అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Maharashtra accident | మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ప్రయాణికులతో వెళ్తున్న వ్యాన్‌ను సిమెంట్ మిక్సర్ ట్రక్కు ఢీకొంది. ఈ ఘటనలో 12 మంది అక్కడికక్కడే మృతి చెందారు.
మహారాష్ట్రలోని థానే (Thane) జిల్లాలో సోమవారం ఒక వంతెనపై వ్యాన్, ఒక ట్రాన్సిట్ మిక్సర్ ట్రక్కును ఎదురెదురుగా ఢీకొన్న ఘటనలో ముగ్గురు మహిళలతో సహా మొత్తం 12 మంది మరణించారు. కళ్యాణ్-ముర్బాద్-మల్షేజ్ హైవేపై రైట్ గ్రామం సమీపంలో ఉల్హాస్ నదిపై కొత్తగా నిర్మించిన వంతెనపై ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానికులకు షటిల్ ట్యాక్సీ సేవలు అందించే వ్యాన్, కళ్యాణ్ (Kalyan) నుంచి ముర్బాద్ వెళుతుండగా, ఎదురుగా వస్తున్న ట్రాన్సిట్ మిక్సర్‌ను ఢీకొట్టిందని స్థానికులు తెలిపారు.
Maharashtra accident | సీఎం సంతాపం
మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ (Devendra Fadnavis) ఈ ప్రమాదంపై స్పందించారు. అత్యంత విషాదకరమైనదిగా అభివర్ణించారు. ఈ విషయంపై ప్రభుత్వం స్థానిక యంత్రాంగంతో సంప్రదింపులు జరుపుతోందని ఆయన తెలిపారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు. కాగా ఆరుగురికి మాత్రమే అనుమతి ఉన్న వ్యాన్‌లో 11 మంది ప్రయాణికులు ఉన్నారని పేర్కొన్నారు.
Maharashtra accident | రోడ్డు పనులతో..
హైవేపై పనులు జరుగుతున్నాయి. దీంతో ఒక వైపు రోడ్డు మూసివేశారు. దీంతో వాహనాల రాకపోకలను ఒకే లేన్‌కు పరిమితం చేశారు. ఈ క్రమంలో వ్యాన్‌ను ఎదురుగా ట్రక్కు ఢీకొంది. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
ఇది కూడా చదవండి : Smart Number Plate Scam | పోలీసులకు చిక్కకుండా ప్లాన్.. టెక్నాలజీతో కారు నంబర్ ప్లేట్ మార్పు
