Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Delimitation Bill | రాజ్యాంగ సవరణ బిల్లు ప్రవేశపెట్టడంపై ఓటింగ్​
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

జాతీయం - Delimitation Bill | రాజ్యాంగ సవరణ బిల్లు ప్రవేశపెట్టడంపై ఓటింగ్​

జాతీయం

Delimitation Bill | రాజ్యాంగ సవరణ బిల్లు ప్రవేశపెట్టడంపై ఓటింగ్​

పార్లమెంట్‌ ప్రత్యేక సమావేశాలు వాడివేడిగా కొనసాగుతున్నాయి. 131వ రాజ్యాంగ సవరణ బిల్లుపై విపక్షాలు అభ్యంతరం తెలిపాయి.

Sandeep kumar Balla_Author
Last updated: ఏప్రిల్ 16, 2026 12:16 సా.
Sandeep Kumar Balla
Sandeep kumar Balla_Author
BySandeep Kumar Balla
Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే...
Follow:
2 గంటలు ago
Share
Delimitation Bill

అక్షరటుడే, వెబ్​డెస్క్: Delimitation Bill | పార్లమెంట్‌ ప్రత్యేక సమావేశాలు (Parliament Special Sessions) వాడివేడిగా కొనసాగుతున్నాయి. 3 కీలక బిల్లులు కేంద్ర ప్రభుత్వం సభలో ప్రవేశ పెట్టింది. 131వ రాజ్యాంగ సవరణ బిల్లు ప్రవేశ పెట్టడంపై లోక్​సభలో ఓటింగ్ జరిగింది. 207 మంది సభ్యులు అనుకూలంగా ఓటు వేశారు.

Contents
  • Delimitation Bill| రాజ్యాంగాన్ని హైజాక్​ చేస్తున్న కేంద్రం
    • Delimitation Bill | జన గణన ప్రారంభమైంది
      • బిల్లు ప్రవేశపెట్టడంపై ఓటింగ్​

డీలిమిటేషన్​కు సంబంధించిన 131 రాజ్యాంగ సవరణ బిల్లుపై విపక్షాలు అభ్యంతరం తెలిపాయి. సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ ధర్మేంద్ర యాదవ్ (MP Dharmendra Yadav) మాట్లాడుతూ.. రాజ్యాంగ (131వ సవరణ) బిల్లు, కేంద్ర పాలిత ప్రాంతాల చట్టాల (సవరణ) బిల్లు, డీలిమిటేషన్ బిల్లు 2026లను వ్యతిరేకిస్తున్నామని తెలిపారు. మహిళా రిజర్వేషన్లకు తమ కంటే గొప్ప మద్దతునిచ్చే పార్టీ మరొకటి లేదన్నారు.

Delimitation Bill| రాజ్యాంగాన్ని హైజాక్​ చేస్తున్న కేంద్రం

రాజ్యాంగాన్ని కేంద్ర ప్రభుత్వం హైజాక్‌ చేస్తోందని కాంగ్రెస్​ ఎంపీ కేసీ వేణుగోపాల్​ (Congress MP KC Venugopal) అన్నారు. ఈ బిల్లుకు అసలు కారణాలు వేరే ఉన్నాయని ఆరోపించారు. 33 శాతం మహిళా రిజర్వేషన్లు 2024లో ఎందుకు అమలు చేయలేదని ప్రశ్నించారు. లోక్‌సభలో ప్రతిపక్ష సభ్యులు, ‘రాజ్యాంగ (131వ సవరణ) బిల్లు, 2026’ను ప్రవేశపెట్టే ప్రతిపాదనపై ఓటింగ్ జరపాలని పట్టుబట్టారు. DMK ఎంపీ టి.ఆర్. బాలు, AIMIM ఎంపీ ఒవైసీ, టీఎంసీ, CPI-M పార్టీలు ఈ బిల్లులను వ్యతిరేకించాయి.

Delimitation Bill | జన గణన ప్రారంభమైంది

జనాభా గణన ఎందుకు నిర్వహించడం లేదని అఖిలేష్ యాదవ్ ప్రశ్నించారు. దీనిపై అమిత్​ షా (Amit Shah) స్పందిస్తూ.. జనాభా గణన ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైందని చెప్పారు. ముస్లిం మహిళలకు రిజర్వేషన్లు కల్పించడం గురించి ధర్మేంద్ర యాదవ్ ప్రస్తావించారని, ఇది రాజ్యాంగ విరుద్ధమన్నారు. మతం ఆధారంగా రిజర్వేషన్లు కల్పించడం కుదరదరని స్పష్టం చేశారు. సమాజ్​వాది పార్టీ కావాలంటే అన్ని సీట్లను ముస్లింలకు ఇవ్వొచ్చన్నారు. దానికి ఎవరు అడ్డు చెప్పరని సెటైర్లు వేశారు.

బిల్లు ప్రవేశపెట్టడంపై ఓటింగ్​

131 రాజ్యాంగ సవరణ బిల్లు ప్రవేశపెట్టడంపై లోక్‌సభలో ఓటింగ్ జరిగింది. బిల్లు ప్రవేశపెట్టడానికి అనుకూలంగా 207 మంది లోక్‌సభ సభ్యులు ఓటు వేశారు. 126 మంది సభ్యులు దీనికి వ్యతిరేకంగా ఓటు వేశారు. మొత్తం 333 మంది ఎంపీలు ఓటు వేశారు. ఈ బిల్లును ప్రవేశపెట్టే చర్యకు వ్యతిరేకంగా లోక్‌సభలోని ప్రతిపక్ష సభ్యులు ఓట్ల విభజన (division) జరపాలని పట్టుబట్టారు. దీంతో స్పీకర్​ ఓటింగ్​ నిర్వహించారు.

ఇది కూడా చదవండి..: Parliament Special Sessions | ప్రారంభమైన పార్లమెంట్​ ప్రత్యేక సమావేశాలు

Modi Karnataka Visit | అమ్మ పేరుతో మొక్కలు నాటండి : ప్రధాని మోదీ
Narhari Zirwal Video | ట్రాన్స్​జెండర్​తో మంత్రి రాసలీలలు.. వీడియో వైరల్!
IndiGo CEO William Walsh | ఇండిగో సీఈవోగా విలియమ్ వాల్ష్
Dhar Murder Case | నల్లగా ఉన్నాడని భర్తను చంపించిన భార్య
Maharashtra accident | వ్యాన్​ను ఢీకొన్న సిమెంట్​ మిక్సర్​ ట్రక్కు​.. 12 మంది మృతి
TAGGED:Amit Shah remarksconstitutional amendment 131 billdelimitation billIndian Political NewsLok Sabha controversyopposition parties protestparliament debate Indiawomen reservation issue
Share This Article
Facebook Whatsapp Whatsapp
Sandeep kumar Balla_Author
BySandeep Kumar Balla
Follow:
Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే తెలంగాణ దినపత్రికలో 2011లో చేరి రెండు సంవత్సరాల పాటు పనిచేశాను. ఆ తర్వాత ‘సాక్షి’ దినపత్రికలో 2013 నుంచి 2024 జూలై వరకు సీనియర్​ సబ్​ ఎడిటర్​గా వర్క్​ చేశాను. 2024 ఆగస్టు నుంచి ‘అక్షరటుడే’లో అసోసియేట్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, లోకల్​, నేషనల్​, ఇంటర్నేషనల్​, క్రైం, లైఫ్​స్టైల్​, సినిమా ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Previous Article Parliament Special Sessions Parliament Special Sessions | ప్రారంభమైన పార్లమెంట్​ ప్రత్యేక సమావేశాలు
Next Article India Solar Power Growth India Solar Power Growth | సౌర‘శక్తి’ సామ్రాజ్యంలో నంబర్ 2గా భారత్
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?