి.
ఇది కూడా చదవండి..: Chhattisgarh Boiler Blast | పవర్ ప్లాంట్లో పేలిన బాయిలర్.. 10 మంది మృతి
