అక్షరటుడే, గాంధారి: Gram Secretary Complaint | కార్యదర్శి విధుల పట్ల గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు తమకు ఈ సెక్రెటరీ వద్దంటూ ఎంపీడీవోకు వినతిపత్రం అందజేశారు.
Gram Secretary Complaint | గాంధారి మండలంలోని తిమ్మాపూర్‌లో..
గాంధారి మండలంలోని (Gandhari Mandal) తిమ్మాపూర్ గ్రామపంచాయతీకి చెందిన సెక్రెటరీ విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని గ్రామస్థులు ఆరోపించారు. ఏదైనా సమస్య విషయమై ఆయనను సంప్రదిస్తే దుర్భాషలాడతున్నాడని వారు పేర్కొన్నారు. ఈ మేరకు ఎంపీడీవో రాజేశ్వర్‌కు బుధవారం వినతిపత్రం అందించారు. అనంతరం గ్రామస్థులు మాట్లాడుతూ గ్రామంలో మురికి కాల్వల, బోర్లు ఎన్ని ఉన్నాయో కూడా సెక్రెటరీకి తెలియదని గ్రామస్థులు ఆరోపించారు.
Gram Secretary Complaint | కలెక్టర్‌కు అయినా చెప్పుకోండి..
సమస్యలు పరిష్కరించాలని కార్యదర్శిని సంప్రదిస్తే మీరు ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోండని.. కలెక్టర్‌కు చెప్పినా పర్వాలేదని నాకేం భయం లేదని అంటున్నాడని గ్రామస్థులు పేర్కొన్నారు. గ్రామంలో వృద్ధులకు పింఛన్ సకాలంలో అందజేయడంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని.. తాగునీటి సమస్యపై పట్టించుకున్న దాఖలాలు లేవన్నారు. కార్యక్రమంలో తిమ్మాపూర్ (Thimmapur) గ్రామస్థులు ఎంపీడీవో కార్యాలయానికి తరలివచ్చారు. కార్యక్రమంలో సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డ్ మెంబర్లు, గ్రామస్థులు పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి..: Road Safety Human Chain | ‘అరైవ్ అలైవ్’లో భాగంగా రోడ్డుపై విద్యార్థుల మానవహారం..
