Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Singur dam safety | సింగూర్​ డ్యామ్​ సేఫ్టీ పనులు వేగంగా పూర్తి చేయాలి: మంత్రి రాజనర్సింహ
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

తాజా వార్తలు - Singur dam safety | సింగూర్​ డ్యామ్​ సేఫ్టీ పనులు వేగంగా పూర్తి చేయాలి: మంత్రి రాజనర్సింహ

తాజా వార్తలు

Singur dam safety | సింగూర్​ డ్యామ్​ సేఫ్టీ పనులు వేగంగా పూర్తి చేయాలి: మంత్రి రాజనర్సింహ

రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ సింగూర్ డ్యామ్ సేఫ్టీ పనులను పరిశీలించారు. పనులు వేగంగా పూర్తి చేయాలని ఆదేశించారు.

Srinivas kolluri
Last updated: ఏప్రిల్ 13, 2026 7:56 సా.
Srinivas Kolluri
3 రోజులు ago
Share
Singur dam safety

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Singur dam safety | రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ (Minister Rajanarsimha) సింగూర్ డ్యామ్ (Singur Project) సేఫ్టీ పనులను సోమవారం పరిశీలించారు. వచ్చే 50 ఏళ్లు సింగూరు ప్రాజెక్టు డ్యాం నిలిచేలా (నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ నిబంధనల మేరకు) నిర్మాణ పనులను చేపట్టాలని మంత్రి ఇరిగేషన్ అధికారులను ఆదేశించారు.

సింగూర్​ ప్రాజెక్ట్ భద్రతపై గతేడాది ఎన్​డీఎస్​ఏ (NDSA) ఆందోళన వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. దీంతో గత వానాకాలంలో ప్రాజెక్ట్​లో నీటిని పూర్తిస్థాయిలో నిల్వ చేయలేదు. ఫలితంగా యాసంగి సీజన్​లో సింగూర్​, ఘనపురం ఆనకట్ట పరిధిలోని వేలాది ఎకరాల భూములకు సాగునీరు అందలేదు. ప్రస్తుతం డ్యామ్​లో నీటి మట్టం తగ్గడంతో అధికారులు వేగంగా మరమ్మతులు చేపడుతున్నారు. ఈ క్రమంలో మంత్రి పనులను పరిశీలించారు.

Singur dam safety | పర్యాటకంగా అభివృద్ధి

సింగూర్ ప్రాజెక్టులో ఉన్న ఐలాండ్ అభివృద్ధిపై టూరిజం అధికారులతో మంత్రి చర్చించారు. ఐలాండ్ అభివృద్ధి, బోటింగ్, పార్కులు, గార్డెన్ బ్యూటిఫికేషన్, కాటేజిల నిర్మాణం, రెస్టారెంట్, వాటర్ స్పోర్ట్స్ ఏర్పాట్లపై సూచనలు చేశారు. త్వరలో సింగూర్ డ్యాం సేఫ్టీ పనులతో పాటు టూరిజం అభివృద్ధి పై ఉన్నత స్థాయిలో సమీక్ష సమావేశం నిర్వహించాలని మంత్రి అధికారులను ఆదేశించారు.

పెద్దారెడ్డి పేట ఎత్తిపోతల పథకం పనులపై సైతం మంత్రి సమీక్షించారు. అనంతరం ఆందోల్ పెద్ద చెరువు ట్యాంక్ బండ్ బ్యూటిఫికేషన్​తో పాటు పర్యాటకంగా అభివృద్ధి చేయడంపై చర్చించారు. అందోల్ నియోజకవర్గంలో నిర్మిస్తున్న ఇంటిగ్రేటెడ్ స్కూల్ పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు.

దీనిని కూడా చదవండి : Land Survey Rovers | రోవర్లతో పక్కాగా భూ సర్వే.. మంత్రి పొంగులేటి

Anirudh Hyderabad Concert | అనిరుధ్ సంగీత సందడి.. ఘనంగా ‘రాక్‌స్టార్ అనిరుధ్ XV’ కచేరీ
Fast Eating Risks | వేగంగా భోజనం చేస్తున్నారా.. అయితే ఈ ముప్పు తప్పదు!
Telangana Congress Women President | తెలంగాణ కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలిగా ఎర్రబెల్లి స్వర్ణ
KTR Fitness Training | పొట్టను దాచిపెట్టడం విసుగొచ్చింది.. త్వరలోనే 50 లోకి అడుగు : కేటీఆర్​
Unseasonal Rains Telangana | మళ్లీ అకాల వర్షాలు..
TAGGED:dam safety worksSingur dam safetySingur project newstelangana irrigationwater management India
Share This Article
Facebook Whatsapp Whatsapp
Srinivas kolluri
BySrinivas Kolluri
Follow:
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Previous Article Maharashtra accident Maharashtra accident | వ్యాన్​ను ఢీకొన్న సిమెంట్​ మిక్సర్​ ట్రక్కు​.. 12 మంది మృతి
Next Article Food Adulteration Food Adulteration | కల్తీ మాఫియాకు సీపీ సజ్జనార్​ వార్నింగ్​
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?