అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Rohingya Boat Tragedy | అండమాన్ సమీపంలో సముద్రంలో ఒక పడవ బోల్తా పడటంతో సుమారు 250 మంది రోహింగ్యా శరణార్థులు, బంగ్లాదేశ్ జాతీయులు గల్లంతయ్యారు.
పురుషులు, మహిళలు, పిల్లలతో నిండిన ఆ ట్రాలర్ (చేపల పడవ) బలమైన గాలుల కారణంగా మునిగిపోయిందని ఐక్యరాజ్యసమితి శరణార్థుల హై కమిషనర్ తెలిపింది. గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.
ఆ పడవ దక్షిణ బంగ్లాదేశ్ (Bangladesh)లోని టెక్నాఫ్ నుంచి బయలుదేరి మలేషియాకు బయలుదేరింది. మయన్మార్ సైన్యం 2017లో చేపట్టిన ఆపరేషన్‌తో లక్షలాది మంది రోహింగ్యాలు బంగ్లాదేశ్‌లోని శరణార్థి శిబిరాలలో ఆశ్రయం పొందారు. అనేక మంది భారత్‌కు సైతం అక్రమంగా వచ్చారు. ఈ క్రమంలో ప్రతి సంవత్సరం వేలాది మంది రోహింగ్యాలు మయన్మార్ (Myanmar)లోని అణచివేత, అంతర్యుద్ధం బంగ్లాదేశ్‌లోని కిక్కిరిసిన శిబిరాల నుండి తప్పించుకోవడానికి తమ ప్రాణాలను పణంగా పెడుతున్నారు. మెరుగైన జీవితం కోసం పొరుగు దేశాలకు చేరుకోవడానికి వారు తరచుగా పడవల్లో సముద్రయానం చేస్తున్నారు.
Rohingya Boat Tragedy | తరచూ ప్రమాదాలు
అక్రమ మార్గాల్లో రోహింగ్యాలు ఇతర దేశాలకు వలస వెళ్లేందుకు యత్నిస్తున్నారు. ఈ క్రమంలో అనేక పడవలు ప్రమాదానికి గురి అవుతున్నాయి. ఏప్రిల్ 9న బోల్తా పడిన ట్రాలర్ నుండి ఒక మహిళతో సహా తొమ్మిది మందిని రక్షించినట్లు బంగ్లాదేశ్ కోస్ట్‌గార్డ్ తెలిపింది. కాగా ప్రమాదం నుంచి బయట పడిన రఫీకుల్ ఇస్లాం మాట్లాడుతూ.. మలేషియా (Malaysia)లో ఉద్యోగం ఇప్పిస్తామని అక్రమ రవాణాదారులు ఆశ చూపి తనను పడవలోకి రప్పించారని తెలిపారు. ఆ నౌక మునిగిపోవడానికి ముందు నాలుగు రోజుల పాటు ప్రయాణించిందని చెప్పారు. తమను రక్షించే వరకు దాదాపు 36 గంటల పాటు సముద్రంలో తేలుతూ ఉన్నామన్నారు.
ఇది కూడా చదవండి..: Trump Modi Call | మోదీకి ఫోన్ చేసిన ట్రంప్.. హర్ముజ్ జలసంధిపై చర్చ
