అక్షరటుడే, వెబ్‌డెస్క్: Modi Karnataka Visit | అమ్మ పేరుతో మొక్క నాటాలని, నీటిని సంరక్షించాలని ప్రధాని మోదీ కోరారు. ఆయన బుధవారం కర్ణాటకలో పర్యటించారు. సీఎం సిద్ధరామయ్య (CM Siddaramaiah) ప్రధానికి స్వాగతం పలికారు.
కర్ణాటకలోని మాండ్య జిల్లా (Mandya District)లోని ఆదిచుంచనగిరిలో శ్రీ గురు భైరవైక్య మందిరాన్ని ప్రధానమంత్రి ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడారు. ప్రజలు స్వదేశీ ఉత్పత్తులు వాడాలని సూచించారు. ప్రకృతి వ్యవసాయం చేయాలని, పరిశుభ్రత పాటించాలని, స్థానిక పర్యటక ప్రాంతాలను ప్రోత్సహించాలని కోరారు. మన సమాజంలో కేవలం ఆధ్యాత్మిక మార్గదర్శకత్వానికే పరిమితం కాని మహనీయులు ఆవిర్భవిస్తూనే ఉన్నారని పేర్కొన్నారు. వారు సమాజాన్ని దుఃఖం, బాధలు, ఇబ్బందుల నుంచి బయటపడేసే మార్గాన్ని చూపించారన్నారు.
Modi Karnataka Visit | ఆనందంగా ఉంది
కాల భైరవ ఆలయం (Kala Bhairava Temple)లో దర్శనం, పూజలో పాల్గొనడం, శ్రీ గురు భైరవైక్య మందిరపు బ్రహ్మాండమైన ప్రారంభోత్సవానికి హాజరుకావడం ఆనందంగా ఉందన్నారు. చారిత్రాత్మక జ్వాలా పీఠం వద్ద సమయం గడపడం, ఆధ్యాత్మిక శిఖరాలను అధిరోహించిన సాధువుల సాంగత్యాన్ని పొందడం ఈ అనుభవాలన్నీ శాశ్వతంగా నిలిచిపోతాయని పేర్కొనారు. మీ అందరి మధ్యకు వచ్చే అవకాశం లభించడం అదృష్టంగా భావిస్తున్నానని చెప్పారు.
Modi Karnataka Visit | నిరంతర సంస్కృతి
ఆదిచుంచనగిరి మహాసంస్థాన మఠం శతాబ్దాలుగా కొనసాగుతున్న నిరంతర సాంస్కృతిక, ఆధ్యాత్మిక సంప్రదాయానికి ప్రతీక అని మోదీ (PM Modi) అన్నారు. ఇటువంటి సంస్థలు భారతదేశపు శాశ్వత వారసత్వానికి, సామాజిక మార్గదర్శకత్వానికి సజీవ నిదర్శనాలుగా నిలుస్తాయని కొనియాడారు. ప్రభుత్వం ప్రారంభించిన ప్రధాన సంక్షేమ కార్యక్రమాల గురించి మాట్లాడారు.
ఇది కూడా చదవండి..: Annamalai Criticizes Stalin | సీఎం స్టాలిన్‌కు ఓటమి భయం.. అన్నామలై సంచలన వ్యాఖ్యలు
